Balineni Letter to DGP: 'నాలుగేళ్లుగా దారుణాలు చూస్తున్నా'.. పోలీసుల తీరుకు నిరసనగా గన్​మెన్లను సరెండర్ చేస్తున్నట్లు బాలినేని లేఖ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 17, 2023, 1:01 PM IST

thumbnail

Balineni Srinivasa Reddy Write a Letter to AP DGP: ఒంగోలు పోలీసుల తీరుపై మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో నకిలీ భూ కుంభకోణం కేసులో పోలీసులు వ్యవహరించిన తీరును వ్యతిరేకిస్తూ ఆయన తన గన్‌మెన్‌లను తక్షణమే సరెండర్‌ చేస్తున్నట్లు డీజీపీ లేఖ రాశారు. జిల్లాలో కలకలం రేపిన నకిలీ భూ పత్రాల కేసులో అధికార పార్టీ నేతల పాత్ర ఉన్నా.. అరెస్టు చేయాల్సిందేనని.. బాలినేని శ్రీనివాసరెడ్డి మూడు రోజుల క్రితం కలెక్టర్‌ సమక్షంలో ఎస్పీని కోరారు. కేసులో తన పక్కనున్నవారినైనా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవద్దని హెచ్చరించారు. 

కాగా, నకిలీ భూపత్రాల కేసులో పోలీసులు ఇప్పటి వరకు కేవలం పది మందిని మాత్రమే అరెస్టు చేశారు. అసలు దోషుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని.. అనధికారికంగా కొన్ని పేర్లు చెబుతున్నారని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి తీరును ఎన్నడూ చూడలేదని.. గత నాలుగేళ్ల నుంచే ఇలాంటి విచిత్ర పరిస్థితులు చూస్తున్నానని అన్నారు. పోలీసులు తన సూచనలను పెడచెవిన పెడుతున్నారని.. తక్షణమే గన్‌మెన్లను సరెండర్‌ చేస్తున్నట్లు బాలినేని డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఐతే నగరంలో జరుగుతున్న భూ దందాలన్నీ బాలినేని ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.