ETV Bharat / politics

వచ్చే ఎన్నికల్లో జగన్ ఏమి చేసినా గెలవడు - ప్రశాంత్‌ కిశోర్‌ సంచలన వ్యాఖ్యలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 3, 2024, 9:21 PM IST

Updated : Mar 3, 2024, 10:51 PM IST

Prashant Kishor: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఓటమి ఖాయమని అన్నారు. ఈ వ్యాఖ్యలు అధికార వైసీపీ శ్రేణుల్లో గుబులు రేపుతున్నాయి.

Prashant Kishor
Prashant Kishor

Prashant Kishor : ఏపీలో సార్వత్రిక ఎన్నికలు రోజు రోజుకు దగ్గరపడుతున్న వేళ, గెలుపు సర్వేలు అధికార-విపక్షాల్లో గుబులు రేపుతున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన సర్వేల్లో ప్రతిపక్ష టీడీపీ-జనసేన కూటమికి గెలుపు ఖాయమనే సంకేతాలు ఇచ్చాయి. ఇది ఇలా ఉంటే, టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు ఆది నుంచి గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అందులో భాగంగానే చంద్రబాబు (Chandrababu), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఉమ్మడిగా 99 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదుల చేశారు. దీంతో రెండు పార్టీ శ్రేణుల్లో గెలుపు గుర్రాలకు అవకాశం కల్పించారనే భావం వ్యక్తమైంది. దీనికి అనుగుణంగా వివిధ సర్వేలు కూడా అత్యధిక మెజార్టీతో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయనే సంకేతాలు ఇచ్చాయి. ఈ తరుణంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాల నమ్మకానికి మరింత బలం చేకురేలా చేస్తున్నాయి. ప్రశాంత్‌ కిశోర్‌ చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.

హైదరాబాద్​లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజకీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ త్వరలో ఏపీలో జరిగే ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ( CM Jagan Mohan Reddy) ఓటమి ఖాయమని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ - జనసేన పార్టీల ఉమ్మడి విజయం తధ్యమని చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతుంది. ఈ వ్యాఖ్యలు ప్రతిపక్షాల్లో ఉత్సాహాన్ని రేకిస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్‌ కిశోర్‌ పని చేసిన సంగతి తెలిసిందే.

వైసీపీ ప్రభుత్వంపై ప్రశాంత్‌ కిశోర్ విమర్శలు - 2024 ఎన్నికల్లో గెలుపు దిశగా టీడీపీ అడుగులు

2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి వ్యూహకర్తగా ప్రశాంత్‌ కిశోర్‌ పని చేశారు. అప్పుడు 151 సీట్లతో విజయఢంకా మోగించారు. జగన్ సీఎం కావడంలో ప్రశాంత్‌ కిశోర్‌ కీలక పాత్ర పోషించారు. తరువాత జగన్​ ఆయన్ను దూరంగా పెడుతూ వచ్చారు. రాష్ట్ర అభివృద్ధిని, జగన్ పారిపాలనను రాజకీయ వ్యూహకర్త గమనిస్తూ వస్తున్నారు. జగన్ పరిపాలన బాగోలేదంటూ వివిధ సందర్భాల్లో చెప్పారు. సంక్షేమ పథకాల పేరుతో అభివృద్ధిని గాలికొదిలేశారని అన్నారు. ఉచిత పథకాలతో పాటు అభివృద్ధి ముఖ్యమని అన్నారు. చదువుకున్న వాళ్లు ఉచిత పథకాలు కోరుకోవడం లేదని, ఉద్యోగాలు కోరుకుంటున్నారని తెలిపారు.

వైసీపీ ప్రభుత్వంపై ప్రశాంత్‌ కిశోర్ విమర్శలు - 2024 ఎన్నికల్లో గెలుపు దిశగా టీడీపీ అడుగులు

కొంత కాలం క్రితం అధికార వైఎస్సార్సీపీకి షాకిస్తూ ప్రశాంత్ కిషోర్‌ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో దాదాపు 3 గంటల పాటు వివిధ అంశాలపై ఇరువురు చర్చించారు. ఈ భేటీలో లోకేశ్‌తో పాటు తెలుగుదేశం వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న రాబిన్‌శర్మ కూడా పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో రాబిన్‌శర్మ, పీకే బృందాలు పరస్పర సహకారంతో తెలుగుదేశాన్ని గెలిపించేందుకు పని చేయనున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి.

గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీని అధికారంలోకి తీసుకురావడం వెనక పీకే చాలా కీలకంగా వ్యవహించారు. తాను పని చేస్తున్న పార్టీ విజయం కోసం ఆయన ఎంతవరకైనా వెళ్తారని ఎలాంటి వ్యూహాలైనా రచిస్తారన్న విమర్శలు ఆయనపై ఉన్నాయి. అయితే 2019 ఎన్నికల తర్వాత జగన్‌ ప్రభుత్వ విధ్వంసకర విధానాలు, అతి త్వరలోనే చెడ్డపేరు తెచ్చుకోవడం చూసి ఆయన అంతర్మథనానికి గురయ్యేవారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. 'ఇలాంటి పార్టీ గెలుపు కోసమా నేను పనిచేసింది?' అని ఆయన చాలాసార్లు ఆవేదన చెందినట్లు తెలిసింది.

ముగిసిన బాబు, పీకే సమావేశం- పార్టీ క్యాడర్​లో జగన్​పై తీవ్ర వ్యతిరేకత ఉందన్న ప్రశాంత్ కిషోర్

Last Updated :Mar 3, 2024, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.