ETV Bharat / politics

'కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుద్ది!- వైఎస్సార్సీపీలో పరిస్థితి దొంగే.. దొంగ అన్నట్లుగా ఉంది'

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 6, 2024, 2:52 PM IST

MLA Vasantha Venkata Krishnaprasad on YSRCP: అధికార వైఎస్సార్​ కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తలే కాదు ఎమ్మెల్యేలు, మంత్రుల మాటకు కూడా విలువలేదని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. కార్యకర్తలు సొంత డబ్బులు పెట్టుకుని పనులు చేయించి పార్టీని బతికిస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారని ఆ పార్టీ మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్​ ఆరోపించారు.

MLA_Vasantha_Venkata_Krishnaprasad_on_YSRCP
MLA_Vasantha_Venkata_Krishnaprasad_on_YSRCP

MLA Vasantha Venkata Krishnaprasad on YSRCP: వైఎస్సార్సీపీలో అంతర్గత పరిస్థితులు ఎలా ఉన్నాయి? ముఖ్యమంత్రి జగన్​, మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సంబంధాల మాటేమిటి? ప్రజాప్రతినిధులు, ద్వితీయ శ్రేణి నేతలు, ముఖ్య కార్యకర్తల భవిష్యత్​ ఏమిటి? ఇలాంటి సందేహాలన్నింటికీ మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్​ నిర్వహించిన మీడియా సమావేశంలో సమాధానం దొరుకుతుంది. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో పార్టీకి గుడ్​బై చెప్పే వారి సంఖ్య అంచనాలు మించిపోయే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

'కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుద్ది..' ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్యే వసంత ఇచ్చిన సమాధానమిది. మూడేళ్లుగా జరుగుతోన్న గ్రావెల్ తవ్వకాలపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించగా.. చేసేదంతా మా వాళ్లే. కానీ, దొంగే.. దొంగ అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఉద్దేశపూర్వకంగా మా వాళ్లే నాపై ఆరోపణలు చేయడం అత్యంత బాధాకరమైన అంశం అని వసంత ఆవేదన వ్యక్తం చేశారు.

అబద్ధాలతోనే వైసీపీ పాలన - జగన్‌ అర్జునుడు కాదు సైతాన్: సత్యకుమార్‌

ఏ పని చేసినా ముఖ్యమంత్రి చేతుల మీదుగా, ఆయన పేరిట మాత్రమే జరగాలి. స్థానిక విషయాలు, అవసరాలు ఆయనకు పట్టవు. తాడేపల్లి ప్యాలెస్​లో సర్వశాఖల మంత్రులు తీసుకునే స్వతంత్ర నిర్ణయాలన్నీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా, స్థానిక అవసరాలకు భిన్నంగా ఉంటున్నాయి. ఈ క్రమంలో పార్టీని నమ్ముకున్న ఎంతో మంది కాంట్రాక్టర్లు, ద్వితీయ శ్రేణి నేతలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు.

అప్పుల బాధలో ఎమ్మెల్యేలను ఆశ్రయిస్తున్నారు. వారికి ఆర్థిక సహకారం అందించేలా ఎమ్మెల్యేలు ఏవైనా స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటే వారిపై అవినీతి మరక అంటిస్తున్నారు. తాడేపల్లి కేంద్రంగా బటన్ ​నొక్కితే గంపగుత్తగా వచ్చి పడాలన్న ఆలోచనే తప్ప అభివృద్ధి, పార్టీని నమ్ముకున్న వారి సంక్షేమం ఆలోచనే లేదన్నది వాస్తవం.

టీడీపీ స్టిక్కర్లు అతికించుకుంటే ప్రభుత్వ పథకాలు ఆపేస్తాం: ఉపముఖ్యమంత్రి అంజాద్‌భాష

ఆ ఒక్కమాటతో: అన్నింటికీ మించి జగన్​తో జరిగిన ఓ భేటీ తనను తీవ్రంగా ఆలోచింపజేసిందని వసంత తెలిపారు. ప్రతిపక్షం కూడా విమర్శించే సాహసం చేయని అంశంపై జగన్​ మాట్లాడడం తనను అంతర్మథనంలో పడేసిందని వివరించారు. పార్టీ, ప్రభుత్వంపై నమ్మకంతో ఎంతో మంది కార్యకర్తలు పనులు చేసినా బిల్లులు రాలేదని వసంత వెల్లడించారు. ఈ క్రమంలో వారందరికీ ఆర్థిక వెసులు బాటు కల్పించేలా పనులు అప్పగిస్తే అవినీతి మరక అంటగట్టారని వాపోయారు.

చెరువులు బాగుచేయించడంతో పాటు కార్యకర్తలు మట్టి తీసుకెళ్లి రైతులకు అమ్ముకొనేలా ఆర్థిక వెసులు బాటు కల్పించానని, దానిపై ముఖ్యమంత్రి ఇంటికి పిలిపించి ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేశారని వసంత మండిపడ్డారు. స్థానిక నాయకులు, కార్యకర్తలకు తాను అండగా ఉంటే మీరిలా మాట్లాడడం సరికాదని అక్కడే చెప్పేశానని తెలిపారు. సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెబితే మిమ్మల్ని ఎవరు అడిగారు? ఎవరు ఇవ్వమన్నారు? అని ముఖ్యమంత్రి తనను ఎదురు ప్రశ్నించారని వసంత గుర్తు చేసుకున్నారు.

Balineni Letter to DGP: 'నాలుగేళ్లుగా దారుణాలు చూస్తున్నా'.. పోలీసుల తీరుకు నిరసనగా గన్​మెన్లను సరెండర్ చేస్తున్నట్లు బాలినేని లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.