ETV Bharat / politics

ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన బీజేపీ- రంగంలోకి కీలక నేతలు

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 9, 2024, 8:01 PM IST

T BJP Master Plan on MP Elections
BJP Speed up Election Campaign 2024

BJP Speed up Election Campaign 2024 : లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారాన్ని హోరెత్తించేందుకు కమలం పార్టీ సిద్ధమైంది. రాష్ట్రంలో రెండెంకెల స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన, ప్రచారంలోనూ అధికార, ప్రతిపక్ష పార్టీల కంటే ముందున్న బీజేపీ, ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన లోక్‌సభ ఎన్నికల్లో గెలుపునకు దోహదపడుతుందని భావిస్తోంది. దీనికి తోడు కార్యకర్తలను సమాయత్తం చేస్తూ, వారికి దిశానిర్దేశం చేసేలా ఈ నెల 12న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను రప్పిస్తోంది.

ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన బీజేపీ- రంగంలోకి కీలక నేతలు

BJP Speed up Election Campaign 2024 : లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రధాని మోదీ(PM MODI) రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించారు. అధికారిక కార్యక్రమాలతో పాటు బీజేపీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్, సంగారెడ్డిలో విజయ సంకల్ప సభల్లో పాల్గొని ఒక దఫా ప్రచారాన్ని ముగించారు. రానున్న రోజుల్లో ప్రధాని మోదీ సహా, కేంద్రమంత్రులు అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర అగ్రనేతల తాకిడి రాష్ట్రాంలో భారీగా పెరగనుంది. ఇప్పటికే ప్రధాని రెండ్రోజుల పర్యటనతో కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొందని కాషాయ శ్రేణులు భావిస్తున్నాయి.

T BJP Master Plan on MP Elections : సికింద్రాబాద్ స్థానం నుంచి కిషన్ రెడ్డి పోటీ చేస్తుండగా, హైదరాబాద్ నుంచి అసదుద్దీన్​పై(Asaduddin) పోటీకి మాధవీలతను బీజేపీ బరిలోకి దింపుతోంది. సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ సైతం బలమైన నేతను రంగంలోకి దించే అవకాశాలున్న నేపథ్యంలో, ఎన్నికల షెడ్యూల్ ప్రకటన అనంతరం ప్రచారానికి ప్రధాని మోదీ రాష్ట్రానికి మూడుసార్లు రానున్నట్లు సమాచారం. మోదీ రోడ్ షో ఉండాలని రాష్ట్ర నాయకత్వం ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం.

అలాగే అసదుద్దీన్‌ కంచుకోటను ఢీకొట్టాలంటే హైదరాబాద్ స్థానంలోనూ రోడ్ షో ఉండాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు పార్లమెంట్ స్థానాల పరిధిలో ఓటర్లను బీజేపీ వైపునకు తిప్పుకోవడంపై కాషాయ పార్టీ దృష్టి కేంద్రీకరించింది. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు, నేతలతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు.

12న హైదరాబాద్‌లో సోషల్ మీడియా వారియర్స్‌తో సమావేశం కానున్న అమిత్‌షా(Amit Shah), ప్రజలను ఆకర్షించే పోస్టులతో పాటు ఏయే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బూత్ అధ్యక్షులు, ఆ పైస్థాయి నేతలతో అమిత్ షా సమావేశంకానున్నారు. దాదాపు 25 వేల మంది ఈ సమావేశానికి హాజరవుతారని సమాచారం. ప్రతి బూత్ లో 370 ఓట్లు వచ్చేలా కృషి చేయాలని బూత్ అధ్యక్షులకు అమిత్ షా మార్గనిర్దేశనం చేయనున్నారు.

లోక్‌సభ ఎన్నికల వేళ రసవత్తరంగా రాజకీయం - ఆపరేషన్ ఆకర్ష్​తో బీజేపీ బిజీబిజీ

అదేరోజు సాయంత్రం 17 పార్లమెంట్ల వర్కింగ్ గ్రూప్స్‌ సమావేశాన్ని సైతం నిర్వహించనున్నారు. దాదాపు 5వందల మంది ఈ సమావేశానికి హాజరుకానున్నారు. గెలుపుపై భారీ స్థాయిలో ప్రణాళికలు రచిస్తున్న బీజేపీ, ప్రజల్లోకి ఎంత వరకూ చేరుకుంటుందనేది వేచి చూడాలి.

పార్లమెంట్ అభ్యర్థుల రెండో జాబితాకు బీజేపీ కసరత్తు- ఆశావహుల్లో నెలకొన్న ఉత్కంఠ

సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.