ETV Bharat / politics

'అన్నా' అని పిలుచుకున్నవారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారు - వైఎస్ షర్మిల

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 15, 2024, 2:50 PM IST

Updated : Mar 15, 2024, 3:51 PM IST

Sharmila Fires On YS Jagan in AP : అన్నా అని పిలుచుకున్న వారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా ఏపీలోని కడప జిల్లా పులివెందులలోని ఆయన సమాధి వద్ద కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం వైఎస్ వివేకా పార్కు వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Sharmila Fires On YS Jagan
Sharmila Fires On YS Jagan

Sharmila Fires On YS Jagan in AP : హత్య చేసింది ఎవరో కాదు బంధువులే అని అన్ని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయి.. హత్య జరిగి ఐదేళ్లయినా ఇంత వరకూ హత్యచేసిన, చేయించిన వాళ్లకు శిక్షపడలేదు. అన్నా అని పిలిపించుకున్నవారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన రాత్రి చివరి క్షణం వరకు చిన్నాన్న వైఎస్సార్సీపీ కోసమే పని చేశారని గుర్తు చేశారు. తన చిన్నాన్న చావుతో ఎక్కువ నష్టపోయింది చిన్నమ్మ, సునీత అని తెలిపారు. బాధితులకు భరోసా ఇవ్వాలన్న ఆలోచన లేకపోగా ఆరోపణలు చేస్తారా? అని మండిపడ్డారు.

సాక్షిలో పైన వైఎస్‌ ఫొటో, కింద ఆయన తమ్ముడి వ్యక్తిత్వ హననం జరుగుతోందని షర్మిల పేర్కొన్నారు. జగనన్న ఇంతగా దిగజారిపోతారని అనుకోలేదని అన్నారు. జగనన్నా అద్దం ముందు నిల్చొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీ మనస్సాక్షి ఏం చెబుతుందో వినండి అని హితవు పలికారు. వైఎస్‌ తన తోబుట్టువుల కోసం ఏం చేశారో మీకు తెలియదా? వైఎస్‌ వారసుడిగా తోబుట్టువుల కోసం మీరు ఏం చేశారు? అని షర్మిల ప్రశ్నించారు. చిన్నాన్న ఆత్మకు శాంతి కలగలేదనే ఆవేదన ఐదేళ్లుగా ఉందని వాపోయారు.

CBI Enquiry: "హత్యను గుండెపోటుగా మలిచిందెవరు.. తెల్లవారుజామున మీకు ఎలా తెలిసింది..?"

ఈ రోజు వరకు హంతకులకు శిక్ష ఎందుకు పడలేదు : చిన్నాన్న గుండెపోటుతో మరణించారని ప్రచారం చేశారు, ఆయన మృతి నమ్మలేని నిజం, దుర్మార్గ పాలన చక్రాల కింద నలిగిపోతూ న్యాయం కోసం పోరాటం చేస్తున్న నిప్పులాంటి నిజం అని షర్మిల పేర్కొన్నారు. సమాజంలో మంచి మనిషిని దుర్మార్గంగా చంపేశారని, ఐదేళ్లు గడిచినా న్యాయం జరగలేదంటే ఏమనాలి? అని ప్రశ్నించారు. ఈ రోజు వరకూ హంతకులకూ శిక్ష పడలేదు, చిన్నాన్నకే ఇలా అయితే ఇక సమాజంలో సామాన్యుల పరిస్థితేంటి? అని నిలదీశారు.

సునీత, తాను చిన్నప్పటి నుంచి కలిసే పెరిగామని షర్మిల తెలిపారు. సాయం చేయడంలో వివేకా ఎప్పుడూ ముందుండేవారని, ఆఖరిసారి మా ఇంటికొచ్చి కడప ఎంపీగా పోటీ చేయాలని అడిగారని షర్మిల గుర్తు చేసుకున్నారు. దాదాపు రెండు గంటలపాటు ఒప్పించే ప్రయత్నం చేశారని, తాను వద్దులే చిన్నాన్న అని ఎన్నిసార్లు చెప్పినా ఓపికగా మాట్లాడారని చెప్పారు. కడప ఎంపీ స్థానానికి నన్ను పోటీ చేయమని గట్టిగా కోరారని, అన్నీ అనుకూలిస్తే చేస్తాలే అని చెప్పేవరకు చిన్నాన్న వెళ్లలేదని తెలిపారు.

YS Sharmila Comments: వివేకాది రాజకీయ హత్యే.. అవినాష్‌కు వ్యతిరేకంగా నిలవడమే హత్యకు కారణం..!

Sharmila is Witness in Viveka Case: వివేకా హత్య కేసు.. సాక్షిగా వైఎస్‌ షర్మిల.. వాంగ్మూలం సమర్పించిన సీబీఐ

Last Updated : Mar 15, 2024, 3:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.