ETV Bharat / politics

బీఆర్ఎస్​కి కార్యకర్తలే కథానాయకులు - వారే పార్టీకి ధైర్యం చెప్పారు : కేటీఆర్

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 22, 2024, 3:40 PM IST

BRS Meeting on Parliament Elections 2024 : కాంగ్రెస్‌కు ఇప్పటికే అనేక వర్గాలు దూరమయ్యాయని బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఈ పరిస్థితిని పార్లమెంటు ఎన్నికల్లో సానుకూలంగా మలచుకోవాలని నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జనవరి మూడో తేదీన ఆదిలాబాద్‌తో ప్రారంభమైన సమావేశాలు ముగుస్తున్నాయని, ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజక వర్గాల సమీక్షలు మొదలవుతాయని తెలిపారు.

KTR On Free Current Bill Scheme
BRS Meeting on Parliament Elections 2024

BRS Meeting on Parliament Elections 2024 : కేసీఆర్​పై ప్రజల్లో సానుభూతి వెల్లువలా ఉందని, కాంగ్రెస్​కు ఇప్పటికే అనేక వర్గాలు దూరం అయ్యాయని బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఈ పరిస్థితిని పార్లమెంటు ఎన్నికల్లో సానుకూలంగా మలచుకోవాలని నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నల్గొండ లోక్​సభ సన్నాహక సమావేశంలో కేటీఆర్(KTR) ప్రసంగించారు. జనవరి మూడో తేదీన ఆదిలాబాద్​తో ప్రారంభమైన సమావేశాలు ఇవాళ ముగుస్తున్నాయని తెలిపారు. సమావేశాల తీరు చూస్తే కార్యకర్తలే పార్టీకి ధైర్యం చెప్పారని వివరించారు.

  • నల్లగొండ లోక్ సభ నియోజక వర్గ సన్నాహాక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS

    జనవరి 3 ఆదిలాబాద్ తో ప్రారంభమైన సమావేశాలు నేడు నల్లగొండతో ముగుస్తున్నాయి

    నేటితో మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాల సమావేశాలు పూర్తవుతున్నాయి

    బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథానాయకులు… pic.twitter.com/Brk0zNVQDe

    — BRS Party (@BRSparty) January 22, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇంకో ఏడెనిమిది స్థానాలు అదనంగా గెలిచి ఉంటే రాష్ట్రంలో హంగ్​ వచ్చేది : కేటీఆర్

పార్టీకి కార్యకర్తలే కథానాయకులని కేటీఆర్ అన్నారు. వారి వల్లే ఇన్నేళ్లు పార్టీ బలంగా ఉందని పేర్కొన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురైందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారని చెప్పారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజక వర్గాల సమీక్షలు మొదలవుతాయని కేటీఆర్ తెలిపారు. తాము ఇంకా మాట్లాడటం మొదలు పెట్టనే లేదని, దీనికే కాంగ్రెస్ వాళ్లు ఉలికి పడుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోమని అన్నారు.

'కారు' సర్వీసింగ్‌కు వెళ్లింది - త్వరలోనే హైస్పీడ్​తో దూసుకొస్తుంది : కేటీఆర్

KTR On Free Current Bill Scheme : అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నాయకులు కూడా అనుకోలేదని అందుకే ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. హామీలకు కాంగ్రెస్ పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తోందని ఆక్షేపించారు. గ్యారెంటీలు అమలు అయ్యేంత వరకు వదిలేది లేదని చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత నవంబర్​లోనే కరెంటు బిల్లులు కట్టవద్దని చెప్పారని గుర్తు చేశారు. నల్గొండ ప్రజలు బిల్లులు కట్టకుండా కోమటిరెడ్డికే పంపాలని కేటీఆర్ వివరించారు. సాగర్ ఆయకట్టుకు కాంగ్రెస్ పాలనలో మొదటిసారి క్రాప్ హాలీడే ప్రకటించే దుస్థితి దాపురించిందని మండిపడ్డారు.

ఈ నెల నుంచి ఎవరు కరెంట్‌ బిల్లు కట్టవద్దు : కేటీఆర్

KTR Fire On CM Revanth Reddy : కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించి తెలంగాణ జుట్టును కాంగ్రెస్ కేంద్రం చేతిలో పెడుతోందని కేటీఆర్ ఆరోపించారు. శ్రీరాంసాగర్ చివరి ఆయకట్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెడుతోందని, రాష్ట్రంలో కరెంటు కోతలు మొదలయ్యాయని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య సంబంధం నల్లగొండ మున్సిపాలిటీ అవిశ్వాసంలో బయట పడిందని తెలిపారు. రేవంత్ భుజం మీద తుపాకీ పెట్టి ప్రధాని మోదీ బీఆర్ఎస్​ను కాలుస్తారట అని వివరించారు. మైనార్టీ సోదరులకు కాంగ్రెస్, బీజేపీ(KTR Comments on Congress) సంబంధం గురించి చెప్పాలని నేతలకు కేటీఆర్ సూచించారు.

"జనవరి 3న ఆదిలాబాద్​తో ప్రారంభమైన సమావేశాలు ఇవాళ ముగుస్తున్నాయి. పార్టీకి కార్యకర్తలే కథానాయకులు, కార్యకర్తల వల్లే ఇన్నేళ్లుగా పార్టీ బలంగా ఉంది. సమావేశాల తీరు చూస్తే కార్యకర్తలే పార్టీకి ధైర్యం చెప్పారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజక వర్గాల సమీక్షలు మొదలవుతాయి. కాంగ్రెస్​కు ఇప్పటికే అనేక వర్గాలు దూరం అయ్యాయి. హామీలకు కాంగ్రెస్ మరిచిపోయే ప్రయత్నం చేస్తోంది అయినా వదిలి పెట్టం."- కేటీఆర్, బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు

కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేదాకా విడిచి పెట్టం : కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.