ETV Bharat / spiritual

ఈ వారం ఆ రాశి వారికి బిజినెస్​లో మస్త్ లాభాలు- విద్యార్థులు జాగ్రత్తగా ఉండాల్సిందే! - Weekly Horoscope

author img

By ETV Bharat Telugu Team

Published : May 5, 2024, 3:59 AM IST

Weekly Horoscope From May 05th to 11th 2024 : 2024 మే 5వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే ?

Weekly Horoscope
Weekly Horoscope (ETV Bharat)

Weekly Horoscope From May 05th to 11th 2024 : 2024 మే 5వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే ?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఖర్చులు పెరిగినా ఆదాయం కూడా వృద్ధి చెందుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని మధురస్మృతులు నెమరు వేసుకుంటారు. భవిష్యత్ పట్ల ఆశాభావంతో ఉండండి. బంధుమిత్రులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. వ్యాపారులు వ్యాపార వృద్ధి కోసం మరిన్నిపెట్టుబడులు పెట్టవచ్చు. ఉద్యోగులకు సాధారణంగా ఉంటుంది. ఉన్నత విద్యకు సిద్ధమవుతున్నవారు మనోబలంతో పెద్దల ఆశీస్సులతో ముందడుగు వేస్తే విజయం సాధిస్తారు. స్థిరాస్తి రంగం వారు కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి శుభ సమయం. రాజకీయ నాయకులు విజయం దిశగా పయనిస్తున్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. శివారాధన శుభప్రదం.

.

వృషభం (Taurus) : ఈ వారం వృషభ రాశి వారికి ప్రశాంతంగా సాగిపోతుంది. ఈ రాశి వారికి మనోబలం, జ్ఞానం పెరుగుతుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు దృఢపడతాయి. ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తారు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. నూతన అవకాశాల కోసం అన్వేషిస్తున్న ఉద్యోగులకు ఇది చాలా మంచి సమయం. విజయంతో పాటు ప్రమోషన్ మరియు ఆర్ధిక ప్రయోజనాలు కూడా తప్పకుండా ఉంటాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఒక ఎదురుచూడని శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. విద్యార్థులు శ్రమిస్తే మంచి విజయాలను పొందగలరు. మీ ఇంటికి గురువులు, గొప్పవారు రావడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. రాజకీయ నాయకులకు శుభ సమయం నడుస్తోంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ప్రగతి పథంలో పయనిస్తారు. ఎంచుకున్న రంగంలో ఘన విజయాలను సొంతం చేసుకుంటారు. చాలా కాలంగా వాయిదా పడ్డ పనులన్నీ ఈ వారం పూర్తవుతాయి. సన్నిహితుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. కుటుంబంలో శాంతి, సౌఖ్యం నెలకొంటాయి. విద్యార్థులు కొత్తగా కోర్సులు చేరడానికి మంచి సమయం. మీ గురువుల సహకారం మీకు సంపూర్ణంగా ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలను అందుకుంటారు. ఉద్యోగులకు స్వస్థాన ప్రాప్తి ఉంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. రాజకీయ నాయకులకు ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. ఈ వారమంతా శుభకార్యాలు, పూజలు, భజనలు వంటి కార్యక్రమాలు నిర్వహించడంలో తీరిక లేకుండా ఉంటారు. తీర్థయాత్రల ద్వారా ఆనందం మరియు మానసిక ప్రశాంతతను పొందుతారు. వివాహితులకు వైవాహిక జీవితం ఆనందకరంగా ఉంటుంది. కుటుంబ పెద్దల నుంచి బహుమతులు అందుకుంటారు. ఆర్థిక స్థితి గణనీయంగా పెరుగుతుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సాధిస్తారు. వ్యాపారులు ఆధునిక వ్యాపార పద్ధతులపై దృష్టి సారిస్తే మంచిది. విద్యార్థులకు మంచి సమయం. గొప్ప విజయాలను సాధిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. రాజకీయంలో ఉండేవారికి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. గణపతి ధ్యానం మేలు చేస్తుంది.

.

సింహం (Leo) : ఈ వారం సింహరాశి వారికి అంత అనుకూలంగా లేదు. మానసికంగా బలహీనంగా ఉంటారు. మీరు గతంలో చేసిన పనికి ఫలితాలు రావడానికి కొంత సమయం పట్టవచ్చు. నిరాశ చెందకండి. అన్నీ అనుకూలంగా మారుతాయి. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. నూతన అవకాశాలు అందుకుంటారు. ఈరోజు పెట్టే పెట్టుబడుల ద్వారా భవిష్యత్తులో ఆర్థిక లాభాలు ఉంటాయి. కొత్తగా కాలేజ్​లో చేరబోతున్న విద్యార్థులు ఆచి తూచి స్నేహితులను ఎంచుకుంటే మంచిది. తీరిక లేని పనులతో ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. ఆర్ధికంగా ఆశించిన ప్రయోజనాలు ఉండక పోవచ్చు. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. రాజకీయ నాయకులకు శుభ సమయం నడుస్తోంది. ఈశ్వరుని ఆలయ సందర్శనం మేలు చేస్తుంది.

.

కన్య (Virgo) : కన్య రాశి వారికి, ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వారం మొదటి భాగంలో కొన్ని నష్టాలు ఉన్నప్పటికీ, ద్వితీయార్థంలో ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారస్తులకు ఈ వారం ఊహించని లాభాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు వృత్తి నిపుణులకు శుభసమయం. చేసే ప్రతి పనిలోనూ విజయం వెన్నంటే ఉంటుంది. మీ సూక్ష్మబుద్ధి, సృజనాత్మకత ద్వారా సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్ధిక పురోగతి ఉంటుంది. రాజకీయ నాయకులకు పరపతి, హోదా పెరుగుతుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. మీకు అప్పగించిన ముఖ్యమైన బాధ్యతలు పూర్తి చేయడానికి మీ పూర్తి శక్తి సామర్ధ్యాలను పణంగా పెట్టాలి. మీ పనిలో ఆటంకాలు సృష్టించాలని మీ ప్రత్యర్ధులు పొంచి ఉన్నారు. ఏ మాత్రం ఏమరుపాటు లేకుండా ఉండాలి. వ్యాపారులు విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంది. పోటీదారుల నుంచి గట్టి పోటీ ఉంటుంది. గృహంలో అలజడి నెలకొంటుంది. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెట్టాలి. విదేశీయానం కోరుకునే వారు వ్యూహాత్మకంగా పని చేస్తే విజయం సొంతమవుతుంది. రాజకీయ నాయకులకు పదవీ యోగం ఉంది. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచి విజయాలు ఉంటాయి.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. రావాల్సిన బకాయిలు వసూలవుతాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం మీ వైపే ఉంటుంది. ముఖ్యమైన వ్యహారాలు వాయిదా వేయకుండా త్వరితగతిన పూర్తి చేస్తే అద్భుతమైన విజయాలు ఉంటాయి. వృత్తి నిపుణులు, ఉద్యోగస్తులు ఇతర ఆదాయ వనరులను కనుగొంటారు. వ్యాపారస్తులు విపరీతమైన లాభాలను అందుకుంటారు. చేసే పనిలో విజయం, ఆర్ధిక లాభాలు ఈ వారం వృశ్చిక రాశి వారిని ఆనందంలో ముంచెత్తుతాయి. అదనపు ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులు గురువులు చూపిన మార్గంలో వెళ్లడం మేలు చేస్తుంది. రాజకీయ నాయకులకు విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ వారం నెగ్గాలంటే తగ్గాలి అన్న సూత్రానికి కట్టుబడి ఉంటే మేలు. కొన్ని సాధించాలంటే తెలివి ఒక్కటే సరిపోదు సమయస్ఫూర్తి కూడా ఉండాలని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. మీకు అప్పగించిన బాధ్యతలు ఏవైనా చిత్తశుద్ధితో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ప్రత్యర్థులతో అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యం సహకరిస్తుంది. విద్యార్థులు మితిమీరిన ఆత్మవిశ్వాసం వీడి కర్తవ్యంపై దృష్టి పెడితే మంచిది. వ్యాపారులకు అదృష్టం వరిస్తుంది. మంచి విజయాలను అందుకుంటారు. రాజకీయ నాయకులకు శ్రమతో కూడిన విజయాలు ఉంటాయి. శ్రీలక్ష్మి గణపతి స్తోత్రం పఠిస్తే మేలు.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా ప్రశాంతత లోపిస్తుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు మెరుగు పరుచుకుంటే మంచిది. లేకుంటే సన్నిహితుల మధ్య అపార్ధాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగస్తులకు స్దాన చలనం ఉండవచ్చు. వృత్తి వ్యాపార నిపుణులు ఒక చిన్న తప్పిదానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. పోటీదారులతో విభేదాలు ఏర్పడే అవకాశముంది. రాజకీయ నాయకులు ప్రత్యర్థులపై విజయానికి శాయశక్తులా కృషి చేయాలి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు చేసే వారికి మెరుగైన ప్రయోజనాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కొత్త లక్ష్యాలను ఏర్పరచుకొని ముందుకు సాగుతారు. గృహాలంకరణ కోసం ధనవ్యయం ఉంటుంది. ఖర్చులు పెరిగినా కొత్త ఆదాయ మార్గాలు కూడా అభివృద్ధి చెందుతాయి, కాబట్టి డబ్బు ప్రవాహం ఊహించని విధంగా కొనసాగుతుంది. ఉద్యోగస్తులకు అనుకోని విధంగా పని ఒత్తిడి పెరుగుతుంది. అయితే మీ సన్నిహితుల సహకారంతో అన్నీ పనులు సకాలంలో పూర్తి చేస్తారు. రాజకీయ నాయకులకు విజయం తప్పకుండా ఉంటుంది. సంఘంలో పరపతి పెరుగుతుంది. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచి విజయాలు ఉంటాయి.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వృత్తి నైపుణ్యాలను పెంచుకుంటారు. మీ అభివృద్ధికి ఇది ఎంతో అవసరం. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కీలకమైన సమాచారం అందుకుంటారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారు ఊహించని లాభాలు అందుకుంటారు. మీ ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలలో ఖర్చులు అధికంగా ఉంటాయి. రాజకీయ నాయకులు విజయం కోసం శ్రమించాలి. కార్య సిద్ధి హనుమాన్ ను పూజిస్తే శుభ ఫలితాలు ఉంటాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.