ETV Bharat / politics

కేసీఆర్‌ కుటుంబసభ్యుల ఉద్యోగాలు ఊడిన తర్వాతే యువతకు జాబ్‌లు వస్తున్నాయి : సీఎం

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 4, 2024, 5:42 PM IST

Updated : Mar 4, 2024, 7:57 PM IST

Revanth Reddy on KCR : అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్‌ కుటుంబసభ్యుల ఉద్యోగాలు ఊడగొట్టాకే, యువతకు ఉద్యోగాలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఎల్బీ స్టేడియంలో ఇటీవల ఎంపికైన లెక్చరర్లు, టీచర్లకు ఆయన నియామక పత్రాలు అందజేశారు.

Revanth Reddy on KCR
Revanth Reddy on KCR

Revanth Reddy on KCR : ఆత్మ బలి దానాలతో సాధించిన తెలంగాణలో నాటి ప్రభుత్వం అమరుల స్ఫూర్తిని తీసుకుని పని చేయాల్సింది పోయి, వారి లాభార్జన, ధన దాహం తీర్చుకోవడానికే పని చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఫాంహౌస్‌ మత్తులో ఉండి లక్షలాది యువకుల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమయ్యారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎల్బీ స్టేడియంలో నూతనంగా ఎంపికైన 5192 మంది లెక్చరర్లు, టీచర్లు, కానిస్టేబుళ్లు, మెడికల్ సిబ్బందికి లాంఛనంగా ఉద్యోగ నియామక పత్రాలను సీఎం అందించారు.

కేసీఆర్‌ కుటుంబసభ్యుల ఉద్యోగాలు ఊడిన తర్వాతే యువతకు జాబ్‌లు వస్తున్నాయి : సీఎం

'కేంద్రంతో లొల్లి రాష్ట్రాభివృద్ధికి ఆటంకమే - తెలంగాణకు మోదీ పెద్దన్నలా సహకరించాలి'

నిరుద్యోగ యువత ముందుకు వచ్చి తండ్రి, కుమారుడు, అల్లుడు, కుమార్తెల ఉద్యోగాలు ఊడగొట్టడంతోనే తాము అధికారంలోకి వచ్చి నియామకాలు చేపడుతున్నామని సీఎం వివరించారు. 2023లో ఇదే స్టేడియంలో అభయహస్తం పేరిట ఆరు గ్యారెంటీల అమలుకు సంతకం చేశామని గుర్తు చేశారు. మూడు నెలల కాలంలోనే ఈ స్టేడియంలోనే 30 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే సంతకం పెట్టామని సీఎం వివరించారు. గత ప్రభుత్వం పేదలకు పాఠశాల విద్యను దూరం చేసిందని ఆరోపించారు. విద్య ఒక్కటే మనిషి విలువ పెంచుతుందన్నారు. ఉపాధ్యాయ వృత్తి సామాజిక బాధ్యతగా పేర్కొన్నారు. ప్రజల ప్రోత్సాహంతో మరింత అభివృద్ది చేస్తామని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ తదితరులు పాల్గొని మాట్లాడారు.

మెట్రో రెండో దశ నిర్మాణానికి ఈ నెల 8న శంకుస్థాపన

'రైతును రాజుగా చేసే పాలనకు నాంది పడింది ఎల్బీ స్టేడియంలోనే. మూడు నెలల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశాం. తెలంగాణ సాధనలో నిరుద్యోగులు, యువత పాత్ర ఎంతో గొప్పది. విద్యార్థుల త్యాగాలు, బలి దానాలతోనే తెలంగాణ సాకారమైంది. తెలంగాణ ఏర్పడితే న్యాయం జరుగుతుందని యువత భావించింది. కానీ కుటుంబ పాలన యువత ఆకాంక్షలను నెరవేర్చలేదు. కుటుంబ వ్యక్తుల పదవుల కోసం నిరుద్యోగులను విస్మరించారు. కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యుల ఉద్యోగం ఊడగొడితేనే ఉద్యోగాలు వస్తాయని యువత భావించారు. అనుకున్నట్టే కేసీఆర్‌ కుటుంబ సభ్యుల ఉద్యోగాలు ఊడిన తర్వాతే యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి.' - రేవంత్‌ రెడ్డి, ముఖ్యమంత్రి

కేసీఆర్‌ కుటుంబసభ్యుల ఉద్యోగాలు ఊడిన తర్వాతే యువతకు జాబ్‌లు వస్తున్నాయి : సీఎం

ప్రభుత్వ పాఠశాలలో చదివే ఈ స్థాయికి : ఈ క్రమంలోనే తనకు ఇంగ్లీష్‌ సరిగా రాదని కొందరు అవహేళన చేస్తున్నారన్న రేవంత్‌ రెడ్డి, తాను జిల్లా పరిషత్‌ పాఠశాలలో తెలుగు మీడియం మాత్రమే చదివానని తెలిపారు. గుంటూరు, గుడివాడకు వెళ్లి కార్పొరేట్‌ పాఠశాలల్లో చదవలేదన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి, ఈ స్థాయికి ఎదిగానని స్పష్టం చేశారు.

గెలుపు దిశగా కాంగ్రెస్‌ వ్యూహాత్మక అడుగులు - 14 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు ఖరారు!

Last Updated :Mar 4, 2024, 7:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.