ETV Bharat / international

ప్రపంచంలో అత్యంత ప్రమాదకర జీవి 'దోమ'- టాప్​ 10 లిస్ట్​లో ఇంకా ఏమున్నాయంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2024, 3:49 PM IST

Top 10 Dangerous Living Creatures : ప్రస్తుత కాలంలో క్రూర మృగాల బెడద పెద్దగా లేకపోయినా ఇప్పటికీ వీటి వల్ల ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది. అయితే పులులు, సింహాల వంటి క్రూర మృగాలతో పాటు విష జీవాల వల్ల ఏటా లక్షల మంది చనిపోతున్నారు. ప్రపంచంలోని అతి ప్రమాదకరమైన 10 ప్రాణులు గురించి తెలుసుకోవాలనుందా? అయితే ఈ ఆర్టికల్ చదవండి.

Top 10 Dangerous Living Creatures
Top 10 Dangerous Living Creatures

Top 10 Dangerous Living Creatures : ప్రస్తుత కాలంలో క్రూరమృగాల కంటే విషకీటకాల వల్ల చనిపోయే వారి సంఖ్యే అధికంగా ఉంటుంది. అడవుల నరికివేత, తదితర కారణాల రీత్యా పులులు, సింహాలు వంటి క్రూరమృగాల సంఖ్య క్రమంగా తగ్గినా నేటికీ వాటి వల్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఏటా వందల సంఖ్యలో మనుషులు వీటి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అదే సమయంలో మనుషుల వల్ల ఏటా లక్షల మంది హత్యకు గురవుతున్నారు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకర ప్రాణుల వల్ల ఏటా ఎంత మంది చనిపోతున్నారో తెలుసుకుందాం.

10. సింహాలు
ప్రపంచవ్యాప్తంగా ఏటా 200 మంది సింహాల బారిన పడి చనిపోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మన దేశంలో వీటి వల్ల చనిపోయే వారి సంఖ్య చాలా తక్కువ. గుజరాత్ ప్రాంతంలో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి.

9. హిప్పోలు
హిప్పోల దాడి వల్ల ఏటా 500 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. హిప్పోలు వాస్తవానికి శాకాహార జీవులు కానీ కొన్ని సార్లు కోపంతో మనుషులపై దాడి చేస్తాయి.

8. ఏనుగులు
ఏనుగుల వల్ల చనిపోయే వారి సంఖ్య ఏటా 800 వరకు ఉంటుంది. మన దేశంలో కేరళలో గజరాజుల వల్ల ప్రమాదం అధికంగా ఉంటుంది.

7. మొసళ్లు
మొసళ్ల వల్ల ఏటా 1000 మంది వరకు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వీటికి అత్యంత పదునైన దంతాలు ఉంటాయి. నైలు మొసలి 5000 పీఎస్ఐ (పౌండ్స్​ పర్ స్వేర్​ ఇంచ్​) బలంతో దాడి చేయగలదు. దీని తర్వాత ఉప్పునీటి మొసలి 3700 పీఎస్ఐ బలంతో దాడి చేస్తుంది.

6. తేలు
ఈ విష కీటకాలు మన దేశంలోనూ ఎక్కువ సంఖ్యలో కనిపిస్తాయి. వీటి వల్ల ఏటా 3,300 మంది వరకు చనిపోతున్నారు.

5. అస్సాసిన్ బగ్స్
దక్షిణ అమెరికాలో ఎక్కువగా నివసించే ఈ కీటకాల వల్ల ప్రతి ఏడాది 10,000 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. దీనివల్ల చాగస్ అనే వ్యాధి వస్తుంది.

4. కుక్కలు
ఎంతో ప్రేమతో ఇంట్లో పెంచుకునే ఈ జీవుల వల్ల ఏటా 59,000 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. వీటి కాటు వల్ల వచ్చే రేబిస్ వ్యాధి కారణంగా ఈ మరణాలు సంభవిస్తున్నాయి.

3. పాములు
విష సర్పాల కాటు వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షా 38 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. భారత్​లో సైతం వీటి వల్ల మరణించే వారి సంఖ్య అధికంగా ఉంటుంది.

2. మనుషులు
భూమండలంపై ఉన్న అత్యంత ప్రమాదకర ప్రాణుల్లో మనుషులు రెండో స్థానంలో ఉన్నారు. ప్రతి సంవత్సరం దాదాపు నాలుగు లక్షల మంది మరొకరి చేతిలో హత్యకు గురవుతున్నారు. గణాంకాల ప్రకారం 2019లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మొత్తం మరణాల్లో 0.7 శాతం హత్యలే కావడం గమనార్హం.

1. దోమలు
ఇక చివరగా చెప్పాల్సింది దోమల గురించి. వీటి వల్ల ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య ఏటా 7,25,000 వరకు ఉంటుంది. ఎందుకంటే మన పరిసర ప్రాంతాల్లోనే జీవించే ఈ విష కీటకాల మలేరియా, డెంగ్యూ లాంటి విష జ్వరాలు వస్తాయి. అంతే కాకుండా మలేరియా వల్ల చనిపోయే వారిలో 96 శాతం మంది ఆఫ్రికా వాసులే. 95 శాతం మలేరియా కేసులు అక్కడి నుంచే వస్తాయి.

కాల గర్భంలో తరువాత కనుమరుగయ్యేది మనిషేనా?

అరుదైన పిల్లి కిడ్నాప్​.. రంగంలోకి పోలీసులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.