ETV Bharat / politics

సీఎం రేవంత్‌రెడ్డిలో అసహనం బాగా పెరిగిపోయింది : కిషన్‌రెడ్డి - Kishan Reddy Comments on CM Revanth

author img

By ETV Bharat Telangana Team

Published : May 8, 2024, 6:17 PM IST

Updated : May 8, 2024, 9:48 PM IST

Kishan Reddy Comments on CM Revanth : రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఆదరణ బాగా పెరుగుతోందని తెలంగాణ బీజేపీ చీఫ్​ కిషన్‌రెడ్డి అన్నారు. తమ పార్టీపై ప్రత్యర్థులు ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు తమనే ఆదరిస్తున్నారని వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డిలో అసహనం బాగా పెరిగిపోయిందని, తన హోదాను మరిచి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఈమేరకు హైదరాబాద్​ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి, మాట్లాడారు.

Telangana BJP Chief Kishan Reddy
Kishan Reddy Comments on CM Revanth (ETV Bharat)

Union Minister Kishan Reddy Fires on CM Revanth : కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రిజర్వేషన్ రద్దు ప్రచారం విఫలమైందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్​రెడ్డి అన్నారు. రిజర్వేషన్‌లపై కాంగ్రెస్‌ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు ఖండిస్తున్నారని తెలిపారు. రిజర్వేషన్ లబ్దిదారులే బీజేపీపై విశ్వాసంతో మద్దతు పలుకుతున్నారని పేర్కొన్నారు. ఈమేరకు హైదరాబాద్​లోని పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కిషన్​రెడ్డి, పార్టీ ప్రచారానికి ఊరూరా అద్బుతమైన స్పందన వస్తోందన్నారు.

రాష్ట్రంలో అత్యధిక స్థానాలు కాషాయ పార్టీ గెలువబోతుందన్న కేంద్రమంత్రి, విపక్షాలు చేస్తున్న వ్యతిరేక ప్రచారం తమకు సానుకూలంగా మారుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది బాధ్యతారాహిత్యమైన విమర్శగా కిషన్​రెడ్డి పేర్కొన్నారు. సీఎం ప్రసంగాల్లో అసహనం కనపడుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు.

"కేంద్రంతో బీఆర్ఎస్ పార్టీ ఘర్షణ వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, కానీ తాను ఆ రకంగా చేయనని రేవంత్​రెడ్డి గతంలో చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని కోరుకుంటున్నాను కావున కేంద్రంతో ఘర్షణ పెట్టుకోకుండా సఖ్యతగా ఉంటానని సీఎం అన్నారు. అలానే రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెస్తానని రేవంత్ నాడు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఉన్నపళంగా బీజేపీతో ఘర్షణ వైఖరిని ఎందుకు ప్రదర్శిస్తున్నారు. గాడిద గుడ్డుతో ఎందుకు ఊరేగుతున్నారు. కేంద్ర సర్కార్​పై బురద జల్లే విధానంలో ఆ రెండు పార్టీలు ఒకటే వైఖరి అవలంబిస్తున్నాయి."-కిషన్​రెడ్డి, కేంద్రమంత్రి

అబద్ధాలు ప్రచారం చేయడంలో ఆ రెండు పార్టీలు పోటాపోటీ : ప్రధానమంత్రి స్వయంగా, తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు రిజర్వేషన్లపై ఎలాంటి ఆందోళన అక్కర్లేదని చెప్పినా దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇద్దరు ముగ్గురు జర్నలిస్టులను జైళ్లో వేస్తే బుద్ది వస్తుందన్న రేవంత్ రెడ్డి ప్రకటనలు, ఆయన అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. బీజేపీ చేపట్టిన ఊరూరా ప్రచారానికి అద్భుతమైన స్పందన వస్తోందని తెలిపారు. అదేవిధంగా కమలానికి వ్యతిరేకంగా అబద్ధాలు ప్రచారం చేయడంలో బీఆర్ఎస్​, కాంగ్రెస్​ పార్టీలు పోటీపడుతున్నాయని దుయ్యబట్టారు.

కొత్త కొత్త తిట్లు, అబద్ధాల కోసం పరిశోధన బృందాలను రేవంత్‌రెడ్డి నియమించుకున్నారని కిషన్​రెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్రంతో బీఆర్ఎస్ ఘర్షణ వల్లే నాడు రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మొన్నటి వరకు రేవంత్‌రెడ్డి మాట్లాడారని, తాను మాత్రం కేంద్రంతో ఘర్షణ పెట్టుకోకుండా సఖ్యతగా ఉండి నిధులు తెస్తానని చెప్పిన విషయాన్ని కేంద్రమంత్రి గుర్తుచేశారు. ఇప్పుడు ఉన్నపళంగా బీజేపీతో ఘర్షణ వైఖరిని ఎందుకు ప్రదర్శిస్తున్నారో ఆయనకే తెలియాలని వ్యాఖ్యానించారు.

సీఎం రేవంత్‌రెడ్డిలో అసహనం బాగా పెరిగిపోయింది : కిషన్‌రెడ్డి (ETV Bharat)

కాంగ్రెస్‌ పాలనలో రాజ్యాంగానికి రక్షణ లేదు - తెలంగాణలో అభివృద్ధి లేదు : ప్రధాని మోదీ - PM MODI SLAMS CONGRESS IN WARANGAL

రాష్ట్రవ్యాప్తంగా 'ఇంటింటికి బీజేపీ' - ఓట్ల కోసం అభ్యర్థులకు తప్పని పాట్లు - BJP MP Candidates Election Campaign

Last Updated :May 8, 2024, 9:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.