ETV Bharat / politics

ఎన్నో అవమానాలు భరించా - జగన్​ మాట తప్పరని భావించి మోసపోయా: వసంత

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 5, 2024, 4:37 PM IST

YSRCP MLA Vasantha Venkata Krishna Prasad Comments : ముఖ్యమంత్రి జగన్​ మాట తప్పారని, మూడు రాజధానుల నిర్ణయం పార్టీకి తీవ్ర నష్టం కలిగించిందని వైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఐదేళ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి ఏమీ చేయలేకపోవడంతో అంతర్మథనం మొదలైందని, పార్టీలో అవమానాలు ఎదురవుతున్నా ఏడాదిగా సహించానని వసంత వెల్లడించారు.

ysrcp_mla_vasanta_venkata_krishna_prasad
ysrcp_mla_vasanta_venkata_krishna_prasad

YSRCP MLA Vasantha Venkata Krishna Prasad Comments on Jagan : ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి మైలవరం నియోజకవర్గం నుంచి భారీగా ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం చర్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గత కొంతకాలంగా ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఏలూరులో వైసీపీ ఎన్నికల నగారా మోగించిన 'సిద్ధం' మహాసభకు సైతం వసంత గైర్హాజరయ్యారు. ఈ పరిస్థితుల్లో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారని ఊహాగానాలు వినిపించగా ఇవాళ మైలవరం నియోజకవర్గపు ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సభా వేదికగా వసంత ఏం చెబుతారు, ఆయన నిర్ణయం ఏమిటి ? రాజకీయ భవిష్యత్​ కార్యాచరణ ఎలా ఉంటుందో అనే ఆసక్తితో నియోజకవర్గం వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తన అనుచరులను ఉద్దేశించి మాట్లాడిన వసంత కృష్ణ ప్రసాద్​ ఐదేళ్లలో జరిగిన పరిణామాలను వెల్లడించారు.

అవసరమైతే రాజకీయాలు మానేస్తా.. కానీ ఆ పని చేయను..: వసంత కృష్ణ ప్రసాద్

కక్షసాధింపు చర్యలతో ఏమీ సాధించలేరు, అధికారం ఉందని అహంకారం ప్రదర్శించకూడదని వసంత కృష్ణప్రసాద్‌ అన్నారు. చంద్రబాబును తిడితే పదవులు ఇస్తామంటే ఎలా అని ప్రశ్నించానన్న ఆయన, మనసు గాయపడ్డాక నిలువెత్తు బంగారం ఇస్తానన్నా వెనక్కి వెళ్లనని స్పష్టం చేశారు. రాజకీయాల నుంచి వెళ్లొద్దని తన అనుచరులు, అభిమానులు చెప్పారని, తన కుటుంబ సభ్యులు, అభిమానులతో మాట్లాడిన తర్వాతే భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని వసంత వెల్లడించారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా భయపడేది లేదని స్పష్టం చేశారు.

నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే వసంత వరుస సమావేశాలు - నిర్ణయంపై ఉత్కంఠ !

శాసనసభ్యుడిగా ఒక్క రూపాయి కూడా సాధించలేకపోయానని వసంత కృష్ణప్రసాద్‌ వాపోయారు. నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం ఎన్నోసార్లు అడిగానని, తాను ఎన్ని ప్రతిపాదనలు ఇచ్చినా బుట్టదాఖలు చేశారని పేర్కొన్నారు. గతంలో వైఎస్‌ నందిగామ కోసం రూ.100 కోట్ల నిధులిచ్చారు, కానీ, జగన్‌ హయాంలో రూ. కోటి కూడా తెచ్చుకోలేకపోయా అని వివరించారు. నియోజకవర్గంలో అభివృద్ధి ఏమీ చేయలేకపోవడంతో అంతర్మథనం మొదలైందని, పార్టీలో అవమానాలు ఎదురవుతున్నా ఏడాదిగా సహించానని వసంత కృష్ణప్రసాద్‌ వెల్లడించారు. ఎన్నికలకు ముందే జగన్‌ను కలిసి రాజధానిపై స్పష్టత అడిగానని, అమరావతిలోనే రాజధాని ఉంటుందని జగన్‌ చెప్పారని, 'నేను ఇల్లు కూడా కట్టుకున్నా కదా' అని జగన్‌ బదులిచ్చారని వసంత కృష్ణప్రసాద్‌ గుర్తు చేసుకున్నారు. జగన్ మాట ఇచ్చారు కదా తప్పరని భావించి మోసపోయానని చెప్పారు.

అందరితో మాట్లాడి రాజకీయ భవిష్యత్​ కార్యాచరణ ప్రకటిస్తా : వసంత

ఎన్నికలకు ముందు ఒకమాట తర్వాత మరో మాట చెప్పారని, 3 రాజధానుల బిల్లు పెట్టిన రోజే పార్టీ మీటింగ్‌ పెట్టి సమర్థించాలని పార్టీ పెద్దలు చెప్పారని, పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పినా పట్టించుకోలేదని వెల్లడించారు. మూడు రాజధానుల నిర్ణయం తప్పనిసరైతే సెక్రటేరియట్‌ అయినా ఇక్కడే ఉంచాలని కోరానని తెలిపారు. ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ కార్యకర్తలు పెట్టుబడి పెట్టాలా ? అని వసంత కృష్ణప్రసాద్‌ జగన్​ను ఉద్దేశించి సూటిగా ప్రశ్నించారు. పనులు చేసిన కార్యకర్తలకు బిల్లులు రాలేదని, ఓట్ల కోసం కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలా ? అని అన్నారు.

చెప్పుకుంటూ పోతే వంద సమస్యలు ఉన్నాయి: ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.