ETV Bharat / politics

రాష్ట్రంలో కాలం తెచ్చిన కరవు లేదు - కాంగ్రెస్‌ తెచ్చిన కరవే ఉంది : కేటీఆర్‌

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 7, 2024, 3:01 PM IST

Updated : Mar 7, 2024, 3:52 PM IST

KTR Participate in Karimnagar BRS Meeting : రాష్ట్రంలో కాలం తెచ్చిన కరవు కాదు, కాంగ్రెస్‌ తెచ్చిన కరవునే ఉందని బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ తెలిపారు. కరీంనగర్‌ జిల్లా నిర్వహించిన బీఆర్‌ఎస్‌ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ, ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పించారు.

KTR meeting
KTR

KTR Participate in Karimnagar BRS Meeting : అబద్ధాలు చెప్పడమే సీఎం రేవంత్‌ రెడ్డి పనిగా పెట్టుకున్నారని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌(KTR) ధ్వజమెత్తారు. గుజరాత్‌ మోడల్‌గా రాష్ట్రాన్ని తయారు చేస్తామని సీఎం అంటున్నారని అన్నారు. గుజరాత్‌ మోడల్‌ అంటే హిందువులు, ముస్లింలు తన్నుకోవడమా అని ప్రశ్నించారు. కరీంనగర్‌లో నిర్వహించిన కరీంనగర్‌ కదనభేరి సన్నాహక సమావేశం, పార్లమెంటరీ స్థాయి సమీక్ష సమావేశంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. అనంతరం కదనభేరి గోడపత్రికను ఆవిష్కరించారు.

రాహుల్‌గాంధీ(Rahul Gandhi) ఏమో గుజరాత్‌ మోడల్‌ అట్టర్‌ ప్లాప్‌ అంటారు, మరి సీఎం రేవంత్‌ ఏమో గొప్పదని అంటారని కేటీఆర్‌ విమర్శించారు. 90 రోజుల్లోనే కాంగ్రెస్‌ ప్రజాభిమానాన్ని కోల్పోయిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాలం తెచ్చిన కరవు కాదు, కాంగ్రెస్‌ తెచ్చిన కరవే ఉందని బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.

Karimnagar Kadanabheri Sabha : కరీంనగర్‌ అంటే కేసీఆర్‌కు సెంటిమెంట్‌, ఇక్కడి నుంచే ఎన్నో పోరాటాలకు శ్రీకారం చుట్టారని కేటీఆర్‌ అన్నారు. ఆనాడు ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా ఇక్కడి నుంచే జంగ్‌ సైరన్‌ మోగించారని గుర్తు చేశారు. ఇప్పుడు అబద్ధాల రేవంత్‌ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం మహబూబ్‌నగర్‌లో సీఎం భాష తనకైతే అర్థం కాలేదని కేటీఆర్‌ అన్నారు. గొంతు కోస్తాను, మానవ బాంబు అయి పేలతానని అంటున్నారని దుయ్యబట్టారు.

"మేమైతే కోరుకుంటున్నాము అయిదేళ్లు కొనసాగాలి. ఇచ్చిన 420 హామీలు నెరవేర్చాలి. రేవంత్‌ రెడ్డిని ఎవరో కాదు పక్కన ఉన్న ఖమ్మం, నల్గొండ బాంబులు పేల్చకుండా జాగ్రత్త పడు. బుధవారం గమ్మత్తుగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతున్నారు. కరవు పరిస్థితిని అందరం కలిసి ఎదుర్కొందామని. మేడిగడ్డ మరమ్మత్తు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ కరవు వచ్చిందని రైతులకు వివరించాలి." - కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు

సీఎంకు సవాల్‌ : సీఎం రేవంత్‌రెడ్డి మగతనం అంటే ఎన్నికల్లో గెలవడం కాదు, మగాడివైతే రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయ్‌, మహిళలకు రూ.2500 ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం(Kaleshwaram Project), అతిపెద్ద ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్‌ ఒక భాగం పిచ్చోళ్లు రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌కు తెలవదని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీలో 85 పిల్లర్లలో మూడు పిల్లర్లు దెబ్బతిన్నాయని వివరించారు.

KTR Fires on Bandi Sanjay : మేడిగడ్డను రిపేర్‌ చేసి రైతులకు నీళ్లు ఇవ్వచ్చు కానీ కేసీఆర్‌ను బదనాం చేయాలని మరమ్మత్తులు చేయడం లేదని ధ్వజమెత్తారు. కరవును అధికమించేందుకు కేసీఆర్‌ తెచ్చిన బ్రహ్మాస్త్రమే కాళేశ్వరం ప్రాజెక్టు అంటూ హర్షించారు. కాళేశ్వరం ఉండగా కాంగ్రెస్‌ పట్టించుకోకపోవడం వల్లే కరవు వచ్చిందని తెలిపారు. అయిదేళ్లలో బండి సంజయ్‌ ఒక్క మంచి పని చేశారా కేసీఆర్‌ను తిట్టడం తప్ప చేసిందేమిటని ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్‌ తమ పార్టీ కాదు అయినా బండి సంజయ్‌ అతని తల్లిని తిట్టడం ఎంతవరకు అవసరమో కేటీఆర్‌ ఆలోచించాలన్నారు.

రాష్ట్రంలో కాలం తెచ్చిన కరవు లేదు - కాంగ్రెస్‌ తెచ్చిన కరవే ఉంది కేటీఆర్‌

లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన కేసీఆర్ - ఫస్ట్‌ లిస్ట్‌లో వీరికే ఛాన్స్

'గోల్​మాల్ గుజరాత్ మోడల్‌కు, గోల్డెన్ తెలంగాణతో పోలికా?' - రేవంత్​పై బీఆర్​ఎస్​ విమర్శలు

Last Updated :Mar 7, 2024, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.