ETV Bharat / politics

'గెలిపించినోడే ఓడిపోతావని గేలి చేస్తున్నాడు'- జగన్​, పీకే బంధంపై ట్వీట్లు వైరల్

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 4, 2024, 3:55 PM IST

Updated : Mar 4, 2024, 4:36 PM IST

tweets_on_prashant_kishores_comments_on_jagans_failure
tweets_on_prashant_kishores_comments_on_jagans_failure

Tweets on Prashant Kishore's comments on Jagan's failure : జగన్​ ఓటమి తప్పదన్న ప్రశాంత్​ కిశోర్​​.. అందుకు గల కారణాలను కూడా స్పష్టం చేశారు. పాలనా కాలంలో ఏం చేశారనేది చూసి ప్రజలు ఓట్లు వేస్తారని, విద్య, ఉపాధి, అభివృద్ధి ఎన్నికల్లో కీలక ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ప్యాలెస్‌లో కూర్చొని బటన్స్ నొక్కితే ఓట్లు పడబోవన్న పీకే.. ప్రజల మధ్యలోకి రాకపోవడం కూడా జగన్‌కు మైనస్ కాబోతోందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో పీకే వ్యాఖ్యలపై (X) వేదికగా చేసిన ట్వీట్లు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Tweets on Prashant Kishore's comments on Jagan's failure : 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంలో ప్రశాంత్​ కిశోర్​ కీలక పాత్ర పోషించారు. ఆ ఎన్నికలకు ముందు పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించిన జగన్​.. అదే వేదికపై పీకేను పరిచయం చేశారు. 2011లో మోదీని ప్రధానమంత్రిగా గెలిపించడంలో పీకే పాత్ర ఉందని గొప్పగా చెప్పారు. బీహార్​, పంజాబ్​లోనూ విజయాలు సాధించారని కొనియాడారు. ఉత్తరప్రదేశ్​లో మాత్రమే విఫలమయ్యారని చెప్తూ.. 'కొద్దో గొప్పో తేడా.. అలా, ఇలా ఉంటే లాగొచ్చు(అధికారంలోకి తీసుకురావచ్చు). పూర్తిగా ఈ స్థాయిలో(తీవ్రమైన ప్రజా వ్యతిరేకత) ఉంటే ప్రశాంత్​ కిశోర్​ కూడా ఏమీ చేయలేడు.' అని జగన్​ వ్యాఖ్యానించారు. సరిగ్గా జగన్​ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉందని, భారీ ఓటమి ఖాయమని పీకే వెల్లడించడం యాధృచ్ఛికం.

పీకే వ్యాఖ్యలతో జగన్​ ఉక్కిరిబిక్కిరి! - వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఓటమి భయం

ప్రశాంత్​ కిశోర్​ వ్యాఖ్యలపై ట్విటర్​ (X) వేదికగా చర్చ జరుగుతోంది. 'మామూలుగా కాదు.. జగన్​కు భారీ ఓటమి తప్పదు' అన్న కిశోర్ వ్యాఖ్యలను ఉద్దేశించి 'జగన్​ ను గెలిపించినోడే గేలి చేస్తున్నాడు' అంటూ పోస్టులు వైరల్​ అవుతున్నాయి.

'ఎన్నికల వేళ, వీర బ్రహ్మేంద్ర స్వాములు వారు రాక, PK గారి మొదటి మాట. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ, విధివిధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరూ' అనే మరో పోస్ట్​ నెటిజన్ల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది.

ప్రశాంత్‌ కిశోర్‌ వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసి ఆ పార్టీని 2109ఎన్నికల్లో విజయతీరాలకు చేర్చడం విదితమే. ఆ తర్వాత రాజకీయ వ్యూహకర్తగా పనిచేయనని ప్రకటించారు. కానీ, ఆయన ఐ-ప్యాక్‌ టీం ఇప్పటికీ జగన్‌ కోసం ఏపీలో పనిచేస్తోంది.

వచ్చే ఎన్నికల్లో జగన్ ఏమి చేసినా గెలవడు - ప్రశాంత్‌ కిశోర్‌ సంచలన వ్యాఖ్యలు

జగన్​ ఓటమి తప్పదన్న కిశోర్​.. అందుకు గల కారణాలను కూడా స్పష్టం చేశారు. పాలనా కాలంలో ఏం చేశారనేది చూసి ప్రజలు ఓట్లు వేస్తారని పీకే వ్యాఖ్యానించారు. విద్య, ఉపాధి, అభివృద్ధి ఎన్నికల్లో కీలకంగా ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ప్యాలెస్‌లో కూర్చొని బటన్స్ నొక్కితే ఓట్లు పడబోవని పీకే స్పష్టం చేశారు. ప్రజల మధ్యలోకి రాకపోవడం కూడా జగన్‌కు మైనస్ కాబోతోందని వెల్లడించారు.

'సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌- క్విట్‌ జగన్‌'! 'ఓడిపోవడానికే సిద్ధం అంటున్నారు': చంద్రబాబు

బటన్‌ నొక్కి నేరుగా డబ్బు జమచేసినంత మాత్రాన ఓట్లు రాలవు. ధనమే బలమైతే ఏ ఒక్కరూ ఓడిపోరు, ఏ ప్రభుత్వమూ దిగిపోదు. దక్షిణాదిన రాజకీయాల్లో డబ్బు సంస్కృతి అలవడింది కానీ, ఉత్తర భారతంలో కంటే దక్షిణాదినే ప్రభుత్వాలు మారిన సందర్భాలు అనేకం. - ప్రశాంత్​ కిశోర్​, ఎన్నికల వ్యూహకర్త

జగన్​ ఫార్ములా అంతా కూడా అప్పు చేసి పప్పు కూడులా ఉందని ప్రశాంత్​ కిశోర్​ (Prashanth Kishore) వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాల పేరిట ప్రజాధనం పంపిణీ ఒక్కటే మార్గం అనుకోవడం పొరపాటు అని పేర్కొన్నారు. ఓట్లు వేసే సమయంలో మెజార్టీ ప్రజలు, విద్యావంతులు, ఉద్యోగులు అభివృద్ధిని కోరుకుంటారని చెప్పారు. ఏపీలో బటన్​ నొక్కి డబ్బు పంపిణీ చేయడం తప్ప.. జరిగిన అభివృద్ధి కనిపించడం లేదని తెలిపారు.

'టీడీపీ నేతలే లక్ష్యంగా పోలీసుల దాడులు- ఆర్థిక మూలాలు దెబ్బతీసేందుకు వైసీపీ కుట్ర'

జగన్​ జనం మధ్యలోకి రాకపోవడం ఆయన ఓటమికి మరో కారణమని పీకే విశ్లేషించారు. ఈ ఐదేళ్లలో జగన్​ పర్యటనలను పరిశీలిస్తే సభా వేదికలపై ప్రసంగాలకే పరిమితమయ్యారు తప్ప జనంలోకి వెళ్లలేదు. సరికదా... జగన్​ సభ అంటేనే జనం హడలి పోయే పరిస్థితిని కల్పించారు. సీఎం జగన్​ సభ (CM Jagan Meeting) ఉందంటే చాలు డ్వాక్రా మహిళల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. డ్వాక్రా మహిళలందరూ సభకు తరలి రావాలను హుకూం జారీ చేసేవారు. ఇక సభకు దూరంలోనే వాహనాలు నిలిపేయడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. వాహనాల మళ్లింపుతో వందల కిలోమీటర్లు సుదూర ప్రయాణం చేయాల్సి వస్తోందని లారీ డ్రైవర్లు వాపోయేవారు. ఇక ఆర్టీసీ బస్సుల కేటాయింపుతో రవాణా సౌకర్యం లేక ప్రయాణికులు పడిగాపులు తప్పేవి కావు. ఇవన్నీ ఒకెత్తయితే స్కూళ్లకు సెలవులు ప్రకటించడం, పరీక్షలు వాయిదా వేయడం పరిపాటిగా మారింది. ప్రతిపక్ష నేతల అరెస్టులు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులపై నిర్బంధాలు కొనసాగేవి. ప్రజా వ్యతిరేక చర్యలతో జగన్ ప్రజలకు దూరమయ్యారని పీకే పేర్కొన్నారు.

సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమేంటి ? - చంద్రబాబు భావోద్వేగ ట్వీట్

Last Updated :Mar 4, 2024, 4:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.