ETV Bharat / politics

వృద్ధులను పొట్టన పెట్టుకుంటారా? - పింఛన్ల పంపిణీలో ప్రభుత్వ తీరు దుర్మార్గం: వైఎస్‌ షర్మిల - YS Sharmila On Pension Distribution

author img

By ETV Bharat Telangana Team

Published : May 3, 2024, 2:15 PM IST

YS Sharmila Comments on Pension Distribution : ఏపీలో వృద్ధులకు పింఛన్ల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు దుర్మార్గమని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ప్రభుత్వానికి బానిసలు కావాల్సిన అవసరం ఐఏఎస్​లకు ఏముందని నిలదీశారు. వైసీపీకి మేలు చేయాలని నెలనెలా వృద్ధులను పొట్టన పెట్టుకుంటారా? అని ప్రశ్నించారు.

YS Sharmila Comments on Pension Distribution
YS Sharmila Comments on Pension Distribution (Etv Bharat)

వృద్ధులను పొట్టన పెట్టుకుంటారా? - పింఛన్ల పంపిణీలో ప్రభుత్వ తీరు దుర్మార్గం: వైఎస్‌ షర్మిల (ETV Bharat)

YS Sharmila Comments on Pension Distribution : ఏపీలో పింఛన్ల పంపిణీ ద్వారా ప్రతి నెలా ఇంతమందిని చంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారా? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. వృద్ధులకు పింఛన్ల పంపిణీలో వైసీపీ ప్రభుత్వం తీరు దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి బానిసలు కావాల్సిన అవసరం ఐఏఎస్‌లకు ఏముందని ప్రశ్నించారు. వైసీపీకి మేలు చేయాలని నెలనెలా ఇంతమందిని పొట్టన పెట్టుకుంటారా? అంటూ నిలదీశారు. కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడారు.

ఉద్యోగులను జగన్‌ ప్రభుత్వం మోసం చేసింది: ప్రభుత్వ ఉద్యోగులను జగన్‌ ప్రభుత్వం మోసం చేసిందని వైఎస్‌ షర్మిల విమర్శించారు. ఉద్యోగుల మొర ఆలకించే పరిస్థితి లేకుండా పోయిందన్న షర్మిల, ఎన్నిసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఉద్యోగులకు చివరికి వైద్య బిల్లులు కూడా బకాయిలు పెట్టారని ఆరోపించారు. ఉద్యోగులకు ప్రభుత్వం 22 వేల కోట్ల రూపాయల బకాయిపడిందని అన్నారు. ఉద్యోగుల బకాయిలపై ప్రభుత్వం స్పందించిన పాపానపోలేదని మండిపడ్డారు.

YS Sharmila Comments On Jagan Govt : 11వ పీఆర్‌సీ ప్రకారం ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఐఆర్‌లోనూ కోత విధించిందని వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 12వ పీఆర్‌సీ అమలు చేయాల్సిన ప్రభుత్వం, ఇంకా 11వ పీఆర్‌సీలోనే ఆగిందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న షర్మిల, ఉద్యోగుల పక్షాన కాంగ్రెస్‌ ఉంటుందని భరోసా ఇస్తున్నామన్నారు. ఒకటో తేదీన జీతాలు అందుకోవాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రతి నెల 15 నుంచి 25 తేదీల మధ్యలో జీతాలు అందుకోవడం ఎంటని ప్రశ్నించారు. ఇది అసమర్థ పాలనకు నిదర్శనం కాదా అని నిలదీశారు.

Sharmila Election Campaign : అనంతరం మైదుకూరులో ఎన్నికల ప్రచారంలో వైఎస్‌ షర్మిల పాల్గొన్నారు. పులివెందుల పులిబిడ్డ అని చెబుతూ మోదీ వద్ద పిల్లిగా వ్యవహరిస్తున్నారని షర్మిల అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజోలి ప్రాజెక్టు నిర్మిస్తానని, కుందూ నదిపై ఎత్తిపోతల పథకం చేపట్టేందుకు శంకుస్థాపన చేశారా అని ఆమె ప్రశ్నించారు. రైతులను అప్పుల పాలు చేశారన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులైన వైఎస్ అవినాష్ రెడ్డిని తన అధికారాన్ని ఉపయోగించి కాపాడుతున్నాడన్నారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి స్మగ్లింగ్​లో, మట్టి, ఇసుక మాఫియాతో పాటు అటవీ భూములను కబ్జా చేసి దోచుకున్నాడని ఆరోపించారు.

నా అనుకున్న వాళ్లను జగనన్న నాశనం చేశారు : వైఎస్ షర్మిల - lok Sabha Elections 20224

రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చారా? : రాష్ట్రానికి ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించలేదన్నారు. ఏటా సంక్రాంతికి జాబ్‌ క్యాలెండర్‌ అని జగన్‌ అన్నారని, జగన్‌ సీఎం అయ్యాక 5 సంక్రాంతులొచ్చాయి ఉద్యోగాలేవని ప్రశ్నించారు. ఒక్క జాబ్‌ క్యాలెండర్‌ అయినా వచ్చిందా? అని మండిపడ్డారు. పూర్తి మద్యపాన నిషేధమన్నారని, ఏమైందని నిలదీశారు. జగన్‌ సర్కారే మద్యం అమ్ముతోందని దుయ్యబట్టారు. వాళ్లు ఏ బ్రాండ్‌ పెడితే అవే తాగాలట అంటూ ఎద్దేవా చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు ఇక్కడ పెట్టారని. నాసిరకం మద్యం తాగి కిడ్నీ దెబ్బతిని చనిపోతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా చూసినా మాఫియాలే అని, వేల కేజీల్లో డ్రగ్స్‌ కంటైనర్లలో వస్తున్నాయని ఆరోపించారు.

నవ సందేహాల'కు సమాధానమివ్వండి - సీఎం జగన్‌కు వైఎస్ షర్మిల మరో లేఖ - YS Sharmila Letter to CM Jagan

ఉమ్మడి రాజధానికి మరో రెండేళ్లంటే - ఇన్నాళ్లు గుడ్డి గుర్రానికి పళ్లు తోమినట్లా?: వైఎస్​ షర్మిల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.