ETV Bharat / politics

'తల్లిలాంటి పార్టీని కాపాడుకుంటూ లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలి'

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 22, 2024, 9:06 PM IST

BRS Concludes Lok Sabha Preparatory Meetings : లోక్‌సభ ఎన్నికల కసరత్తులో భాగంగా బీఆర్ఎస్ చేపట్టిన సన్నాహక సమావేశాలు ఇవాళ ముగిశాయి. చివరిరోజు జరిగిన నల్గొండ లోక్‌సభ సన్నాహక సమావేశంలో, నియోజకవర్గ పరిధిలోని నేతలతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, హరీశ్​రావు సహా సీనియర్ నేతలు భేటీ అయ్యారు. తల్లిలాంటి పార్టీని కాపాడుకుంటూ లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

Harish Rao Comments on Congress Govt
BRS Concludes Lok Sabha Preparatory Meetings

BRS Concludes Lok Sabha Preparatory Meetings : లోక్‌సభ ఎన్నికల కసరత్తులో భాగంగా భారత రాష్ట్ర సమితి చేపట్టిన లోక్​సభ సన్నాహక సమావేశాలు ముగిశాయి. ఈ నెల మూడో తేదీ నుంచి నియోజకవర్గాల వారీగా హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో(Telangana Bhavan) ప్రారంభమైన సమీక్షా సమావేశాలు ఇవాళ్టి నల్గొండ సమావేశంతో పూర్తయ్యాయి. 16 రోజుల పాటు 120 గంటలకు పైగా జరిగిన సమావేశాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు మంచి సలహాలు, సూచనలు ఇచ్చారని, వాటి ఆధారంగా పార్టీని సంస్థాగతంగా పటిష్ఠం చేయడంతో పాటు భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తామని గులాబీ నేతలు తెలిపారు.

బీఆర్ఎస్​కి కార్యకర్తలే కథానాయకులు - వారే పార్టీకి ధైర్యం చెప్పారు : కేటీఆర్

వచ్చే నెల మొదటి వారం నుంచి శాసనసభ నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో సమావేశాలు ఉంటాయని, సీనియర్లు పార్టీ పరిశీలకులుగా హాజరవుతారని పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికల ఓటమిపై సమీక్షించడంతో పాటు లోక్‌సభ ఎన్నికల కార్యాచరణపై(Lok Sabha Election Activity) సమావేశంలో చర్చించారు. కేసీఆర్‌పై ప్రజల్లో సానుభూతి వెల్లువలా ఉందని, కాంగ్రెస్‌కు ఇప్పటికే అనేక వర్గాలు దూరం అయ్యాయని బీఆర్ఎస్​ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.

Harish Rao Comments on Congress Govt : గతంలో చేసిన పొరపాట్లు మళ్లీ చేయకుండా ముందుకు సాగుదామని శ్రేణులకు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కష్టపడ్డ వారికే పార్టీలో గుర్తింపు ఇస్తామన్న ఆయన, ఉద్యమకారులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ప్రచారంలో అబద్దం, పాలనలో అసహనం అనేది కాంగ్రెస్ తీరు అని అభివర్ణించారు. 6 గ్యారంటీల్లోని 13 హామీలను కాంగ్రెస్ మరో ఇరవై రోజుల్లో నెరవేర్చాలన్నారు. 20 రోజుల్లో హామీలను నెరవేర్చకపోతే పార్లమెంటు ఎన్నికల కోడ్ వస్తుందని గుర్తు చేశారు.

ఇంకో ఏడెనిమిది స్థానాలు అదనంగా గెలిచి ఉంటే రాష్ట్రంలో హంగ్​ వచ్చేది : కేటీఆర్

కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించేందుకు రెండు నెలల్లోనే ప్రభుత్వం సంతకం పెట్టిందన్న ఆయన, సంతకం పెట్టిన సీఎంను కోమటిరెడ్డి నిలదీయాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం(Kaleshwaram Project) నీళ్లు వాడుకునే అవకాశం ఉన్నా ఈ ప్రభుత్వం నీరు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఎవరి పొరపాట్లు ఉన్నా సవరించుకోవాల్సిందేనన్న ఆయన, తల్లి లాంటి పార్టీని కాపాడుకుందామని శ్రేణులకు పిలుపునిచ్చారు.

BRS Meeting on Parliament Elections 2024 : లోక్​సభ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ నిలవాలన్న పట్టుదల కార్యకర్తల్లో కనిపించిందన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy), కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేకపోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. గులాబీ జెండా పుట్టిందే పేదల కోసమని, నెత్తురు పారిన చోట అడుగడుగునా నీళ్లు పారించిన ఘనత కేసీఆర్​దన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. తాము తొందరపడాల్సిన అవసరం లేదని, కేసీఆర్ రావాల్సిందే అన్న ప్రబలమైన భావన ప్రజల నుంచే వస్తుందన్న బలమైన విశ్వాసంతో ఉన్నట్లు నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి అభద్రతా భావంలో మాట్లాడుతున్నారని మాజీ శాసనసభాపతి మధుసూదనాచారి ఆక్షేపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని మార్లు ఓడిపోయింది, దేశంలో ఆ పార్టీ ఏ స్థితిలో ఉందో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్(BRS Party) మనుగడపై ఎలాంటి కామెంట్ చేసినా తెలంగాణ సమాజం సహించబోదని అన్నారు.

ఈ నెల నుంచి ఎవరు కరెంట్‌ బిల్లు కట్టవద్దు : కేటీఆర్

దావోస్​ పర్యటనలో ప్రకటనలకే పెట్టుబడులు - ఆచరణలో శూన్యం : ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.