ETV Bharat / politics

జగన్​ వైఖరి రాష్ట్రానికి పెనుశాపం - వైఎస్​తో ఆయనకు పోలికే లేదు: వైసీపీ ఎమ్మెల్యే వసంత

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 5, 2024, 7:09 PM IST

MLA Vasantha Venkatakrishna Prasad Press meet : వైనాట్ 175 అంటున్న జగన్​.. గత ఎన్నికల్లో 150సీట్లు ఇస్తేనే రాష్ట్రానికి ఈ గతి పట్టింటారు. ఇక 175సీట్లు అప్పగిస్తే రాష్ట్ర భవిష్యత్​ ఏమిటని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్​ ప్రశ్నించారు. నియోజకవర్గ ఆత్మీయ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం ఖాయమని, ఏ పార్టీలో చేరేది తొందర్లో చెబుతానని అన్నారు.

ysrcp_mla_vasanta_venkata_krishna_prasad
ysrcp_mla_vasanta_venkata_krishna_prasad

MLA Vasantha Venkatakrishna Prasad Press meet : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం ఖాయం, ఏ పార్టీలో చేరేది తొందర్లో చెబుతా, మొదట రాజకీయ సన్యాసం తీసుకోవాలనుకున్నా కానీ, ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నానని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమానం కాదని వ్యాఖ్యానించారు. తాను సాధారణ కార్యకర్తగా, నందిగామ నియోజకవర్గ ఇన్​చార్జిగా అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్​రెడ్డిని కలవగలిగానే గానీ, ఇవాళ ఎమ్మెల్యే హోదాలో కూడా సీఎం జగన్​ను నాలుగు సార్లు కలవలేకపోయానని విచారం వ్యక్తం చేశారు.

ఎన్నో అవమానాలు భరించా - జగన్​ మాట తప్పరని భావించి మోసపోయా: వసంత

తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ, జనసేన పార్టీల నుంచి తనకు ఆహ్వానం వచ్చిందని వసంత కృష్ణ ప్రసాద్​ చెప్పారు. మైలవరం నుంచి పెడనకు ప్రతిరోజు వెళ్లే ఓ వ్యక్తి గత రెండున్నరేళ్లుగా నన్ను ఇబ్బందులు పెడుతున్నాడు. ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పరోక్షంగా మంత్రి జోగి రమేశ్​ ను ఉద్దేశించి మాట్లాడారు. అధిష్ఠానం అతడిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. నియోజకవర్గంలో సొంత పార్టీ వాళ్లు గ్రూపులు ఏర్పాటు చేసి ఇబ్బంది పెట్టగా తనకు ప్రత్యేకమైన దేవినేని ఉమామహేశ్వరరావు ప్రతి రోజూ తనను విమర్శిస్తుంటే ఆయనకు సహకరిస్తూ కొంతమంది ఇబ్బంది పెట్టారని వాపోయారు.

అవసరమైతే రాజకీయాలు మానేస్తా.. కానీ ఆ పని చేయను..: వసంత కృష్ణ ప్రసాద్

వీటీపీఎస్​లో బూడిద అంశం, కొత్తూరు, తాడేపల్లిలో మట్టి అక్రమ తవ్వకాలు గురించి సీఎం దృష్టికి తీసుకెళ్లా, గత రెండున్నర ఏళ్లుగా అధికారులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. తన ప్రమేయం లేకుండా బూడిద, మట్టి అక్రమ రవాణా జరిగిందని, దీనిపై ఎప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. గత రెండున్నర ఏళ్లుగా తన ప్రమేయం లేకుండానే లక్ష లారీల్లో మట్టి అక్రమ తవ్వకాలు చేసి అక్రమ రవాణాకు పాల్పడ్డారన్నారు. దీనిలో వాస్తవం ప్రతిపక్ష నాయకులకు తెలుసు కానీ కావాలని తన పైనే ఆరోపణ చేశారని ఆక్షేపించారు. పేదలకు పట్టాలిచ్చిన భూమిలో మెరక చేసేందుకు పనులు చేస్తే ఇప్పటి వరకు బిల్లులు రాలేదని, సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెబితే మిమ్మల్ని ఎవరు అడిగారు? ఎవరు ఇవ్వమన్నారు? అని ఎదురు ప్రశ్నించారని వసంత వెల్లడించారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకున్నారు కానీ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేకపోయామని చెప్పారు. 95 శాతం పార్టీ ఓట్లు వల్లే గెలిచాం, ముఖ్యమంత్రి వల్లే గెలిచి ఎమ్మెల్యేలు అయ్యామని, చివరి ఐదు శాతం మాత్రమే తమ వల్ల వచ్చి గెలిచామన్నారు.

నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే వసంత వరుస సమావేశాలు - నిర్ణయంపై ఉత్కంఠ !

అభివృద్ధిలో వెనకబడ్డాం, మంచి చేయలేకపోయాం. జి కొండూరులో రోడ్డు కాంట్రాక్టర్​కు బిల్లులు ఇవ్వలేదు, బతిమిలాడి పనులు చేయిస్తే బిల్లులు చేయకపోవడం వల్ల ఆ కాంట్రాక్టర్ ఇబ్బంది పడ్డాడని తెలిపారు. ప్రతిపక్ష ఎంపీలు కనకమేడల రవీంద్ర, కేశినేని నాని, సుజనా చౌదరి నుంచి, వారి ఎంపీ నిధుల నుంచి అడిగి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశానన్నారు. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని 50 లక్షల రూపాయలు నిధులు అడిగితే సీఎం సంతకం తీసుకొని వస్తే ఇస్తామన్నారని తెలిపారు. చివరికి తన స్పిన్నింగ్ మిల్లుకు సంబంధించి రావాల్సిన నిధులు కేవలం 25 కోట్లు మాత్రం వచ్చాయి, మిగిలినవి రాలేదన్నారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదు అనుకుంటున్నారు ఇది సరైనది కాదని హితవు పలికారు. అధికారం, పదవుల కోసం తాను పాకులాడడం లేదని, తన మనసు గాయపడటం వల్లే మనస్తాపానికి గురయ్యానని వసంత పేర్కొన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సీఎం జగన్మోహన్ రెడ్డికి చాలా తేడా ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాట తప్పడు, మడతప్పడు తిప్పడు - సీఎం జగన్ మోహన్ రెడ్డి దీనికి పూర్తిగా విరుద్ధం. అన్ని విషయాల్లో పూర్తిగా మాట తప్పుతాడు, మడమ తిప్పుతాడని వసంత విమర్శించారు. మూడు రాజధానుల విధానం కరెక్ట్ కాదన్న వసంత, ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంటే మరో ప్రాంతం వాళ్లు కాదనరని తెలిపారు. రాష్ట్రంలో సీనియర్ నాయకులైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపైకే దాడికి వెళ్లారు, చివరికి సొంత సోదరి షర్మిల పైనా దాడులు చేస్తున్నారు ఇదంతా దీర్ఘకాలంలో రాష్ట్రానికి పెను శాపమని మండిపడ్డారు. ఆదాయం చేయకుండా అప్పులు తీసుకురావడం కరెక్ట్ కాదని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్​ కుండబద్ధలు కొట్టారు.

అందరితో మాట్లాడి రాజకీయ భవిష్యత్​ కార్యాచరణ ప్రకటిస్తా : వసంత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.