ETV Bharat / politics

గెలుపే లక్ష్యంగా లోక్​సభ ఎన్నికల ప్రచారం - విమర్శలు ప్రతి విమర్శలతో వేడెక్కుతున్న రాజకీయం - Lok Sabha Elections 2024

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 8, 2024, 8:50 AM IST

Telangana‍ Lok Sabha Elections Campaign 2024 : లోక్‌సభ ఎన్నికల ప్రచార బరిలో పార్టీలు దూసుకెళ్తున్నాయి. సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ కార్యకర్తలు, శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నాయి. అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలుపించుకోవాలని పిలుపునిస్తున్న నేతలు ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులదే గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Congress Lok Sabha Election Campaign
Lok Sabha Elections Campaign In Telangana‍ 2024

గెలుపే లక్ష్యంగా లోక్​సభ ఎన్నికల ప్రచారం - విమర్శలు ప్రతి విమర్శలతో వేడెక్కుతున్న రాజకీయం

Telangana‍ Lok Sabha Elections Campaign 2024 : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచార జోరు పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలతో రైతులను నట్టేట ముంచితే రాష్ట్రంలోని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను కనీసం పరామర్శించలేదని మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క ధ్వజమెత్తారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన పెద్దపల్లి పార్లమెంట్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, స్థానిక శాసన సభ్యులు ప్రేమ్ సాగర్ రావు, వినోద్, పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. కేసీఆర్ రైతుల మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తూ మద్యం కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్‌లను పక్కదారి పట్టిస్తున్నారని మంత్రులు ఆరోపించారు.

Congress Lok Sabha Election Campaign : కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నిర్వహించిన జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో షబ్బీర్ అలీ పాల్గొన్నారు. త్వరలోనే గ్రామస్థాయిలో ఇందిరమ్మ కమిటీలు వేస్తామని ఐదుగురు పురుషులు, ఒక మహిళకు చోటు కల్పిస్తామన్నారు. గ్రామస్థాయిలో ప్రభుత్వ పథకాలను అమలు చేసే బాధ్యత వీరిపై ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి దామోదర రాజనర్సింహ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

తెలంగాణలో కేసీఆర్‌ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి మా పైన రూ.7 లక్షల కోట్ల అప్పును మోపారు. ఆ అప్పుతో పాటు వడ్డీని కూడా మోపారు. కట్టడానికి మేము అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ఇబ్బంది పడుతున్నప్పటికీ ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నాం. రైతుకు ఏ విధంగా మేలు చేయాలో మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ధాన్యం కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగింది." - శ్రీధర్‌ బాబు, ఐటీ శాఖ మంత్రి

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్​ ఒక్క సీటూ గెలవదు: మంత్రి కోమటిరెడ్డి - Minister Komati Reddy Fires on KCR

BRS Lok Sabha Election Campaign 2024: కాంగ్రెస్ జన జాతర సభ ప్లాప్‌ అయ్యిందన్న బీఆర్ఎస్ నేత గట్టు రామచందర్ రావు మోదీతో సంబంధాలు పెట్టుకున్న రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ పరువు తీశారని ఆరోపించారు. ముఖ్య మంత్రి పదవి పోయిన తర్వాత ముందు జైలుకెళ్లేది రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన నాలుగు రోజుల్లోనే ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమకు టచ్‌లోకి వచ్చారన్నారు.

ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌ : ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఖమ్మం లోక్‌సభ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు కాబోవని తెలిసే మోసపూరిత వాగ్దానాలు చేసిందని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్‌ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని ఇప్పుడు ఐదు న్యాయాలతో దేశ ప్రజలను మోసం చేసేందుకు సిద్దమవుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ మండిపడ్డారు. దేశ ప్రజలు మోదీకి ఓటు వేయాలని చూస్తున్నారన్న ఆమె పదేళ్ల పాలనలో మోదీ ఒక సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్​ఎస్​ కసరత్తులు - ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారాలు షురూ - Lok Sabha Elections 2024

గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రచారాలు - ఎన్నికల తర్వాక బీఆర్ఎస్ కనుమరుగవడం ఖాయమన్న నేతలు - Lok Sabha Elections 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.