ETV Bharat / politics

మెజార్టీ స్థానాలే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రచారం - కాంగ్రెస్ గ్యారంటీల అమల్లో వైఫల్యమే ఆయుధం - BRS Election Campaign In Telangana

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 30, 2024, 1:24 PM IST

BRS Election Campaign In Telangana
BRS Election Campaign In Telangana

BRS Election Campaign In Telangana : లోక్​సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ఉద్ధృతం చేసింది. కాంగ్రెస్​ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు అంశాన్ని ఆయుధంగా చేసుకుని ప్రచారంలో దూసుకుపోతోంది.

BRS Election Campaign In Telangana : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు మరో 13 రోజులే ఉండటంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ప్రధాన పార్టీల అగ్రనేతలు సభలు, సమావేశాలు, కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహిస్తుండగా అభ్యర్థులు ఊరూరా తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. లోక్​సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ఉద్ధృతం చేసింది.

Vinod Kumar Campaign in Jammikunta Today : కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్‌ కుమార్‌, కౌశిక్‌ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. పదేళ్లలో కేసీఆర్ సర్కార్‌ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్​కు ఓటేసి తమను గెలిపించాలని కోరారు. 100 రోజుల్లో గ్యారంటీలను అమలు చేస్తామని ఇప్పుడు వాటికి లోక్​సభ ఎన్నికలను లింక్​ చేస్తున్నారని విమర్శించారు.

BRS MLA Jagadish Reddy Comments : మరోవైపు కాంగ్రెస్, బీజేపీ లోపాయకారి ఒప్పందాలు ఒక్కొక్కొటిగా బహిర్గతమైతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్​ రెడ్డి విమర్శించారు. సూర్యాపేట మున్సిపాలిటీలో ఇంటింటి ప్రచారం చేస్తూ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు చేశారు. బీజేపీ ముస్లిం రిజర్వేషన్ల రద్దు పేరుతో మొత్తం రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. ప్రజల్లో సెంటిమెంటును రగిలించి పబ్బం గడుపుకునేందుకు కాషాయ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆ ఒప్పందంలో భాగమే రేవంత్​కు నోటీసుల డ్రామా అని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో భవన నిర్మాణాల అనుమతులకు కాంగ్రెస్‌ కమీషన్లు అడుగుతోంది : కేసీఆర్‌ - KCR Bus Yatra in Warangal

"బీజేపీకి రేవంత్​తో ఒప్పందం లేకుంటే కవితను అరెస్ట్ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. మీడియాలో ప్రచారం కోసం, ప్రజలను మోసాగించేందుకే రేవంత్ నోటీసుల డ్రామా. కేసీఆర్ ఆరు రోజుల బస్సుయాత్ర పర్యటనతో ప్రజల్లో మార్పు వచ్చింది. కేసీఆర్ వస్తేనే ప్రజలకు శ్రీరామ రక్ష అని నమ్ముతున్నారు." - జగదీశ్ రెడ్డి, మాజీ మంత్రి

కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల హామీలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిందని ఇప్పుడు వాటి గురించి మర్చిపోయారని జగదీశ్ రెడ్డి అన్నారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ అంటే నమ్మి ఓటేస్తే కనీసం రైతు బంధు నగదు కూడా ఇవ్వలేదని, ఎకరాకు రూ.15వేలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్‌, మహిళలకు రూ.2500, కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం, నిరుద్యోగులకు రూ.4వేల భృతి ఇస్తామని చెప్పి ఇప్పటికీ నెరవేర్చలేదని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర పరిస్థితుల్లో మార్పు తథ్యమని జోతిష్యం చెప్పారు.

ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్ నేతలు - గ్యారంటీల అమలు విఫలమే ఆయుధం - Brs mp candidates campaign

కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోంది : కేసీఆర్‌ - KCR Bus Yatra in Khammam

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.