ETV Bharat / politics

కేసీఆర్ కాలం చెల్లిన ఔషధం - రేవంత్ రెడ్డి సెటైర్

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 8, 2024, 4:29 PM IST

CM Revanth Comments on KCR : మాజీ సీఎం కేసీఆర్ కాలం చెల్లిన ఔషధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన గురించి, ఆయన పార్టీ గురించి ప్రజలు ఆలోచించడం మానేశారని తెలిపారు. మరోవైపు బీఏసీ సమావేశాలకు కేసీఆర్ స్థానంలో హరీశ్ రావు హాజరుకావడంపై రేవంత్ స్పందించారు. బీఏసీ భేటీకి అందులోని సభ్యులే రావాలని, రేపు హిమాన్షు కూడా వస్తానంటే ఎలా అని అన్నారు.

CM Revanth Comments on KCR
CM Revanth

CM Revanth Comments on KCR : కేసీఆర్, బీఆర్ఎస్ గురించి ప్రజలు ఆలోచించడం మానేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గవర్నర్ ప్రసంగానికి రాలేదంటేనే కేసీఆర్ బాధ్యత అర్థం అవుతోందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కాలం చెల్లిన ఔషధమని పేర్కొన్నారు. ఆయన అసెంబ్లీ సమావేశాలకు రావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. కాళేశ్వరంపై విచారణ(Kaleshwaram Project Issue)కు సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమని హైకోర్టు చెప్పిందన్న రేవంత్ రెడ్డి, విశ్రాంత జడ్జితో విచారణ జరిపించుకోవాలని చెప్పారని వెల్లడించారు. హైకోర్టు చెప్పిన అంశంపై మంత్రివర్గంలో లేదా అసెంబ్లీలో చర్చిస్తామని వివరించారు.

"కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాను. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ చిత్తశుద్ధిని ప్రజలు చూశారు. కేసీఆర్‌ చిత్తశుద్ధిని గుర్తించి కృష్ణా పరివాహక ప్రజలు తీర్పు ఇచ్చారు. మిషన్ భగీరథపై విచారణకు ఆదేశించాం. ఉద్యోగ నియామకాల విషయంలో స్పష్టతతో ఉన్నాం. విధానపర లోపాలు లేకుండా పాలన సాగిస్తున్నాం. రాజ్యసభ ఎన్నికల్లో ఎంతమంది పోటీ చేసేది అధిష్ఠానం నిర్ణయిస్తుంది." - రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి

అవసరం లేకున్నా ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం కట్టారు : మంత్రి కోమటిరెడ్డి

Revanth On Harish Rao BAC Meeting : మరోవైపు బీఏసీ సమావేశానికి కేసీఆర్ స్థానంలో హరీశ్ రావు(Harish Rao) వెళ్లడంపై సీఎం రేవంత్ స్పందించారు. బీఏసీ సమావేశానికి అందులోని సభ్యులే రావాలని స్పష్టం చేశారు. రేపు హిమాన్షు (కేటీఆర్ తనయుడు) కూడా వస్తానంటే ఎలా అని ఎద్దేవా చేశారు. ఐదేళ్లపాటు శాసనసభ వ్యవహారాల మంత్రిగా చేసిన హరీశ్ రావుకు ఆ మాత్రం అవగాహన లేదా? అని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రతిపక్ష హోదా నేతకు గది కేటాయింపుపైనా రేవంత్ మాట్లాడారు. గది మార్పు స్పీకర్ నిర్ణయమని తెలిపారు. అసెంబ్లీలో కులగణన తీర్మానం ఉంటుందని, అంశాలు చర్చించాల్సిన అవసరం ఉందనుకుంటే సభాపతి సభ నిర్వహణ కాలం పొడిగించవచ్చని చెప్పారు. కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టు(Projects Handover To KRMB)లను గత ప్రభుత్వం అప్పగించిందని ఆరోపించారు. సాగర్‌ను జగన్ పోలీసులతో ఆక్రమించినా కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. ఏపీ వాళఅలు ప్రతి రోజు 12.5 టీఎంసీలను తీసుకెళ్తుంటే కేసీఆర్ అడ్డుకోలేదని ధ్వజమెత్తారు.

ప్రతిపక్ష నేత హోదాకు తగిన ఛాంబర్ కేటాయించాలి - స్పీకర్‌కు బీఆర్ఎస్ విజ్ఞప్తి

"బేసిన్‌లు లేవు భేషజాలు లేవని కేసీఆర్ అన్నారు. అక్కడే ఆయన కమిట్‌మెంట్ ఏంటో తెలిసిపోతోంది. కృష్ణా బేసిన్‌లో బీఆర్ఎస్‌ను ప్రజలు తిరస్కరించారు. మా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉంది. ఆరు గ్యారంటీలు తప్పకుండా అమలు చేస్తాం. త్వరలోనే మరో రెండు గ్యారంటీలు అమల్లోకి వస్తాయి. గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత కరెంట్, రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ గ్యారంటీల అమలుపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నాం. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. సీఎంగా నేను కేసీఆర్‌ను కూడా కలుస్తాను. విజయ్‌సాయి రెడ్డి నాన్ సీరియస్ పొలిటీషియన్. అలాంటి వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు." అని సీఎం రేవంత్ అన్నారు.

నాలుగు రోజులపాటు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

గవర్నర్​ ప్రసంగం పేలవంగా ఉంది - ప్రభుత్వం తన విజన్​ను​ ఆవిష్కరించలేదు : హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.