ETV Bharat / politics

9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన టీడీపీ - TDP Candidates Final List Release

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 29, 2024, 3:26 PM IST

TDP Candidates Final List Release: తెలుగుదేశం పార్టీ చివరి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. నలుగురు ఎంపీ, 9 మంది అసెంబ్లీ అభ్యర్థులతో తుది జాబితా విడుదల చేసింది. మొత్తం 144 అసెంబ్లీ, 17ఎంపీ స్థానాలకు 4 దశల్లో టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించింది.

TDP Candidates Final List Release
TDP Candidates Final List Release

TDP Candidates Final List Release : 2024 ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ 144 మంది అసెంబ్లీ, 17 ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం నాలుగు జాబితాల్లో అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది. ఇక పొత్తులో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్​సభ - జనసేనకు 21 అసెంబ్లీ, 2 లోక్​సభలను టీడీపీ కేటాయించింది.

నలుగురు ఎంపీ అభ్యర్థులు : తెలుగుదేశం పెండింగ్ అభ్యర్థులు నలుగురు ఎంపీ, 9మంది అసెంబ్లీ అభ్యర్థులతో టీడీపీ(Telugu Desam Party) తుది జాబితా విడుదలైంది. విజయనగరం ఎంపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు, ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అనంతపురం ఎంపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మి నారాయణ, కడప ఎంపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డిలను ప్రకటించారు.

అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే - నిరుద్యోగ భృతి ఇస్తాం : చంద్రబాబు - Chandrababu Kuppam Tour

Chandrababu Announced 9 MLA Candidate List : కదిరి అసెంబ్లీకి కందికుంట ప్రసాద్ భార్య యశోదా బదులుగా కందికుంట ప్రసాద్ కు సీటు సద్దుబాటుచేశారు. చీపురుపల్లి అభ్యర్థిగా కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచే పోటీ చేయనున్నారు. పాడేరు అభ్యర్థిగా కిళ్లు వెంకట రమేష్ నాయుడు, దర్శి అభ్యర్థిగా గొట్టిపాటి లక్మీ, రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిగా సుగవాసి సుబ్రహ్మణ్యం, ఆలూరు అభ్యర్థిగా వీరభద్రగౌడ్, గుంతకల్లు అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం, అనంతపురం అర్బన్ అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌ల పేర్లను ప్రకటించారు. పెండింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులందరినీ తెలుగుదేశం ప్రకటించేసింది(Announced). మొత్తం 144అసెంబ్లీ, 17పార్లమెంట్ స్థానాలకు 4దశల్లో అభ్యర్థుల్ని తెలుగుదేశం ప్రకటించింది

నాలుగు విడుతల్లో అభ్యర్థుల ప్రకటన : ఫిబ్రవరి 24న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను (TDP and Janasena first list) తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్​తో కలిసి విడుదల చేశారు. తొలి విడతగా 94 చోట్ల పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల పేర్లను చంద్రబాబు వెల్లడించారు. రెండో జాబితాలో 34 మందితో కూడిన లిస్ట్‌ను ఆ పార్టీ విడుదల చేశారు. వీరిలో 27 మంది పురుషులు, ఏడుగురు మహిళలకు అవకాశం కల్పించారు. ఇక మూడో జాబితాలో 11 శాసనసభ స్థానాలతో పాటు 13 ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. పలు చోట్ల, టీడీపీ, జనసేన అభ్యర్థుల ఆందోళన, ఆయా ప్రాంతాల్లో నెలకొన్న రాజకీయ కారణాలతో స్వల్ప మార్పులు చేర్పులు జరిగాయి. మూడు పార్టీల సమన్వయంతో తెలుగుదేశం నేడు పార్టీ తాజాగా నాలుగో జాబితాను విడుదల చేసింది.

ఏపీలో 160 స్థానాల్లో కూటమి విజయం ఖాయం : చంద్రబాబు -
ఏపీలో టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల - 13 ఎంపీ, 11 అసెంబ్లీ స్థానాలు ప్రకటన - 2024

ఏపీలో ఎన్నికల ప్రచారంలో కూటమి దూకుడు - టీడీపీ లోక్​సభ అభ్యర్థులు వీరే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.