ETV Bharat / politics

అధికారంలో ఉన్నప్పుడు చేయని రుణమాఫీ గురించి హరీశ్​రావు మాట్లాడటం అర్ధరహితం : రఘునందన్​ రావు - Raghunandan Rao Slams Harish Rao

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 26, 2024, 5:07 PM IST

Raghunandan Rao Election Campaign
Raghunandan Rao Fires on BRS and Congress

Raghunandan Rao Fires on Harish Rao : పదేళ్లు అధికారంలో ఉండి రైతు రుణమాఫీ చేయని హరీశ్​ రావు ఇప్పడు దాన్ని గుర్తించి ప్రస్తావించడం అర్ధరహితమని మెదక్ బీజేపీ అభ్యర్థి రఘనందన్​రావు వ్యాఖ్యానించారు. నిజాంపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన కాంగ్రెస్​, బీఆర్​ఎస్​పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

Raghunandan Rao Fires on BRS and Congress : అధికారంలో ఉండి రైతు రుణమాఫీ చేయని మాజీ సీఎం కేసీఆర్​, మాజీ మంత్రి హరీశ్​ రావు రాజకీయ సన్యాసం తీసుకుని ఫామ్​హౌస్​లో వ్యవసాయం చేసుకోవాలని మెదక్​ బీజేపీ అభ్యర్థి రఘునందన్​ రావు వ్యాఖ్యానించారు. నిజాంపేటలో బీజేపీ నాయకులు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సీఎం రేవంత్​ రెడ్డి తిట్టినట్టు, హరీశ్​రావు ఏడ్చినట్టు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి లక్ష రూపాయల రుణమాఫీ చేయలేదని, తప్పైందని హరీశ్​ రావు అమరవీరుల స్ధూపం వద్ద ముక్కు నెలకు రాసిన తర్వాత సీఎం రేవంత్​ రెడ్డికి సవాల్​ విసరాలని తెలిపారు. తాను చేయలేనిది ఇంకొకరిని చేయమని చెప్పడం అర్ధరహితం అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్​ఎస్​ ఒకటై బీజేపీపై ప్రజలకు వ్యతిరేకత రావటానికి ఒకరకమైన కుట్ర చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. హరీశ్​ రావుకు మాట్లాడడమే తప్ప ఏం చేతకాదన్నారు.

తెలంగాణకు హాని చేసే వారు ఎవరైనా సరే వారితో పోరాడతాం : రఘునందన్‌ రావు - Raghunandan Rao Meet The Press

Medak BJP Candidate Raghunandan Rao Election Campaign : పది సంవత్సరాలు అధికారంలో ఉండి చేయని పనిని ఐదు నెలలు కాకముందే ఎగబడుతున్నారంటే రేవంత్​ రెడ్డి, హరీశ్​ రావు ఇద్దరు బదురుకుని వచ్చారన్నారు. మెదక్​లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేకే రేవంత్​ రెడ్డి, హరీశ్​ రావు కొత్త నాటకానికి తెర లేపారని మండిపడ్డారు. కానీ వీరిద్దరు రాజీనామా చేసేవాళ్లు కాదని అన్నారు. రాజీనామా చేయాలని సవాల్ విసురుతూ మీడియా అటెన్షన్​ అంతా వారిపై ఉండేటట్లు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

"రైతు రుణమాఫీ చేయలేని మాజీ సీఎం కేసీఆర్​, మాజీ మంత్రి హరీశ్​ రావు అయిన మామ అల్లుడు ఇద్దరు రాజకీయ సన్యాసం తీసుకుని ఫామ్​హౌస్​లో వ్యవసాయం చేయాలని బీజేపీ తరఫున సూచన. దొంగా, చీకటి ఒకటైనట్టు రేవంత్​ రెడ్డి, హరీశ్​రావు కుట్ర చేస్తున్నారు. కేటీఆర్​కు ఇది అర్థం కాదు." - రఘునందన్​ రావు, మెదక్​ బీజేపీ అభ్యర్థి

దొంగా, చీకటి ఒకటైనట్టు రేవంత్ రెడ్డి, హరీశ్​రావు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఇదంతా కేటీఆర్​కు తెలిసేలోపే హరీశ్​రావు కొత్త పార్టీ పెడతారని జోస్యం చెప్పారు. ఇవన్నీ తెలియని వ్యక్తి కేటీఆర్​ అన్నారు. హరీశ్​ రావు విషయంలో కేటీఆర్​ జాగ్రత్త పడాలని సూచించారు. ముస్లిం రిజర్వేషన్​ పట్ల బీజేపీ మాత్రమే క్లియర్​గా ఉందని తెలిపారు. ఓబీసీ, అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఉండాలని కోరుకుంటున్న ఏకైక పార్టీ బీజేపీ అన్నారు.

Raghunandan Rao Muslim Reservation : కాంగ్రెస్​, బీఆర్​ఎస్​లకు ముస్లింలతో వీడదీయరాని బంధం ఉందన్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారంటూ కాంగ్రెస్​, బీఆర్ఎస్​ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పదేళ్లు అధికారంలో ఉన్నామన్నా ఆయన ఎప్పుడూ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పాలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్​ అంటేనే నయవంచన అని ప్రజలు భావిస్తున్నట్లు తెలిపారు. అలాంటిది రేవంత్ కొత్త నాటకాన్ని తెరలేపారని ధ్వజమెత్తారు.

అధికారంలో ఉన్నప్పుడు చేయని రుణమాఫీ గురించి హరీశ్​రావు మాట్లాడటం అర్ధరహితం రఘునందన్​రావు

దేశంలో మోదీ గాలి వీస్తోంది, ఈసారి 400 సీట్లు సాధిస్తాం - గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ - Gujarath Cm Election Campaign

'కలెక్టర్​గా ఉన్నప్పుడు కాంట్రాక్టర్​ అవతారమెత్తి రూ.కోట్లు దండుకున్నాడు - అందుకే రూ.100 కోట్లతో అభివృద్ధి అంటున్నాడు' - Raghunandan Rao on Venkatrami Reddy

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.