ETV Bharat / politics

లోక్​సభ ఎన్నికల్లో నామినేషన్​ దాఖలు చేసిన బర్రెలక్క - ఆ స్థానం నుంచే బరిలోకి - Barrelakka MP candidate Nomination

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 23, 2024, 7:55 PM IST

Barrelakka MP Election Nomination
Barrelakka MP Election Nomination

Barrelakka MP Election Nomination : సోషల్ మీడియా సెన్సేషన్ బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష నాగర్ కర్నూల్ ఎంపీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగుల కోసం నిరంతరం పోరాటం చేస్తానని బర్రెలక్క తెలిపారు.

Barrelakka MP Election Nomination : నాగర్​ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా సోషల్​మీడియా సెన్సేషన్ బర్రెలక్క నామినేషన్ వేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్ర ప్రజలనే కాకుండా ఇరు తెలుగు రాష్ట్రాల వారి దృష్టిని ఆకర్షించిన బర్రెలక్క, తాజాగా నాగర్​ కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఒక సెట్టు నామినేషన్ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉదయ్ కుమార్​కు అందజేశారు.

MP Election Nomination Filed by Barrelakka : నామినేషన్ దాఖలు చేసిన అనంతరం బర్రెలక్క మీడియాతో మాట్లాడారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేశానని ఆమె తెలిపారు. పార్లమెంట్ పరిధిలోని ఓటర్లందరూ తనకు ఓటు వేసి గెలిపించాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే, నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తానని, వారి అభివృద్ధి కోసం అహర్నిషలు శ్రమిస్తానని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు తనను గెలిపించడం కోసం శ్రమించారని పార్లమెంటు ఎన్నికల్లో కూడా అలాగే తన గెలుపు కోసం ప్రోత్సహించాలని ఆమె కోరారు.

"అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి కొన్ని గ్రామాలు సందర్శించాను. అక్కడ సరైన రోడ్డు సదుపాయాలు లేవు. మాలాంటి నిరుద్యోగులు చట్ట సభల్లో ఉండాలనేది నా ఆకాంక్ష. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తా." - బర్రెలక్క అలియాస్ శిరీష, ఎంపీ స్వతంత్ర అభ్యర్థిని నాగర్ కర్నూల్

లోక్​సభ ఎన్నికల బరిలో సోషల్ మీడియా సెన్సేషన్ బర్రెలక్క- నామినేషన్ దాఖలు

అసలు ఎవరీ బర్రెలక్క? : గత అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షించిన పేరు బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష. డిగ్రీ చదువుకున్నప్పటికీ ఉద్యోగం రాలేదని, అందుకే బర్రెలు కాస్తూ జీవనం సాగిస్తున్నానని గతంలో వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె వయసు 26 ఏళ్లు. ఆమె పెట్టిన పోస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని పెద్దకొత్తపల్లి పోలీసులు అప్పట్లో కేసును సైతం ఫైల్ చేశారు. డిగ్రీ చదువుకున్న శిరీష తన లాంటి నిరుద్యోగ అభ్యర్థులకు అండగా ఉండేందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఆమెకు ప్రస్తుతం యూట్యాబ్​లో 1.66 లక్షల మంది, ఇన్​స్టాలో 1.12 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

బర్రెలక్కకు ఫాలోయింగ్​ మాములుగా లేదుగా- మద్దతు తెలిపిన యానాం ప్రజలు

ఓటు వేసి గెలిపించమని కోరితే - డబ్బులు ఎక్కడ అని అడుగుతున్నారు : బర్రెలక్క

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.