అందరితో మాట్లాడి రాజకీయ భవిష్యత్​ కార్యాచరణ ప్రకటిస్తా : వసంత

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 4, 2024, 7:19 PM IST

thumbnail

Mylavaram MLA Vasantha Venkata Krishna: నియోజకవర్గ కార్యకర్తలతో సోమవారం రోజున సమావేశమైన అనంతరం తన భవిష్యత్‌ రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని మైలవరం వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలిపారు. ఆదివారం నియోజకవర్గ, మండలస్థాయి నాయకులతో సమావేశం నిర్వహించారు. సోమవారం కార్యకర్తల సమావేశాన్ని ఐతవరం గ్రామంలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మీడియా సమావేశం నిర్వహిస్తామన్నారు.

వైఎస్సార్​సీపీ ఇప్పటి వరకు ప్రకటించిన ఏ ఒక్క జాబితాలోనూ, ప్రస్తుతం మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రతినిథ్యం వహిస్తున్న వసంత వెంకట కృష్ణప్రసాద్​ పేరు ప్రకటించలేదు. అంతేకాకుండా మైలవరం నియోజకవర్గానికి వైఎస్సార్​సీపీ తరపున ఇంచార్జీగా తిరుపతిరావును ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయన తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాకుండా నందిగామ జనసేన సమన్వయకర్త ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్​తో భేటీ అయ్యారు. ఈ క్రమంలో మైలవరం ఎమ్మెల్యే ఏ పార్టీలో చేరతారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పార్టీ మారతారా లేక వైఎస్సార్​సీపీలోనే కొనసాగుతారా అనేది తేలాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.