ETV Bharat / sports

లబుషేన్ కళ్లు చెదిరే క్యాచ్​ - 86 పరుగులకే వెస్టిండీస్​ ఆలౌట్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 6, 2024, 1:23 PM IST

AUS Vs WI 3RD ODI 2024 : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో వెస్టిండీస్ ఘోరంగా విఫలమయ్యింది. 86 పరుగలకే ఆలౌటైంది. లక్ష్యాన్ని ఆసీస్ సునాయాసంగా ఛేదించింది. అయితే ఈ మ్యాచ్​లో ఆసీస్​ ప్లేయర్​ లబుషేన్​ కళ్లు చెదిరేలా క్యాచ్​ను అందుకున్నాడు.

AUS Vs WI Marnus Labuschange
AUS Vs WI Marnus Labuschange

AUS Vs WI 3RD ODI 2024 : గత వారం రోజులుగా అంతర్జాతీయ క్రికెట్‌లో అబ్బురపరిచే ఫీల్డింగ్ విన్యాసాలు జరుగుతున్నాయి. భారత్-ఇంగ్లాండ్​ టెస్ట్ సిరీస్‌లో రోహిత్ శర్మ, బెన్ స్టోక్స్, శ్రేయస్ అయ్యర్ లాంటి స్టార్​ ప్లేయర్ల క్యాచ్‌లను మరువకముందే మరికొన్ని అద్భుతాలు జరిగాయి. ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య జరిగిన మూడో వన్డేలో ఆసీస్​ బ్యాటర్ మార్నస్ లబుషేన్ అద్భుతంగా మెరుపు వేగంతో క్యాచ్​ను అందుకున్నాడు.

ఆసీస్​ ఫాస్ట్ బౌలర్ లాన్స్ మోరిస్ వేసిన ఔట్​సైడ్​ ఆఫ్​ స్టంప్​ బాల్​ను వెస్టిండీస్​ బ్యాటర్ కార్టీ షాట్​ కొట్టేందుకు ప్రయత్నించాడు. ఆ బంతిని పట్టుకునేందుకు లబుషేన్ పక్షిలా గాల్లోకి ఎగిరి క్యాచ్​ను అందుకున్నాడు. ఆ సమయంలో లబుషేన్ శరీరం నేలకు సమాంతరంగా ఎగిరి మరి క్యాచ్​ను పట్టుకోవటం విశేషం. దీంతో వెస్టిండీస్ బ్యాటర్​ కీసీ కార్టీ(22 బంతుల్లో 10 పరుగులు) వెనుదిరిగాడు. లబుషేన్ ఈ క్యాచ్​ను పట్టిన తీరుకు వ్యాఖ్యాతలు కూడా ఫిదా అయ్యారు. ఈ క్రెడిట్​ బౌలర్​కు చెందాల్సినది కాదని ఫీల్డర్​కు దక్కాలని అన్నారు. అయితే లాన్స్ మోరిస్​కు ఇదే తొలి అంతర్జాతీయ వికెట్ కావడం విశేషం​. ఈ మ్యాచ్​తోనే మోరిస్​ అంతర్జాతీయ క్రికెట్​ల్లో అరంగేట్రం చేశాడు.

రెండో వన్డేలోనూ సూపర్ క్యాచ్
అంతకుముందు రెండో వన్డేలో ఆసీస్​ ఫీల్డర్​ కామెరూన్ గ్రీన్ అద్భుతమైన క్యాచ్​ను పట్టుకున్నాడు. అబాట్​ బౌలింగ్​లో రోస్టన్​ చేజ్​ షాట్​ తీసేందుకు ప్రయత్నించాడు. మిడ్​ వికెట్​లో ఉన్న కామెరూన్​ గ్రీన్​ మెరుపు వేగంతో తన ఎడమవైపునకు దూకి క్యాచ్​ను పట్టాడు.

విండీస్ ఘోర ఓటమి
ఇకపోతే ఈ మూడో వన్డే మ్యాచ్​లో విండీస్​ ఘోరంగా ఓటిమిపాలైంది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్​కు దిగిన విండీస్‌ కేవలం 86 పరుగులకే కుప్ప​కూలింది. ఆసీస్​ జట్టులో యువ పేసర్‌ జేవియర్ బార్ట్‌లెట్ 4 వికెట్లు, లాన్స్‌ మోరిస్‌, జంపా రెండు వికెట్లతో విండీస్​ను ఓడించారు. వెస్టిండీస్ బ్యాటర్లలో ఎనిమిది మంది బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 6.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 87 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. కాగా, రెండు టెస్ట్​లు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్​ల్లో తలపడేందుకు వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చింది. టెస్ట్​ మ్యాచ్​ను 1-1తో సమంగా నిలిచింది. వన్డే​లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఆస్ట్రేలియానే విజయం సాధించడంతో సిరీస్​ ఈ జట్టుకే దక్కింది. ఇక నేడు(ఫిబ్రవరి 6) మంగళవారం నామమాత్రంగా కాన్​బెర్రా వేదికగా జరిగిన మూడో వన్డేలోనూ విండీస్ ఘోరంగా ఓటిమిపాలైంది.

దారుణం - స్టార్​ క్రికెటర్​ను గన్​తో బెదిరించి దాడి!

మూడో టెస్ట్​కు కోహ్లీ - రాహుల్ ద్రవిడ్​​ ఇలా అన్నాడేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.