ETV Bharat / politics

కాంగ్రెస్​కు రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదు : మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ - ex governor tamilisai campaign

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 29, 2024, 5:40 PM IST

Telangana EX Governor Tamilisai on Congress
Tamilisai Election Campaign

Tamilisai Election Campaign : ఎన్నికల ప్రచారం ద్వారా తెలంగాణ ప్రజలను కలిసే అవకాశం వచ్చిందని మాజీ గవర్నర్​, బీజేపీ ఎంపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్ ఆనందం వ్యక్తం చేశారు. దేశంలో బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్​ హయంలో విధించిన ఎమర్జెన్సీ వల్ల తాను ఓ బాధితురాలేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ హైదరాబాద్​లో పార్టీ నేతలతో ఆమె సమావేశమయ్యారు.

Telangana EX Governor Tamilisai on Congress : ఎన్నికల ప్రచారంతో తెలంగాణ ప్రజలను మరోసారి కలిసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర మాజీ గవర్నర్, దక్షిణ చెన్నై బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్ అన్నారు. రాష్ట్ర ప్రజలను మరోసారి కలిసే అవకాశం కల్పించిన అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో ప్రచారం చేస్తానని తెలిపారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

మెజార్టీ స్థానాలు గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేసిన తమిళిసై, ఫలితాల తరవాత తెలంగాణ నుంచి ఎక్కువ మంది కేంద్ర మంత్రులుగా ఉంటారన్నారు. సౌత్ చెన్నైలో హోరా హోరీ పోటీ నెలకొన్నప్పటికీ తాను విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లను తీసివేసే ప్రసక్తే లేదని, దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చిందని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు తొలగిస్తారంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఎమర్జెన్సీ విధించింది ఎవరని ప్రశ్నించారు.

పది రోజులపాటు ప్రచారం : ఎమర్జెన్సీ సమయంలో బాధితురాలిగా తాను ఉన్నారని తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. ఆ సమయంలో తన తండ్రిని అరెస్ట్ చేశారని, అప్పుడు ఎంతో ఇబ్బంది పడ్డామని అవేదన వ్యక్తం చేశారు. అలాంటి పార్టీకి రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదని విమర్శించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేసి ఇటీవల జరిగిన లోక్​సభ ఎన్నికల్లో ఆమె తమిళనాడులో చెన్నై సౌత్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేశారు. తమిళనాడులో పోలింగ్ ముగియడంతో తెలంగాణలో పది రోజుల పాటు ప్రచారం నిర్వహించేందుకు వచ్చారు.

గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తరువాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన తమిళిసై నేరుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. తొలిసారి పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆమెకు శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మరోవైపు తెలంగాణలో అత్యధిక స్థానాలను గెలుచుకునేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి బీజేపీ నేతలు ప్రచారానికి వస్తున్నారు.

'రిజర్వేషన్లు ఎత్తివేస్తారని వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రిజర్వేషన్లు కచ్చితంగా ఉంటాయి. ప్రధాని సైతం ఈ విషయం స్పష్టంగా చెప్పారు. మహిళలు,పేదలు, రైతులు, యువతపై మేం దృష్టి సారిస్తామని ప్రధాని చెప్పారు. అందుకు రిజర్వేషన్‌ పాలసీపై ఎలాంటి ఇబ్బందులు ఉండవు' - తమిళిసై సౌందరరాజన్, బీజేపీ అభ్యర్థి

కాంగ్రెస్​కు రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదు : మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

తెలంగాణకు తిరిగొచ్చిన మాజీ గవర్నర్ తమిళిసై - నేటి నుంచి 10 రోజుల పాటు ఎన్నికల ప్రచారం - Tamilisai election campaign in TS

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.