ETV Bharat / politics

సాఫ్ట్​వేర్​ ఉద్యోగికి బెదిరింపులు - కేసీఆర్​ అన్న కుమారుడిపై మరో కేసు - Another Case Booked on Kanna Rao

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 18, 2024, 10:44 AM IST

Updated : Apr 18, 2024, 11:35 AM IST

Another Case Booked on Kanna Rao : మాజీ సీఎం కేసీఆర్​ సోదరుడి కుమారుడు కన్నారావుపై మరో కేసు నమోదైంది. ఈసారి ఓ సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని బెదిరించి నగదు, బంగారం కాజేసిన వ్యవహారంలో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Another Case Booked on Kanna Rao
Another Case Booked on Kanna Rao

Another Case Booked on Kanna Rao : ఇప్పటికే అక్రమ భూదందా కేసులో అరెస్టు అయిన మాజీ సీఎం కేసీఆర్​ సోదరుడి కుమారుడు కన్నారావుపై మరో కేసు నమోదైంది. సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని బెదిరించి, గెస్ట్​హౌస్​లో నిర్భంధించి నగదు, బంగారం దోచుకున్నారు. అతడి ఫిర్యాదుతో బంజారాహిల్స్​ పోలీసులు కన్నారావు(Kalvakuntla Kanna Rao) సహా మరో ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. కన్నారావు నందిని అనే మహిళతో కలిసి బెదిరింపులకు పాల్పడినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : ఓ సమస్య పరిష్కారం కోసం తనకు న్యాయం చేయాలని విజయవర్ధన్​ రావు అనే సాఫ్ట్​వేర్​ ఉద్యోగి కన్నారావు దగ్గరకు వెళ్లాడు. కన్నారావుకు నందిని అనే మహిళతో పరిచయం ఉంది. అలాగే విజయవర్ధన్​కు నందిని స్నేహితురాలు. అతని వద్ద భారీ మొత్తంలో డబ్బు, నగలు ఉన్నట్లు తెలుసుకున్న ఆమె ఎలాగైనా వాటిని కొట్టేయాలని భావించింది. ఓ సమస్య విషయంలో విజయవర్ధన్​ కన్నారావు వద్దకు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన నందిని కన్నారావు సాయంతో ఆ ఉద్యోగి వద్ద ఉన్న నగదు, బంగారం లాక్కోవాలని మాస్టర్ ప్లాన్ వేసింది. ఈ విషయం కన్నారావుకు తెలిపింది.

అలా ఓ రోజు విజయవర్దన్​ ను గెస్ట్​హౌస్​కు పిలిపించుకున్న ఆ మహిళ, కన్నారావు సహా మరికొంత మందితో కలిసి అతడిని బెదిరించారు. అతడి వద్ద ఉన్న రూ.60 లక్షల నగదు, 97 తులాల బంగారం దోచుకున్నారు. తన సొమ్ము కోల్పోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తమకు పోలీసు అధికారి భుజంగరావు, ఏసీపీ కట్టా సాంబయ్య తెలుసునని బెదిరించినట్లు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది : గండ్ర

Kalvakuntla Kanna Rao Land Grab Case : అంతకు ముందు నగరు శివారు ప్రాంతం మన్నెగూడలోని భూమిని కబ్జా చేశారనే నేపథ్యంలో కన్నారావును పోలీసులు అరెస్టు చేసి చర్లపల్లి జైలు(Charlapalli Jail) కు పంపించారు. 14 రోజుల పాటు మాజీ సీఎం కేసీఆర్​ సోదరుడి కుమారుడికి రిమాండ్​ విధించారు. సురేందర్​ రెడ్డి దగ్గర ఉన్న 2.10 ఎకరాల భూమిని 2013లో చామ సురేశ్​కు రూ.50 లక్షలు తీసుకొని జీపీఏ చేశాడు. ఆ రూ.50 లక్షలు తిరిగి ఇచ్చినప్పుడు భూమి తిరిగి ఇస్తానని ఒప్పంద పత్రం రాసుకున్నారు.

అయితే 2020 వరకు సురేందర్​రెడ్డి డబ్బులు ఇవ్వకపోవడంతో సురేశ్​ ఆభూమిని వేరే వాళ్లకు విక్రయించాడు. ఇలా తనకు చెప్పకుండా చేయడం సురేందర్​రెడ్డికి నచ్చక, ఆ సంస్థపై తరుచూ గొడవకు వెళ్లేవాడు. ఆ ఓఎస్​ఆర్​ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. అప్పుడు మాజీ సీఎం కేసీఆర్​ సోదరుడి కుమారుడు కన్నారావు వద్దకు వెళ్లారు. అతనితో కోటి రూపాయల ఒప్పందం కుదుర్చుకుని ఆ భూమి మీదకు వెళ్లి విధ్వంసం సృష్టించారు. ఈ కేసులో పోలీసులు 38 మందిని నిందితులుగా చేర్చారు. అయితే కన్నారావు ఇంకా ఏం అక్రమాలు చేశాడో పోలీసులు కూపీ లాగుతున్నారు.

కేసీఆర్‌ సోదరుడి కుమారుడు కన్నారావు అరెస్ట్ - చర్లపల్లి జైలుకు తరలింపు

'తప్పు చేస్తే నా కుమారుడ్ని శిక్షించండి - ఇలా కేసులు పెట్టి టార్చర్​ చేయకండి'

Last Updated : Apr 18, 2024, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.