ETV Bharat / politics

'ధరణిలో లోపాలు అనేకం - వీలైనంత త్వరలో మధ్యంతర నివేదిక ఇస్తాం'

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 22, 2024, 7:18 PM IST

Updated : Jan 22, 2024, 7:33 PM IST

Dharani Committee Reports on Portal Issues : వాస్తవికతకు అద్దం పట్టేలా భూరికార్డుల కంప్యూటరైజ్డ్‌ చేయాల్సిన అవసరం ఉంటుందని ధరణి కమిటీ పేర్కొంది. ధరణి పోర్టల్‌ ప్రక్షాళన కోసం రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీ, హైదరాబాద్‌ సీసీఎల్​ఏ కార్యాలయంలో భేటీ అయింది. మూడోసారి జరిగిన ఈ భేటీలో కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొని భూసమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించారు. ధరణి బాధితులకు సత్వర ఉపశమనం కోసం మధ్యంతర నివేదిక ఇవ్వాలని కమిటీ నిర్ణయించినట్లు కమిటీ సభ్యుడు కోదండరెడ్డి తెలిపారు.

Dharani Committee Reports on Portal Issues
Congress Govt Arrange Committee on Dharani Portal Issues

Dharani Committee Reports on Portal Issues : ధరణి సమస్యలపై వీలైనంత త్వరగా ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇస్తామని ధరణి కమిటీ(Dharani Commitee) వెల్లడించింది. ధరణి సమస్యలతో పాటు దానికి ముడిపడి ఉన్న అన్ని శాఖలతో సమావేశమై చర్చించి సమగ్రమైన నివేదిక సిద్ధం చేయాల్సి ఉందని అభిప్రాయపడింది. ఇవాళ మూడోసారి సీసీఎల్‌ఏ కార్యాలయంలో(CCLA Office) సమావేశమైన కమిటీ అనేక అంశాలపై చర్చించింది.

ధరణి అవకవతవకలపై కమిటీ - పోర్టల్‌ పునర్నిర్మాణ బాధ్యతల అప్పగింత

ఆ తర్వాత కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ధరణిలో ఒక సమస్యకు మరో సమస్యకు పొంతన లేకుండా పోయిందని, ధరణి ప్రారంభం నుంచే అనేక లోపాలు ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే, కమిటీ సభ్యుడు కోదండరెడ్డి అన్నారు. ధరణి వల్ల భూ హక్కు హరించిపోయిందన్నారు. ధరణి తప్పిదాలతో రైతు బంధు, ఇతర ప్రభుత్వ సబ్సిడీలను(Government Subsidies) రైతులు కోల్పోయారని పేర్కొన్నారు. ధరణి బాధితులకు త్వరితగతిన ఉపశమనం కోసం మధ్యంతర నివేదిక ఇవ్వాలని కమిటీ నిర్ణయించిందని తెలిపారు.

Kodanda Reddy on Dharani Issues : అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు అవసరమైతే ప్రజల్లోకి వెళ్లి, సమగ్రంగా అధ్యయనం చేశాకే ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో జిల్లా కలెక్టర్లతో పాటు వ్యవసాయ, రిజిస్ట్రేషన్ శాఖలతో(Registration Department) కూడా సమావేశమవుతామని మరో సభ్యుడు రేమాండ్ పీటర్ తెలిపారు. ధరణి వచ్చిన తర్వాత వెనువెంటనే పనులు జరగడం బాగానే ఉన్న, పారదర్శకత లేదన్నారు. ఇదొక పెద్ద సమస్యగా పేర్కొన్న ఆయన, మరింత లోతైన అధ్యయనం చేయకుండా ముందుకు వెళ్లలేమన్నారు.

ధరణి పోర్టల్​ వల్ల భవిష్యత్​లో ఎటువంటి సమస్యలు రాకుండా, చాలా సునిశితంగా దానిపై చర్చించాం. పోర్టల్​ పేరు ఏదైమైనా హక్కుదారి పేరు ఆన్లైన్​లో ఉంటే అతనికి చట్టం పరంగా హక్కు ఉన్నట్లే. అలానే దీనిపై పగడ్బందీ చట్టాలు తీసుకురావాల్సి ఉంది. కాబట్టి వీటిని రెండు, మూడు అంచెలుగా పూర్తి చేయాలని కమిటీ భావిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ మిషన్​ను చాలా ప్రాధాన్యంగా తీసుకుంటుంది. అదేవిధంగా అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు అవసరమైతే ప్రజల్లోకి వెళ్లి, సమగ్రంగా అధ్యయనం చేశాకే ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం.-కోదండరెడ్డి, ధరణి కమిటీ సభ్యుడు

ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై దర్యాప్తు! - ధరణి పోర్టల్​లోని వివరాల సేకరణపై సర్కార్ ప్రత్యేక నజర్

కలెక్టర్లతో బుధవారం సమావేశం అవుతామని అనుకుంటున్నట్లు పీటర్ చెప్పారు. ధరణి సబ్జెక్టుపై అవగాహన కలిగిన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొంటామన్నారు. భూ యజమానికి తెలియకుండా భూ లావాదేవీలు(Land Transactions) జరిగినట్లు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. భూములు కంప్యూటరైజ్డ్‌ అంటే వాస్తవికతకు అద్దం పట్టాలని మరొక సభ్యుడు సునీల్ అభిప్రాయపడ్డారు. ధరణిపై చాలా కేసులు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.

భూములు కంప్యూటరైజ్డ్‌ అంటే వాస్తవికతకు అద్దం పట్టాలి కానీ కొత్త సమస్యలను సృష్టించకూడదనేది మా ముందు ఉన్న ప్రధాన బాధ్యత. ఈరోజు ఊళ్లలో వందల మందికి ఏవో గ్రీవెన్సులు ఉన్నాయి. అన్ని సమస్యలను కొంచెం కూలంకుషంగా చూసే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా వాటికి సంబంధించిన లోపాలను అధ్యయనం చేస్తూ, సరిచేయాలన్నది మా ఆలోచన. అలానే భూములకు సంబంధించిన చట్టాలకు ఏవైనా మార్పులు ఇంకా కావాలన్న దానిపై సమగ్రంగా చర్చిస్తున్నాం.-సునీల్, ధరణి కమిటీ సభ్యుడు

'ధరణిలో ఉన్న లొసుగులపై లోతైన చర్చ చేశాం - వీలైనంత త్వరలో మధ్యంతర నివేదిక ఇస్తాం'

ధరణిపై ఈ నెల 11న పూర్తి సమాచారం ఇస్తాం : కోదండ రెడ్డి

ధరణి పోర్టల్‌ ప్రక్షాళన మొదలైంది - వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు : పొంగులేటి

Last Updated : Jan 22, 2024, 7:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.