ETV Bharat / politics

లౌకికవాదాన్ని నిలబెట్టుకోవాలనే కాంగ్రెస్‌లో చేరా - నియోజకవర్గ అభివృద్ధి నా బాధ్యత : కడియం శ్రీహరి - MLA KADIYAM Fires ON BJP

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 1, 2024, 1:38 PM IST

Updated : Apr 1, 2024, 2:55 PM IST

MLA Kadiyam Fires on BJP : బీజేపీ మతోన్మాదాన్ని అడ్డుకోవడం కేవలం కాంగ్రెస్​తోనే సాధ్యమని స్టేషన్​ఘన్​పూర్​ ఎమ్యెల్యే కడియం శ్రీహరి అన్నారు. అందుకే తాను కాంగ్రెస్​లో చేరినట్లు తెలిపారు.

MLA Nagaraju Fires On EX CM KCR
Congress MLA Kadiyam Latest Comments

నా నియోజకవర్గం అభివృద్ధి కోసం కాంగ్రెస్‌లోకి వెళ్లా కడియం శ్రీహరి

MLA Kadiyam Fires on BJP : బీజేపీ మతోన్మాదాన్ని అడ్డుకోవడం కాంగ్రెస్‌తోనే సాధ్యమని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. లౌకికవాదాన్ని నిలబెట్టుకోవాలనే కాంగ్రెస్‌లో చేరానన్న కడియం, దేశంలో, రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ పార్టీని (Kadiyam Speaks Against BRS) బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా పార్టీలోని నేతలతో సమావేశమవుతున్నానని, అందులో భాగంగానే వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్‌.నాగరాజుతో భేటీ అయ్యానని తెలిపారు. ఓట్లేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజల అభివృద్ధిని ఎప్పుడూ మరవనని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరి, కావ్య - పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ - Lok Sabha Elections 2024

"ఆదివారం కాంగ్రెస్‌ పార్టీలో చేరాను. బీజేపీ మతోన్మాదాన్ని అడ్డుకోవాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యం. లౌకికవాదాన్ని నిలబెట్టుకోవాలనే కాంగ్రెస్‌లో చేరా. కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకే ఆ పార్టీలో చేరాను. నా నియోజకవర్గం అభివృద్ధి కోసం కాంగ్రెస్‌లోకి వెళ్లా." - కడియం శ్రీహరి

MLA Nagaraju Fires On EX CM KCR : అంతకుముందు వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్​.నాగరాజుతో కడియం భేటీ అయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఎమ్మెల్యే నాగరాజు, కేసీఆర్​పై విమర్శలు చేశారు. కేసీఆర్​ మరోసారి ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని అన్నారు. కాళేశ్వరం కేసీఆర్​కు ఏటీఎంలా (Kaleshwaram Project) మారిందని ఆరోపించారు. రైతులను కేసీఆర్​ పట్టించుకోలేదని విమర్శించారు. బీఆర్​ఎస్​ నేతలు రైతుల కోసం ధర్నాలు చేస్తే, వారే తరిమి కొడతారని ఎద్దేవా చేశారు.

MLA Kadiyam Srihari Joins in Congress : లోక్​సభ ఎన్నికల సమయం మొదలైందో లేదో పార్టీ ఫిరాయింపులు జోరుగా షురూ అయ్యాయి. ప్రధాన ప్రతిపక్షమైనా బీఆర్​ఎస్​ నుంచి భారీగా కాంగ్రెస్​లోకి చేరుతున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హస్తం కండువా కప్పుకుంటున్నారు. బీఆర్​ఎస్​ సీనియర్​ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి సైతం కాంగ్రెస్​లో చేరడంతో ఆ పార్టీకి పరిస్థితికి అద్దం పడుతోంది. దీనికి కారణం బీఆర్‌ఎస్‌ అధినాయకత్వంపై అవినీతి ఆరోపణలు, మద్యం కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్ మొదలైన అంశాలు పార్టీకి అప్రతిష్ట తెచ్చాయని కడియం భావన. మరోవైపు ఆయన ఒక సమావేశంలో 'ఓడి పోయే పార్టీ నుంచి కావ్య పోటీ వద్దనుకున్నాం' అని అన్నారు.

అంతేకాకుండా మొదటిసారి పోటీలో నిలిచిన తన కుమార్తె కావ్యకు జిల్లా నాయకులు సహకరించట్లేదన్నదీ కడియం వాదన. ఈ పరిస్థితుల్లో కావ్య పోటీ చేస్తే ఓటమి తప్పదని కడియం శ్రీహరి గ్రహించారు. దీంతో పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు కావ్య కేసీఆర్‌కు లేఖ రాశారు. పార్టీ మారాలన్న నిర్ణయాన్ని తన అనుచరులతో చర్చలు జరిపి నిర్ణయించుకున్నారు.

'ఓడిపోయే పార్టీ నుంచి కావ్య పోటీ వద్దనుకున్నాం - అందుకే తగిన నిర్ణయం తీసుకున్నాం' - Kadiyam Srihari Meet with Activists

Last Updated : Apr 1, 2024, 2:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.