ETV Bharat / health

గర్భంతో ఉన్నప్పుడు సెక్స్​ చేయవచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారు?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 19, 2024, 7:45 AM IST

Sex During Pregnancy : గర్భంతో ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొనవచ్చా అని భార్యభర్తలకు చాలా సందేహాలు ఉంటాయి. గర్భం దాల్చినప్పుడు సెక్స్​లో పాల్గొంటే కడుపులో శిశువు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఆలోచిస్తుంటారు. గర్భస్రావం అవుతుందేమోననే భయపడుతుంటారు. దీనిపై వైద్యులు ఏమంటున్నారో? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

Sex During Pregnancy
Sex During Pregnancy

Sex During Pregnancy : గర్భంతో ఉన్నప్పుడు శృంగారంపై భార్యాభర్తల్లో చాలా మందికి అనేహ అపోహలు ఉంటుంటాయి. మనసులో సెక్స్ కోరికలు ఉన్నా, గర్భాస్రావం భయంతో వెనక్కి తగ్గుతుంటారు. కొంతమంది మరీ సుకుమారంగా వ్యవహరిస్తుంటారు. నిజానికి ఆరోగ్యానికి, దంపతుల మధ్య అనుబంధానికి కీలకమైనది శృంగారం. అటువంటిది దానిపై లేనిపోని అనుమానాలతో ఎక్కువగా భయపడుతుంటారు. అయితే గర్భంతో ఉన్నప్పుడు కొన్ని అరుదైన సందర్భాల్లో తప్ప, మిగిలిన సమయాల్లో సెక్స్​‎లో పాల్గొనడంపై ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.

ఆ జోన్​లో లేని వారే
ఇన్ఫెక్షన్స్​ లాంటివి ప్రమాదకరమైన వ్యాధులు ఉన్నవారు, హైరిస్క్ జోన్లో ఉన్న గర్భిణులు తప్ప మిగిలిన వారు సెక్స్​లో పాల్గొనడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని నిపుణులు అంటున్నారు. కొంతమంది గర్భంతో ఉన్నప్పుడు చాలా ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటుంటారు. గర్భసంచికి సంబంధించిన సమస్యలు, బిడ్డ ఆరోగ్యానికి సంబంధించి బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంటుంది. ఇలాంటి వారు సెక్స్​కు దూరంగా ఉండటమే మంచిదని అంటున్నారు.

అంతేకాని మరీ సుకుమారంగా వ్యవహరిస్తూ, ఏ ఇబ్బంది లేకపోయినా, అడుగుతీసి అడుగు వేయడానికి భయపడేవారు కేవలం అపోహతోనే సెక్స్​‎కు దూరంగా ఉంటారని వైద్యులు అంటున్నారు. నిజానికి గర్భంతో ఉన్నప్పుడు కూడా భార్యాభర్తల కలయిక వల్ల బిడ్ద ఎదుగుదల బాగుంటుందని కూడా డాక్టర్లు చెబుతున్నారు. అయితే పొట్టపై ఒత్తిడి లేకుండా కలుసుకోవడం ముఖ్యమన్న సంగతిని గమనించాలి.

అన్ని అపోహలే
గర్భం వచ్చాక శృంగారంలో పాల్గొంటే అబార్షన్ అవుతుందని, నెలలు నిండకముందే డెలివరీ వచ్చేస్తుందని కొంతమంది భయపడుతుంటారు. వాస్తవానికి ఈ రెండూ అపోహలే. కలయిక వల్ల వెజైనా వద్ద అసౌకర్యంగా ఉన్నా, నొప్పి వచ్చినా ఏదైనా దుష్ప్రభావం ఉంటుందేమోననే భయం కూడా ఉంటుంది. నిపుణులు చెప్పినదాని ప్రకారం కొన్నిసార్లు కలయిక వల్ల అసౌకర్యం, నొప్పి రెండూ సహజంగా వచ్చేవే. భార్యాభర్తలు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొనడం మంచిదేనని వైద్యులు సూచిస్తున్నారు.

రిస్క్ చేయకపోవటమే మంచిది
గర్భిణుల ఆరోగ్యం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అందుకే క్రమం తప్పకుండా చెక్​ చేయించుకుంటూ ఉండాలి. నెలకు ఒకసారైనా డాక్టర్లను సంప్రదించాలి. అప్పుడే శృంగారంపై ఉన్న అనుమానాలను డాక్టర్లను అడిగి తెలుసుకోవాలి. సాధారణంగా కొన్ని ప్రత్యేక సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే శృంగారానికి దూరంగా ఉండమని చెబుతుంటారు. భాగస్వామికి సెక్స్ ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు, హెచ్ఐవీ వంటి ప్రమాదకరమైన వ్యాధులు ఉన్నాయని తెలిసినప్పుడు శృంగారానికి దూరంగా ఉండాలి. శృంగారం ద్వారా వ్యాధులు సోకే అవకాశం ఉన్నప్పుడు కండోమ్స్ ద్వారా చేయడానికి సిద్ధమవుతారు. కానీ, ఇది రిస్క్​తో కూడుకున్నదని వైద్యుల అభిప్రాయం.

ప్రయోజనాలివే!
గర్భదారణ సమయంలో సెక్స్ వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. శృంగారం వల్ల జననేంద్రియాలకు రక్త ప్రసరణ మెరుగవుతుంది. కండరాలు గట్టిపడతాయని, చిన్నచిన్న సమస్యలు కూడా దూరమవుతాయని అంటున్నారు. కలయికతో దంపతుల మధ్య అనుబంధం పెరుగుతుంది. ఈ సమయంలో శృగారంతో ఒంట్లో పేరుకుపోయిన అదనపు కొవ్వు, క్యాలరీలు తగ్గుతాయి. దీంతో గర్భిణీలు ఫిట్‌గా, యాక్టివ్​గా ఉంటారు. శృంగారం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఓ అధ్యయనంలో కూడా వెల్లడైందని వైద్యులు చెబుతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కళ్ల కింద డార్క్​ సర్కిల్స్​ ఎందుకొస్తాయి? వాటిని ఎలా తగ్గించుకోవాలి?

పెయిన్ కిల్లర్స్​ ఎక్కువగా వాడుతున్నారా? పసుపు, అల్లం, తులసి అద్భుత ఔషధం- ట్రై చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.