ETV Bharat / health

బరువు తగ్గాలంటే - సమ్మర్​లో ఈ కూరలు తినాలి - ఈజీగా వెయిట్ లాస్ అవుతారు! - Summer Weight Loss Vegetables

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 10, 2024, 9:36 AM IST

Weight Loss Vegetables in Summer : సమ్మర్​లో బరువు తగ్గాలనుకునే వారు పర్ఫెక్ట్ డైట్ మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. బాడీని హైడ్రేట్​గా ఉంచుతూ వెయిట్ తగ్గాల్సి ఉంటుంది. ఇందుకోసం డైట్​లో కొన్ని వెజిటబుల్స్ చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు...

Weight Loss
Weight Loss Vegetables

Hydrating Vegetables for Weight Loss : రోజురోజుకూ ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో.. జిమ్​లో కూడా ఎక్కువ సేపు గడపలేకపోతుంటారు. బాడీ డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి.. చక్కటి డైట్ పాటించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో కొన్ని కూరగాయలు చేర్చుకోవడం ద్వారా.. ఫ్యాట్ బర్న్‌ అవుతుందని అంటున్నారు. మరి.. ఆ వెజిటబుల్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

టమాటాలు : వీటిలో వాటర్ కంటెంట్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడమే కాకుండా కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి.. సమ్మర్​లో వీటిని మీ డైట్​లో చేర్చుకోవడం ద్వారా అందులోని పోషకాలు.. జీవక్రియ రేటును పెంచి ఫ్యాట్ బర్న్ అవ్వడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. వెయిట్ లాస్ కోసం ఎక్సర్​సైజ్​లు చేసేవారు టమాటా జ్యూస్ తాగడం మంచిదని చెబుతున్నారు.

2019లో "అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌"లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. 12 వారాలపాటు రోజుకు 2 టమాటాలు తిన్న వ్యక్తులు తమ బరువును సగటున 1.5 పౌండ్లు (0.7 కిలోలు) కోల్పోయారని తేలింది. ఈ పరిశోధనలో అమెరికాకు చెందిన ప్రముఖ పోషకాహార నిపుణుడు డాక్టర్. డానా సిమ్మోన్స్ పాల్గొన్నారు. టమాటాలు తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడంతో పాటు బరువు తగ్గడంలో కూడా అవి సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.

ముల్లంగి : వేసవిలో హైడ్రేటింగ్ వెజిటేబుల్​గా ముల్లంగి చాలా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. దీనిలోనూ వాటర్ కంటెంట్ అధికంగా ఉండడమే కాకుండా తక్కువ కేలరీలు ఉంటాయి. కాబట్టి, సమ్మర్​లో బరువు తగ్గాలనుకునేవారికి.. ముల్లంగిని ఉత్తమ ఎంపికగా చెప్పుకోవచ్చంటున్నారు నిపుణులు.

క్యారెట్లు : సమ్మర్​లో క్యారెట్లను మీ డైట్​లో చేర్చుకోవడం ద్వారా చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు నిపుణులు. తక్కువ కేలరీలు కలిగిన ఈ వాటర్​ రిచ్​ ఫుడ్​లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయట. అలాగే వీటిలో ఉండే ఫైబర్​ ఆకలిని నియంత్రించి ఎక్కువ సేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. కాబట్టి, సమ్మర్​లో క్యారెట్లు తినడం ద్వారా బరువును తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

అలర్ట్ : వేగంగా బరువు తగ్గే ప్రయత్నం చేస్తున్నారా? - ఏం జరుగుతుందో తెలుసా?

క్యాప్సికం : ఇది కూడా అద్భుతమైన రుచిని అందించే మంచి హైడ్రేటింగ్ వెజిటబుల్ అని చెబుతున్నారు నిపుణులు. ఇందులో విటమిన్ ఎ, సితో పాటు వాటర్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుందంటున్నారు. కాబట్టి, సమ్మర్​లో క్యాప్సికంను డైట్​లో చేర్చుకుంటే బరువు తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని కూరల రూపంలో తీసుకోవచ్చు లేదా సలాడ్​లలో పచ్చిగా తినవచ్చని చెబుతున్నారు.

వాము ఆకులు : ఇవి కూడా సమ్మర్​లో బరువు తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. వీటిలోనూ కేలరీలు తక్కువగా ఉండి, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందట. వాము ఆకులను తురిమి సలాడ్స్​, సూప్స్​లలో వేసుకొని తినవచ్చు. వేసవిలో ఇవి తినడం ద్వారా మెటబాలిజం పెరిగి బరువు తగ్గడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మాట్లాడుతూ వాకింగ్ చేస్తున్నారా? ఎన్ని నష్టాలో తెలుసా? ఇలా చేస్తే మంచిది​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.