ETV Bharat / politics

ఓవైపు బస్సుయాత్ర - మరోవైపు గులాబీ నేతలకు మార్గనిర్దేశం - బిజీబిజీగా కేసీఆర్ - KCR BUS Yatra Result

author img

By ETV Bharat Telangana Team

Published : May 1, 2024, 8:48 AM IST

KCR Guidelines To BRS Leaders For Lok Sabha Elections : లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర, రోడ్ షోలు నిర్వహిస్తున్న గులాబీ దళపతి తదుపరి కార్యాచరణపై నేతలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సమాచారం ఆధారంగా వారికి పలు సూచనలు ఇస్తున్నారు. పూర్తి స్థాయిలో దృష్టి సారించని నేతలను గుర్తించి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.

EX CM KCR Suggestions to Party Leaders
KCR Instructions to Party Leaders

KCR Instructions to Party Leaders For Elections : పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్​కు సవాల్​గా మారాయి. పంథా మార్చిన పార్టీ అధినేత కేసీఆర్ బహిరంగ సభలే కాకుండా బస్సుయాత్ర, రోడ్ షోల ద్వారా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. వారం రోజుల క్రితం ప్రారంభమైన బస్సుయాత్ర ఇప్పటి వరకు నల్గొండ, భువనగిరి, మహబూబ్​నగర్, నాగర్ కర్నూల్, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్​ఎస్​ అభ్యర్థులకు మద్దతుగా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్​లు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు, తిరిగి రాత్రి పూట ఆయా లోక్​సభ నియోజకవర్గాల పరిధిలోని పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. స్థానిక పరిస్థితులపై వారితో విస్తృతంగా చర్చిస్తున్నారు.

KCR Election Campaign in Telangana : ఎమ్మెల్యేలు, మాజీల మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, లోక్​సభ అభ్యర్థులతో అక్కడి పరిస్థితులపై కేసీఆర్ ఆరా తీస్తున్నారు. వివిధ సంస్థల ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులపై కేసీఆర్ సమాచారం, వివరాలు తెప్పించుకుంటున్నారు. వాటి ఆధారంగా నేతలతో తదుపరి కార్యాచరణ విషయమై చర్చిస్తున్నారు. ఏ శాసనసభ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది? నాయకులు ఎలా పని చేస్తున్నారన్న విషయమై వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అంశాలు, వ్యక్తులపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రత్యర్థులకు దీటుగా ఇంకా ఏం చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్న విషయమై బీఆర్ఎస్ నేతలతో చర్చిస్తున్నారు.

కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోంది : కేసీఆర్‌ - KCR Bus Yatra in Khammam

KCR One Week Bus Yatra Result : నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ పరిస్థితి, ప్రజల ఆలోచనా విధానం, సమస్యల ఆధారంగా ఎన్నికల ప్రచారం కొనసాగించాలని నేతలకు కేసీఆర్ సూచిస్తున్నారు. ఆశించిన మేర క్షేత్ర స్థాయిలో పని చేయని నేతలకు తనదైన శైలిలో చురకలు కూడా అంటిస్తూ వస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో లోక్​సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి వచ్చే ఓట్ల ఆధారంగానే తదుపరి కార్యచరణ ఉంటుందని నేతలను హెచ్చరిస్తున్నారు. కేంద్రంలో హంగు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్​తో పాటు బీజేపీ పరిస్థితి కూడా వారు అనుకున్నట్లు లేదని కేసీఆర్ వివరిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుందని, మంచి సంఖ్యలో ఎంపీ సీట్లు సాధిస్తే మెరుగైన అవకాశాలు ఉంటాయని నేతలతో చెబుతున్నారు.

KCR warns party leaders Not Participated in Campaign : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైందని నేతలు, శ్రేణులు సమన్వయంతో కష్టపడి పనిచేస్తే ఎనిమిది స్థానాల్లో విజయం సాధిస్తామని కేసీఆర్ ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. బస్సుయాత్ర కొనసాగుతున్న నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అవసరమైన ఆదేశాలు ఇస్తున్నారు.

డబుల్​ ఆర్​ ట్యాక్స్​ వసూళ్లపై ఎందుకు ఈడీ, ఐటీ విచారణకు పీఎం మోదీ ఆదేశించడం లేదు : కేసీఆర్​ - BRS Chief KCR Election Campaign

రాష్ట్రంలో భవన నిర్మాణాల అనుమతులకు కాంగ్రెస్‌ కమీషన్లు అడుగుతోంది : కేసీఆర్‌ - KCR Bus Yatra in Warangal

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.