ETV Bharat / opinion

ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియరెన్స్‌కు ప్రభుత్వం పచ్చజెండా - ఈ నిర్ణయంతో ప్రజలకు ఏవిధంగా మేలు జరగనుంది?

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 28, 2024, 9:56 AM IST

Telangana Govt LRS Scheme
Telangana Govt LRS Scheme

Prathidhwani Debate on LRS Regularization : రాష్ట్రంలో ఎల్​ఆర్​ఎస్​ దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మార్చి 31లోగా లేఅవుట్ల క్రమబద్ధీకరణకు నిర్ణయం తీసుకుంది. మరి న్యాయస్థానాల్లో ఉన్న కేసులను ఎలా అధిగమిస్తారు? ప్రొసీడింగ్స్‌ విషయంలో గత అనుభవాలు ఏం చెబుతున్నాయి, ఫీజులపై ఎలా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఈ అంశాలపై ప్రతిధ్వని.

Prathidhwani Debate on LRS Regularization : గతంలో 2020లో ఎల్‌ఆర్‌ఎస్‌ కింద స్వీకరించిన దరఖాస్తులను మార్చి 31లోగా క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాలతో అధికారులు విధివిధానాల రూపకల్పనకు కసరత్తుల్లో నిమగ్నమయ్యారు. మరి తెలంగాణ సర్కార్ నిర్ణయంతో ఎంతమందికి ప్రయోజనం చేకూరుతుంది. ఇందుకోసం మార్చి 31వ తేదీని లక్ష్యంగా నిర్ణయించుకున్న నేపథ్యంలో న్యాయస్థానాల్లో ఉన్న కేసులను ఎలా అధిగమిస్తారు? ప్రొసీడింగ్స్‌ విషయంలో గత అనుభవాలు ఏం చెబుతున్నాయి, ఫీజులపై ఎలా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఈ అంశాలపై ఇవాళ్టి ప్రతిధ్వని.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Telangana Govt LRS Scheme : అనుమతిలేని లేఅవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్ల క్రమబద్ధీకరణకు గత బీఆర్ఎస్ సర్కార్ అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ రూల్స్‌-2020 పేరిట 2020 ఆగస్ట్ 31న ఉత్తర్వులు ఇచ్చింది. దరఖాస్తు చేసుకునేందుకు అదే సంవత్సరం సెప్టెంబరు 15వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. ప్లాట్లు కొనుగోలు చేసినవారు అర్జీతోపాటు రూ.వెయ్యి, లేఅవుట్ వేసిన డెవలపర్‌ దరఖాస్తు చేసిన పక్షంలో రూ.10,000లు ఫీజుగా చెల్లించాలని ఉత్తర్వుల్లో వెల్లడించింది.

ఈ క్రమంలోనే తెలంగాణ వ్యాప్తంగా 25.44 లక్షల అర్జీలు అందాయి. మున్సిపల్‌ కార్పొరేషన్లలో 4.13 లక్షలు, మున్సిపాలిటీలో 10.55 లక్షలు, పంచాయతీల్లో 10.76 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అధికారులు పరిష్కార ప్రక్రియ చేపట్టేలోగా హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ధర్మాసనం తుది తీర్పునకు కట్టుబడి ఉంటామని తెలిపింది. అదేవిధంగా అఫిడవిట్‌ ఇచ్చిన దరఖాస్తులను పరిష్కరించవచ్చని కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో సుమారు 4,000ల మంది అర్జీదారులు స్వచ్ఛందంగా ముందుకు రావటంతో వారికి అధికారులు అనుమతులు ఇచ్చారు. అఫిడవిట్‌ ఇచ్చిన దరఖాస్తుదారుల్లో సుమారు 20 శాతం మందికి ఇళ్ల నిర్మాణానికి అధికారులు అనుమతులు జారీ చేశారు.

LRS Applications Regularization 2024 : ప్రభుత్వ స్థలాల్లోని లేఅవుట్లతోపాటు దేవాదాయశాఖ, చెరువు గర్భం, వక్ఫ్‌, కోర్టు కేసుల్లో ఉన్న భూముల్లో వేసిన లేఅవుట్లను క్రమబద్ధీకరించకూడదని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. క్షేత్రస్థాయి పరిశీలన తరవాత సుమారు 20 శాతం అర్జీలు అర్హమైనవి కావని అధికారులు నిర్ధారించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కారం ద్వారా వివిధ రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రూ.6,000ల కోట్లకు పైగా ఆదాయం లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.