ETV Bharat / health

తెల్ల ఉల్లి Vs ఎర్ర ఉల్లిగడ్డలు - ఈ రెండిట్లో ఏవి మంచివో మీరు తెలుసుకోవాల్సిందే!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 20, 2024, 5:28 PM IST

White Onions Health Benefits : రుచికి కంపల్సరీ అనో.. ఆరోగ్యానికి మంచిదనో.. మనవాళ్లు ప్రతి కూరలోనూ ఉల్లిపాయ వేస్తుంటారు. అయితే.. చాలా మందిలో ఉన్న సందేహం ఏమంటే.. ఎర్రని ఉల్లిపాయ మంచిదా? తెల్లనిది మంచిదా అని! మరి.. మీకు తెలుసా?

Red Onions
White Onions

White Onions vs Red Onions : మనవాళ్లు ఏ కర్రీ వండినా.. తాళింపులో తప్పకుండా ఉల్లిపాయ పడాల్సిందే. అంతేకాదు.. కొందరు వీటిని పచ్చిగానే లాగిస్తుంటారు. ఇంతగా మన కూరల్లో కలిసిపోయిన ఉల్లిపాయలో తెల్లవి, ఎర్రవి ఉన్నాయనే సంగతి తెలిసిందే. మరి.. ఈ రెండింటిలో ఏవి ఆరోగ్యానికి మంచివి అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దీనికి నిపుణులు ఏం సమాధానం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎర్ర ఉల్లిపాయలు కాస్త రుచిగా ఉంటాయి. తెల్లఉల్లి గడ్డలు మాత్రం మరింత ఘాటు వాసన కలిగి ఉంటాయి. అయితే.. ఎర్రగడ్డలతో పోల్చితే తెల్ల ఉల్లిపాయల్లోనే పోషకాలు ఎక్కువ మోతాదులో ఉంటాయట. ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు తెల్ల వాటిలోనే ఎక్కువ అని చెబుతున్నారు. అందుకే.. ఈ రెండింటిలో ది బెస్ట్ ఏవీ అంటే.. తెల్లవే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

పోషకాల పవర్ హౌస్ : వైట్ ఆనియన్స్​ను పోషకాల పవర్ హౌస్ అని చెప్పుకోవచ్చంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీటిలో కేలరీలు తక్కువగా ఉండి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. నార్మల్ సైజ్​ వైట్ ఆనియన్​లో 44 శాతం కేలరీలు ఉంటే.. విటమిన్స్, ఖనిజాలు, ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటాయని చెబుతున్నారు.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది : తెల్ల ఉల్లిగడ్డలో విటమిన్ C ఎక్కువ. ఇది ఇమ్యూనిటీ పవర్ పవర్ పెంచడానికి, కణజాల మరమ్మతుకు, బాడీలో కొవ్వును కరిగించడానికి చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. అంతేకాకుండా వీటిలో పుష్కలంగా ఉండే B విటమిన్ బాడీలో ఎర్ర రక్త కణాలను పెంచడంలో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

Fact Check: ఉల్లిగడ్డపై నల్లని పొర వల్ల బ్లాక్​ ఫంగస్​ వస్తుందా..?

గుండెకు మేలు చేస్తాయి : వైట్ ఆనియన్​లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. అంటే.. ట్రైగ్లిజరైడ్లను, కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యానికి సహకరిస్తాయని చెబుతున్నారు. అంతే కాదు.. తెల్ల ఉల్లి అధిక రక్తపోటును తగ్గించడానికి, రక్తం గడ్డ కట్టకుండా నిరోధించడానికీ చాలా బాగా సహాయ పడుతుందని సూచిస్తున్నారు నిపుణులు.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి : తెల్ల ఉల్లిలో సల్ఫర్‌ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయంటున్నారు నిపుణులు. అలాగే కొన్ని అధ్యయనాలు తెల్ల ఉల్లి క్యాన్సర్‌ లక్షణాలను నివారించడంలో మేలు చేస్తుందని పేర్కొన్నాయి.

డయాబెటిస్ కంట్రోల్ : షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది ఒక మంచి ఔషధంగా చెప్పుకోవచ్చంటున్నారు నిపుణులు. వైట్ ఆనియన్​లో ఉండే క్రోమియం, సల్ఫర్‌లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహకరిస్తాయని చెబుతున్నారు. ఇవేకాకుండా.. తెల్ల ఉల్లి జీవక్రియను మెరుగపరచడంలో చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తుందట. చూశారుగా.. తెల్ల ఉల్లిగడ్డతో ఎన్ని ప్రయోజనాలున్నాయో.. అందుకే ఎర్ర ఉల్లికంటే ఇది కొంచం ఎక్కువ తీసుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు. అలాగని.. ఎర్ర ఉల్లి ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పట్లేదంటున్నారు. ఎర్ర వాటితో పోలిస్తే.. తెల్లవాటిలో కాస్త పోషకాలు తక్కువ మోతాదులో ఉంటాయనే విషయాన్ని గమనించాలంటున్నారు.

తల్లి కూడా చేయని మేలు.. ఉల్లితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.