ETV Bharat / politics

ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబుమోహన్ - వరంగల్ ఎంపీగా పోటీ

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 4, 2024, 7:49 PM IST

Babu Mohan Joins Prajashanti Party : రాష్ట్ర సీనియర్ నేత బాబుమోహన్ ప్రజాశాంతి పార్టీలోకి చేరారు. ఇవాళ ఆపార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆధ్వర్యంలో ప్రజాశాంతి కండువా కప్పుకున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు బాబుమోహన్ స్పష్టం చేశారు.

KA Paul on Babumohan Joining
Babu Mohan Joins Prajashanti Party

Babu Mohan Joins Prajashanti Party : రానున్న లోక్​సభ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయనున్నట్లు రాష్ట్ర సీనియర్ నేత బాబుమోహన్(Babu Mohan) పేర్కొన్నారు. ఇవాళ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సమక్షంలో ఆపార్టీలోకి చేరారు. వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి పార్టీ తరఫున నుంచి పోటీ చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. తన స్వస్థలమైన వరంగల్ నుంచి, అన్ని వర్గాల మద్ధతు కూడగట్టుకుని ఎంపీ అభ్యర్థిగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

గతంలో తాను బీజేపీ పార్టీ కోసం చాలా శ్రమించానని, అయినప్పటికీ పార్టీ గుర్తించలేదని బాబుమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సరైన పదవి, గౌరవం లభించకపోవడంతో పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆందోల్ నియోజవర్గ అభివృద్ధికి తీవ్రంగా కృషి చేసినట్లు తెలిపారు. తన హయాంలోనే ఆందోల్ ప్రాంతానికి కేంద్ర నిధులతో ఆరు లేన్ల రహదారి వేయించానన్నారు. తనను కాదని మరొకరికి టికెట్ ఇవ్వడం బాధకరమన్నారు.

KA Paul on Babumohan Joining : ప్రజాశాంతి పార్టీ తరఫున వరంగల్ స్థానం నుంచి బాబుమోహన్ పోటీ చేస్తారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) స్పష్టం చేశారు. బాబుమోహన్ చేరికతో పార్టీకిమరింత బలం చేకూరినట్లు ఆయన తెలిపారు. దేశంలో నరేంద్రమోదీ ప్రభుత్వం పెద్దమొత్తంలో అప్పులు చేసిందని, వడ్డీలకే లక్షల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. బీజేపీని గద్దె దించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

బీజేపీకి బాబు మోహన్ గుడ్ ​బై - రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన

"రానున్న లోక్​సభ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరఫున వరంగల్ స్థానం నుంటి పోటీ చేస్తాను. బీజేపీ పార్టీ కోసం చాలా శ్రమించాను. అయినప్పటికీ పార్టీ గుర్తించలేదు. సరైన పదవి, గౌరవం లభించకపోవడంతో పార్టీకి రాజీనామా చేశాను. నా స్వస్థలమైన వరంగల్ నుంచి, అన్ని వర్గాల మద్ధతు కూడగట్టుకుని ఎంపీ అభ్యర్థిగా విజయం సాధిస్తాను". - బాబు మోహన్, సీనియర్ నేత

"ప్రజాశాంతి పార్టీ తరఫున వరంగల్ స్థానం నుంచి బాబుమోహన్ పోటీ చేస్తారు. బాబుమోహన్ చేరికతో పార్టీకి మరింత బలం చేకూరింది. దేశంలో నరేంద్రమోదీ ప్రభుత్వం పెద్దమొత్తంలో అప్పులు చేసింది. కేవలం వడ్డీలకే లక్షల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. బీజేపీని గద్దె దించాల్సిన సమయం ఆసన్నమైంది". - కేఏ పాల్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు

ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబుమోహన్- వరంగల్ ఎంపీగా పోటీ

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కేఏ పాల్ - ప్రపంచ శాంతి, ఆర్థిక సదస్సుకు అంగీకారం

అపాయింట్‌మెంట్‌ ఇస్తే దీవిస్తా - లేదంటే శపిస్తా: సీఎం జగన్​కు కేఏ పాల్‌ వార్నింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.