ETV Bharat / sports

హాంగ్​కాంగ్​ను​ చిత్తు చేసి సెమీస్​లోకి ఎంట్రీ - తొలి పతకాన్ని ముద్దాడనున్న భారత్

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 16, 2024, 1:02 PM IST

Updated : Feb 16, 2024, 1:49 PM IST

Asia Badminton Championship 2024
Asia Badminton Championship 2024

Asia Badminton Championship 2024 : మలేసియాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఆసియా టీమ్​​ ఛాంపియన్‌షిప్‌ క్వార్టర్స్​లో హాంగ్​కాంగ్​ను ఢీకొన్న భారత మహిళల జట్టు​ సెమీస్​లోకి అడుగుపెట్టింది. ఈ గెలుపుతో భారత్​ ఖాతాలోకి మరో మెడల్​ వచ్చి చేరనుంది. కాగా, బ్యాడ్మింటన్​ చరిత్రలో తొలిసారి ఆసియా బ్యాడ్మింటన్ టీమ్​​ ఛాంపియన్‌షిప్‌ పతకాన్ని గెలవనుంది భారత్​.

Asia Badminton Championship 2024 : ఆసియా బ్యాడ్మింటన్ టీమ్​​ ఛాంపియన్‌షిప్‌ క్వార్టర్​ ఫైనల్స్​లో హాంగ్​కాంగ్​ను చిత్తు చేసి సెమీస్​కు అర్హత సాధించిన భారత మహిళల జట్టు తన ఖాతాలో మరో పతకాన్ని ఖాయం చేసుకుంది. దీంతో బ్యాడ్మింటన్​ చరిత్రలోనే తొలిసారి ఆసియా బ్యాడ్మింటన్ టీమ్​​ ఛాంపియన్‌షిప్‌లో మెడల్​ను గెలవనుంది భారత్​. మలేసియాలో జరుగుతున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో శుక్రవారం జరిగిన క్వార్టర్స్​ మ్యాచ్​లో హాంగ్​ కాంగ్‌పై భారత్​ 3-0 తేడాతో విజయం సాధించింది. ఈ పోరులో హాంగ్​కాంగ్​కు చెందిన లోయర్​ సీడ్​ షట్లర్​ సిన్​ యాన్​ హ్యాపీని తన అద్భుత ప్రదర్శనతో కట్టడి చేసింది సింధు. ఈ మ్యాచ్​లో 21-7, 16-21, 21-12 తేడాతో సిన్​పై గెలిచి భారత్​కు ఆధిక్యాన్ని అందించింది.

మరోవైపు మహిళల డబుల్స్‌లో షట్లర్లు తనీషా క్రాస్టో, అశ్విని పొన్నప్ప జోడీ ప్రపంచ నెం.18 ద్వయం యెంగ్​ న్గా టింగ్, యెంగ్​ పుయ్​ లామ్​(హాంగ్​కాంగ్​)పై 21-10, 21-14తో నెగ్గి భారత్​ను సెమీస్​ రేసులో నిలిపారు. మహిళల సింగిల్స్​లో అశ్మితా చలిహా 21-12, 21-13తో చైనీస్​ ప్లేయర్​ యెంగ్ సమ్ యీపై క్వార్టర్ ఫైనల్​లో నెగ్గింది. తదుపరి క్వార్టర్​ ఫైనల్​ మ్యాచ్​ జపాన్​-చైనా మధ్య జరగనుంది. ఇందులో నెగ్గిన జట్టుతో భారత్​ సెమీస్​లో తలపడనుంది.

సింధు సూపర్​ కమ్​బ్యాక్​
గాయం కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్​షిప్స్​ 2024 టోర్నమెంట్​తో అదిరిపోయే కమ్​బ్యాక్ ఇచ్చింది భారత స్టార్ షట్లర్ పీవీ సింధు. నాలుగు నెలల విరామం తర్వాత బరిలోకి దిగిన సింధు అదరగొట్టింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్​లో చైనీస్ టాప్ సీడ్ హాన్ యుతో తలపడ్డ సింధు 40 నిమిషాల్లోనే ఆటను ముగించింది. హాన్ యుపై సింధు 21-17, 21-15 తేడాతో నెగ్గింది. దీంతో ఛాంపియన్​షిప్స్​ నాకౌట్​లో చైనాతో తలపడ్డ భారత్ తొలి మ్యాచ్​లోనే నెగ్గి 1-0 లీడ్​లోకి దూసుకెళ్లింది.

ఇక ఈ టోర్నమెంట్​లో చివరి గ్రూప్​ పోరులో భారత్​ 2-3తో చైనా చేతిలో ఓడింది. సింగిల్స్​లో ప్రణయ్​ 6-21, 21-18, 21-19తో వెంగ్​ హాంగ్​పై గెలిచి భారత్​కు శుభారంభం అందించాడు. కానీ, డబుల్స్​లో అర్జున్​-ధ్రువ్​ జోడీ 15-21, 21-19, 19-21తో చెన్​ యంగ్​-లీ యీ జంట చేతిలో ఓడడం వల్ల స్కోర్లు సమమయ్యాయి.

డెబ్యూ రనౌట్​పై సర్ఫరాజ్​ రియాక్షన్​- ఇలాంటివి మామూలే అంటూ!

బౌలర్లుగా కెరీర్ స్టార్ట్​- బ్యాటర్లుగా రికార్డులు- ఆ ఐదుగురు క్రికెటర్లు వీరే

Last Updated :Feb 16, 2024, 1:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.