ETV Bharat / sports

IPL ఫ్రాంచైజీలకు BCCI వార్నింగ్!- అలా చేస్తే చర్యలు తప్పవట - BCCI Warns IPL Teams

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 15, 2024, 8:40 PM IST

BCCI Warns IPL Teams
BCCI Warns IPL Teams

BCCI Warns IPL Teams: ఐపీఎల్‌ లైవ్‌ మ్యాచ్‌ల ఫొటోలు, వీడియోలు షేర్‌ చేయడంపై బీసీసీఐ తీవ్రంగా స్పందించింది. కొందరు కామెంటేర్‌లు, ఫ్రాంచైజీలపై చర్యలు కూడా తీసుకుంది. ఇలా ప్రసార హక్కులు ఉల్లంఘిస్తే ఏం చేయనుందంటే?

BCCI Warns IPL Teams: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ప్రసార నియమాలకు సంబంధించి బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. లైవ్ గేమ్‌ల ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్​ చేయడం పట్ల కఠిన చర్యలు తీసుకునే ఆలోచనలో ఉంది. ఇటీవల టీమ్‌ఇండియా మాజీ ప్లేయర్‌ మ్యాచ్‌ జరుగుతుండగా తన పిక్చర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో అతడు IPL పార్ట్‌నర్స్‌ స్టార్ స్పోర్ట్స్, వయాకామ్ 18 మీడియా బ్రాడ్‌కాస్టింగ్‌ రైట్స్‌ని ఉల్లంఘించినట్లు అయింది. ఈ ఘటనతో కామెంటేటర్‌లు లైవ్‌ మ్యాచ్‌ ఫొటోలు, వీడియోలు పోస్టు చేయడంపై కఠిన చర్యలు తీసుకుంటోంది.

ఈ వ్యవహారాలను పర్యవేక్షించే బీసీసీఐ అధికారి, తక్షణమే ఫొటో పోస్టు చేసిన మాజీ ఆటగాడిని బాధ్యతల నుంచి తొలగించమని సూచించారు. ఇలానే సోషల్‌ మీడియాలో పోస్టులు చేసిన ఓ ఐపీఎల్‌ టీమ్‌కి రూ.9 లక్షల జరిమానా విధించారు. ఇలా ప్రసార నిబంధనలు ఉల్లంఘించే ప్లేయర్‌లు, కామెంటేటర్‌లు, ఐపీఎల్ టీమ్‌ ఓనర్లకు బీసీసీఐ కొత్త నిబంధనలు అమలు చేస్తోంది.

నియమాలు ఉల్లంఘిస్తే చర్యలు
ఓ బీసీసీఐ అధికారి రీసెంట్​గా మీడియాతో మాట్లాడాడు.'ఐపీఎల్ హక్కుల కోసం ప్రసారకర్తలు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించారు. కామెంటేటర్‌లు సోషల్ మీడియాలో మ్యాచ్ రోజున వీడియోలు లేదా ఫొటోలు పోస్ట్‌ చేయకూడదు. కొందరు కామెంటేటర్‌లు ఇన్‌స్టాగ్రామ్ లైవ్, గ్రౌండ్‌ నుంచి ఫొటోలు పోస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక వీడియోకు మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఐపీఎల్‌ టీమ్‌లు కూడా లైవ్ గేమ్‌ల వీడియోలను పోస్ట్ చేయలేవు. పరిమిత సంఖ్యలో ఫొటోలు పోస్టు చేయడానికి మాత్రమే టీమ్‌లకు అవకాశం ఉంటుంది. అలానే అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో లైవ్‌ మ్యాచ్ అప్‌డేట్‌లను షేర్‌ చేయగలరు. ప్రసార నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే ఫ్రాంచైజీకి జరిమానా విధిస్తాం' అని పేర్కొన్నారు.

ఐపీఎల్‌ ప్లేయర్‌లు, సిబ్బందిపై నిఘా
ప్రతి ఒక్కరూ నిబంధనలకు కట్టుబడి ఉండేలా, ఐపీఎల్‌ మ్యాచ్‌లకు హాజరైన కామెంటేటర్‌లు, టీమ్‌లు, ప్లేయర్‌లు, ఇతర సిబ్బంది పోస్ట్‌ చేసే కంటెంట్‌ను పర్యవేక్షించడానికి బీసీసీఐ నిర్దిష్ట సిబ్బందిని కేటాయించింది. కొంతమంది ఆటగాళ్ళు మ్యాచ్ రోజులో పోస్టు చేసిన ఫోటోలు కూడా తొలగించమని అడిగిన సందర్భాలు ఉన్నాయని బీసీసీఐ అధికారి వివరించారు.

లాస్ట్​ ఓవర్​లో ధోనీ ధమాకా- 3 సిక్స్​లు ఎన్నిసార్లు బాదాడంటే? - Dhoni 3 Sixes IPL

IPLలో స్పెషల్ జెర్సీలు- ఒక్కో జట్టుది ఒక్కో స్టోరీ- మీకు తెలుసా? - Special Jersey In IPL

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.