ETV Bharat / politics

టీడీపీలోకి వసంత కృష్ణప్రసాద్​, భారీగా అనుచరులతో కలిసి హైదరాబాద్​లో చేరిక

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 2, 2024, 12:16 PM IST

YSRCP MLA Vasantha Krishnaprasad joined In TDP : రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలంటే చంద్రబాబు పాలన రావాలని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్​ అన్నారు. నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున అనుచరగణంతో కలిసి హైదరాబాద్ వెళ్లిన ఆయన చంద్రబాబు నివాసంలో టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే వెంట మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్​ నేతలు, వార్డు కౌన్సిలర్లు ఉన్నారు.

ysrcp_mla_vasantha_krishnaprasad_joined_in_tdp
ysrcp_mla_vasantha_krishnaprasad_joined_in_tdp

YSRCP MLA Vasantha Krishnaprasad joined In TDP : మైలవరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ హైదరాబాద్​లో చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకు చంద్రబాబు పార్టీ కండువా కప్పి తెలుగుదేశంలోకి సాదరంగా ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో వసంత కృష్ణప్రసాద్ పార్టీలో చేరారు. వసంత కృష్ణప్రసాద్ తో పాటు మైలవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచ్ లు, పార్టీ ముఖ్యనేతలు తెలుగుదేశంలో పెద్దఎత్తున చేరారు. వారిలో ఓ ఎంపీపీ, ఇద్దరు వైస్ ఎంపీపీలు, 12మంది సర్పంచ్​లు, ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు, ఏడుగురు సొసైటీ అధ్యక్షులు, ఇద్దరు మండల పార్టీ అధ్యక్షులతో పాటు మరో నలుగురు మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు ఉన్నారు.

జగన్​ వైఖరి రాష్ట్రానికి పెనుశాపం - వైఎస్​తో ఆయనకు పోలికే లేదు: వైసీపీ ఎమ్మెల్యే వసంత

ysrcp_mla_vasantha_krishnaprasad_joined_in_tdp
పార్టీలో చేరిన వారితో టీడీపీ అధినేత చంద్రబాబు

తెలుగుదేశం పార్టీలో చేరిక సందర్భంగా వసంత కృష్ణ ప్రసాద్​ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలంటే చంద్రబాబు పాలన రావాలని అన్నారు. జగన్​ పాలనలో ఐదేళ్లుగా మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు రాలేని పరిస్థితి ఉందని, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కావాలన్నా స్పందనలేదని తెలిపారు. రాష్ట్ర పునఃనిర్మాణానికి టీడీపీలో చేరుతున్న తనను అంతా స్వాగతించారని వెల్లడించారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం పురోభివృద్ధి చెందాలని కృష్ణప్రసాద్‌ పేర్కొన్నారు.

టీడీపీ-జనసేన రెండో జాబితాపై ఉత్కంఠ - కొనసాగుతున్న నేతల ప్రయత్నాలు

ysrcp_mla_vasantha_krishnaprasad_joined_in_tdp
పార్టీలో చేరిన వారితో టీడీపీ అధినేత చంద్రబాబు

ఎమ్మెల్యే వసంతతో పాటు వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచులు పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు. మైలవరం నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ నేతలంతా సైకిల్​ ఎక్కారు. పార్టీలో చేరిన వారిలో మైలవరం మండలం నుంచి మండల పరిషత్ ఉపాధ్యక్షుడు షేక్ అబ్దుల్ రహీం, కీర్తిరాయునిగూడెం ఎంపీటీసీ సభ్యుడు భూక్యా అయ్యా, మండల వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షుడు షేక్ నన్నే బాబు, జిల్లా బీసీ కమిటీ సభ్యుడు వేముల దుర్గారావు, చండ్రగూడెం మాజీ సర్పంచ్, మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు, వైసీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు దేవరకొండ ఆంజనేయులు, వెల్వడం బూత్ కమిటీ కన్వీనర్, ఎస్సీ సెల్ మండల కన్వీనర్ ప్రత్తిపాటి కిరణ్ తదితరులు టీడీపీలో చేరారు.

ఎన్నికల ముంగిట సైకిల్ జోరు - టీడీపీలోకి చేరేందుకు సిద్ధమైన వైసీపీ నేతలు

ysrcp_mla_vasantha_krishnaprasad_joined_in_tdp
పార్టీలో చేరిన వారితో టీడీపీ అధినేత చంద్రబాబు

రెడ్డిగూడెం మండలం నుంచి శ్రీరాంపురం గ్రామపంచాయతీ సర్పంచ్ అట్లూరి శ్రీనివాసరావు, , విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం కమిటీ మాజీ సభ్యుడు నేలపట్ల అంబికా నాగరాజు నంద, శ్రీరాంపురం వార్డు సభ్యులు చిన్ని తిరుపతిరావు, చిన్ని వలరాజు, రెడ్డిగూడెం యాదవ సంఘం అధ్యక్షుడు చిన్ని రామారావు, వైసీపీ సీనియర్ నేతలు మానికల సాంబశివరావు, పటాపంచల రామారావు, పూల కోటేశ్వరరావు, మడిమల నాగమల్లేశ్వరరావు, కొండపల్లి సురేశ్, పూల వెంకటేశ్వరరావు, చామకూర దుర్గాప్రసాద్, సోమరాజు చిన లక్ష్మయ్య, బత్తుల శ్రీనివాసరావు, వినుకొండ రాంబాబు, దగ్గుమల్లి పుల్లారావు, బత్తుల వెంకటనారాయణ, తమతిక్క శ్రీనివాసరావు తదితరులు ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్​ వెంట టీడీపీలో చేరారు.

చంద్రబాబు, లోకేశ్​ను తిడితేనే పదవులా?- రాష్ట్రాభివృద్ధి బాబుతోనే సాధ్యం: ఎమ్మెల్యే వసంత

ysrcp_mla_vasantha_krishnaprasad_joined_in_tdp
పార్టీలో చేరిన వారితో టీడీపీ అధినేత చంద్రబాబు

ఇబ్రహీంపట్నం మండల పరిషత్తు అధ్యక్షురాలు పాలడుగు జ్యోత్స్న దుర్గాప్రసాద్, తుమ్మలపాలెం సర్పంచ్ బొమ్ము వెంకట రమణ, తుమ్మలపాలెం వైఎస్సార్సీపీ గ్రామ కన్వీనర్ చింతల చిట్టిబాబు, మూలపాడు పీఏసీఎస్​ చైర్మన్ గౌరినేని గాంధీ, జూపూడి సర్పంచి, కాకి దేవమాత, కాచవరం వైసీపీ గ్రామ పార్టీ కన్వీనర్ వాసిరెడ్డి హరినాథ్, బ్యూటీఫికేషన్ కార్పోరేషన్ స్టేట్ డైరెక్టర్ పోలగంగు రాణి, కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ దామెర్ల శ్రీ లక్ష్మి, కొండపల్లి మున్సిపల్ కౌన్సిలర్, మైనార్టీ నాయకుడు షేక్ రసూల్, వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మడుపల్లి ఆనందకుమార్, ఫిషర్ మెన్ సొసైటీ స్టేట్ డైరెక్టర్ లంకె గోవిందరాజులు, కొండపల్లి-1 సచివాలయ కన్వీనర్ బొర్రా భవాని శంకరరావు, మండల మహిళా విభాగం అధ్యక్షురాలు బొర్రా జ్యోతి, ఇబ్రహీంపట్నం మండల బూత్ కన్వీనర్ చెరుకుమల్లి తిరుపతిరావు, దాములూరు పీఏసీఎస్​ చైర్మన్, చెరుకుమల్లి సీతారామంజనేయులు, జూపూడి వైఎస్సార్సీపీ నాయకుడు రామినేని పోతురాజు, ఉప సర్పంచి కొక్కిలిగడ్డ నాగరాజుతో పాటు నాయకులు, కాకి రాఘవులు, దేవరకొండ వెంకటేశ్వరరావు, ఆంజనేయులు, అడపా కొండపల్లి కౌన్సిలర్ వెంకయ్యనాయుడు, సీనియర్​ నేతలు పల్లపోతు బాలాజీ, పల్లపోతు బ్రహ్మజీ ఉన్నారు,

ysrcp_mla_vasantha_krishnaprasad_joined_in_tdp
ఎమ్మెల్యే కృష్ణప్రసాద్​తో చంద్రబాబు

జి.కొండూరు మండల వైసీపీ అధ్యక్షుడు నెల్లూరు లీలా శ్రీనివాస్, కందులపాడు సర్పంచ్ నెల్లూరు శ్రీదేవి, వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు సూదిరెడ్డి సురేష్, వైసీపీ సీనియర్ నాయకులు గార్లపాటి వెంకట్రావు(తుఫాన్), విజయవాడ రూరల్ నుంచి మండల వైసీపీ అధ్యక్షుడు కాటంనేని పూర్ణచంద్రరావు, మండల కమిటీ కన్వీనర్, జక్కంపూడి వైఎస్సార్ కాలనీ నుంచి ముప్పాళ్ల చైతన్య కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం మాజీ కార్యదర్శి పెద్ది రాంబాయమ్మ తదితరులు టీడీపీలో చేరారు.

'కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుద్ది!- వైఎస్సార్సీపీలో పరిస్థితి దొంగే.. దొంగ అన్నట్లుగా ఉంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.