ETV Bharat / politics

నా అనుకున్న వాళ్లను జగనన్న నాశనం చేశారు : వైఎస్ షర్మిల - lok Sabha Elections 20224

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 2, 2024, 7:34 PM IST

Congress fields YS Sharmila from Kadapa : చిన్నాన్నను హత్య చేయించిన వాళ్లను జగన్ వెనకేసుకొస్తున్నారని షర్మిల ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున కడప ఎంపీగా పోటీ చేయనున్నట్లు తెలిపారు. వివేకాను చంపించిన అవినాష్‌కు జగన్ టికెట్ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వివేకా కోరికను నెరవేర్చడానికే కడప ఎంపీగా బరిలో దిగుతున్నట్లు షర్మిల పేర్కొన్నారు.

LOK SABHA ELECTIONS 20224
Congress fields YS Sharmila from Kadapa

YS Sharmila Contest from Kadapa : తన చిన్నాన్న వివేకానంద రెడ్డిని హత్య చేయించిన అవినాష్ రెడ్డికి జగన్ వైసీపీ టికెట్ ఇవ్వడాన్ని తట్టుకోలేకనే తాను కడప ఎంపీగా బరిలోకి దిగుతున్నానని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద తల్లి విజయమ్మ, కుమార్తె అంజలి రెడ్డితో కలిసి వైఎస్ షర్మిల నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాలు తండ్రి సమాధి వద్ద ఉంచి షర్మిల ఆశీర్వాదం తీసుకున్నారు.

వివేకా హంతకులను జగన్ కాపాడుతున్నారు : తన అనుకున్న వాళ్లను జగనన్న నాశనం చేశారని వైఎస్ షర్మిల ఆరోపించారు. జగన్ హత్యా రాజకీయాలను ప్రోత్సహించారని విమర్శించారు. చిన్నాన్నను హత్య చేయించిన వాళ్లను జగన్ వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. వివేకానందరెడ్డిని హత్య చేసిన వాళ్లకే జగన్‌(AP CM Jagan) కడప ఎంపీ టికెట్‌ ఇచ్చారని ఆరోపించారు. వివేకా హంతకులను జగన్ కాపాడుతున్నారని, వివేకాను చంపించిన అవినాష్‌కు జగన్ టికెట్ ఇవ్వడం తట్టుకోలేకపోతున్నట్లు తెలిపారు. సాక్ష్యాధారాలు ఉన్నా వివేకా హంతకులు నేటికీ తప్పించుకొని తిరుగుతున్నారని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది : 'ఎన్నికల ముందు నువ్వు నా చెల్లివి కాదు, నా బిడ్డ అని జగన్ అన్నారు, ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా మారిపోయారు' అని వైఎస్ షర్మిల విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏపీ సీఎం జగన్​తో తనకు ఎలాంటి పరిచయం లేదని ఎద్దేవా చేశారు. జగన్ అంటే తనకు ఎలాంటి ద్వేషం లేదని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయిందని ఎద్దేవా చేశారు. దారుణంగా చిన్నాన వివేకాను చంపితే, గుండెపోటుతో చనిపోయారని సాక్షి టీవీలో మెుదట చూపించారని పేర్కొన్నారు. ప్రజలు హర్షించరని తెలిసి కూడా అవినాష్‌కే, సీఎం జగన్‌ టికెట్‌ ఇచ్చారని తెలిపారు. తాను ఎంపీగా పోటీ చేయాలనేది చిన్నాన్న చివరి కోరిక అని, వివేకా కోరికను నెరవేర్చడానికే కడప ఎంపీగా బరిలో దిగుతున్నట్లు పేర్కొన్నారు.

సునీత న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నా కనికరం లేకుండా, ఆమెపైనే ఆరోపణలు చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. వైఎస్సార్‌ బిడ్డగా తాను ఏం చేయాలో ఆలోచించానని, హత్యా రాజకీయాలకు తాను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. రాజన్న రాజ్యం తెస్తానన్న జగన్, రాక్షస రాజ్యం తెచ్చారని మండిపడ్డారు. అందుకే కడప నుంచి పోటీ చేస్తున్నట్లు వైఎస్ షర్మిల తెలిపారు.

నా అనుకున్న వాళ్లను జగనన్న నాశనం చేశారు. చిన్నాన్నను హత్య చేయించిన వాళ్లను జగన్ వెనకేసుకొస్తున్నారు. రాజశేఖర రెడ్డి బిడ్డగా కడప ప్రజల ముందుకు వస్తున్నా. బీజేపీ నేతల కోసం వైసీపీ పని చేసింది. ఒక్క చాన్స్ ఇస్తే , రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. బీజేపీకి వైసీపీ నేతలు బానిసగా మారారు. రాష్ట్రాన్ని గంజాయికి రాజధానిగా మార్చారు. మద్యపాన నిషేధం పేరుతో మహిళలను మోసం చేశారు. కాంగ్రెస్‌ పార్టీని ఆశీర్వదించి అవకాశం ఇవ్వాలి. -షర్మిల, ఏపీసీసీ చీఫ్​

నా అనుకున్న వాళ్లను జగనన్న నాశనం చేశారు : వైఎస్ షర్మిల

'అన్నా' అని పిలుచుకున్నవారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారు - వైఎస్ షర్మిల

ఉమ్మడి రాజధానికి మరో రెండేళ్లంటే - ఇన్నాళ్లు గుడ్డి గుర్రానికి పళ్లు తోమినట్లా?: వైఎస్​ షర్మిల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.