ETV Bharat / health

మానసిక ఒత్తిడితో - ఈ రోగాలు ఖాయం!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 4, 2024, 3:42 PM IST

Stress Health Issues : 'ఒత్తిడి' నేటి ఆధునిక కాలంలో మనిషి నిండు జీవితాన్ని మెల్లిగా ఆవిరయ్యేలా చేస్తున్న వాటిలో ఒకటి. అవునండి ఇది నిజం! దీని కారణంగానే మనలో చాలా మంది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. అయితే, దీన్ని వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి ? ఒత్తిడిని చిత్తు చేసి ఎలా జయించాలి ? అనేది ఇప్పుడు చూద్దాం.

Stress Health Issues
Stress Health Issues

Stress Health Issues : మనం ఆరోగ్యంగా, హ్యాపీగా జీవించాలంటే మానసికంగా, శరీరకంగా ఒత్తిడికి గురికాకూడదు. కానీ, నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనిషులు కాలంతో పోటీ పడి ప్రయాణిస్తుండడంతో స్ట్రెస్‌కు లోనవుతున్నారు. అయితే.. చాలా మంది ఈ ఒత్తిడిని తగ్గించుకోకుండా అలానే ముందుకు సాగడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి.. దీర్ఘకాలికంగా స్ట్రెస్‌కు గురికావడం వల్ల ఎటువంటి హెల్త్‌ ప్రాబ్లమ్స్‌ వస్తాయో మీకు తెలుసా ? ఇప్పుడు చూద్దాం.

అధిక ఒత్తిడి వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు :
గుండె జబ్బులు :
మనం ఎక్కువ కాలం పాటు ఒత్తిడికి గురవడం వల్ల హైబీపీ, గుండె జబ్బులు, అధిక బరువు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 2017లో "ది లాన్సెట్" జర్నల్‌ ప్రచురించిన నివేదిక ప్రకారం దీర్ఘకాలికంగా ఒత్తిడికి లోనైన వారిలో గుండె జబ్బుల ప్రమాదం 25 శాతం పెరిగిందని పరిశోధకులు గుర్తించారట.

దీర్ఘకాలిక తలనొప్పి :
మీరు చాలా రోజుల నుంచి తలనొప్పి సమస్యతో బాధపడుతుంటే, దాని వెనక ఒత్తిడి కూడా ఒక కారణమై ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే దీర్ఘకాలికంగా స్ట్రెస్‌కు గురయ్యే వారిలో తలనొప్పి, వెన్ను నొప్పి సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలియజేస్తున్నారు. ఇలా తలనొప్పి ఎందుకు వస్తుందంటే మెడ, స్కాల్ప్‌లోని కండరాలు ఒత్తిడికి గురైనప్పుడు తలనొప్పిని కలగజేస్తాయని నిపుణులంటున్నారు.

నిద్రలేమి :
నేడు చాలా మంది రాత్రి తొందరగా పడుకోకుండా గంటల తరబడి ఫోన్‌ను చూస్తూ ఎప్పుడో అర్ధరాత్రి సమయంలో నిద్రపోతున్నారు. కానీ, ఇలా ఎక్కువ రోజులు కంటి నిండా నిద్రపోకుండా ఉంటే కూడా ఒత్తిడి మన జీవితాన్ని చిత్తు చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఒత్తిడి కారణంగా ఎదురయ్యే సమస్యలు :

  • తీవ్రమైన అలసట
  • మానసికంగా కుంగిపోవడం
  • ముఖంపై మొటిమలు రావడం
  • హార్మోన్లలో మార్పులు
  • జీర్ణ సంబంధిత సమస్యలు
  • బరువు పెరగడం
  • ఆకలి లేకపోవడం వంటి సమస్యలు ప్రధానంగా కనిపిస్తాయని చెబుతున్నారు.

ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి ?

  • ఎక్కువగా స్ట్రెస్‌ను అనుభవించే వారు దానిని తగ్గించుకోవడానికి ఆహారంలో తాజా, పండ్లు కూరగాయలను భాగం చేసుకోవాలి.
  • ఇంకా ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతి రోజు యోగా, ధ్యానం వంటి వాటిని జీవితంలో భాగం చేసుకోవాలి.
  • అలాగే రోజూ కొంత సేపు చెమట వచ్చేలా వాకింగ్‌, జాగింగ్‌, స్విమ్మింగ్‌ వంటి వ్యాయామాలను చేయాలని నిపుణులు చెబుతున్నారు.
  • రోజూ కనీసం 8 గ్లాసుల నీటిని తాగాలి.

గమనిక : మీరు దీర్ఘకాలికంగా ఒత్తిడికి గురవుతుంటే దాని నుంచి ఉపశమనం పొందడానికి వైద్యులను సంప్రదించడం మంచిది.

బాదం తినకపోతే ఓ సమస్య - అతిగా తింటే మరో ప్రాబ్లం! - రోజుకు ఎన్ని తినాలి?

జుట్టు ఎక్కువగా రాలుతోందా? కొబ్బరి నూనె, కరివేపాకుతో సమస్యకు చెక్​- అదెలాగంటే?

ఈ లక్షణాలున్నాయా - గుండెపోటు రాబోతున్నట్టే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.