ETV Bharat / health

ఏ టైమ్‌లో షుగర్‌ టెస్ట్‌ చేసుకుంటే - రిజల్ట్‌ పక్కాగా వస్తుంది? - మీకు తెలుసా ? - Best Time To Sugar Test

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 25, 2024, 12:35 PM IST

Best Time To Sugar Test
Best Time To Sugar Test

Best Time To Sugar Test : మీరు షుగర్ టెస్ట్ చేసుకోవాలని అనుకుంటున్నారా? మరి.. ఏ సమయంలో చేయించుకోవాలి? ఎప్పుడు టెస్ట్ చేస్తే సరైన ఫలితాలు వస్తాయి? మీకు తెలుసా?

Best Time to Sugar Test: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమలేకపోవడం, జన్యువులు వంటి వివిధ కారణాల వల్ల ప్రస్తుత కాలంలో చాలా మంది షుగర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. మెజార్టీ జనాలకు తమకు షుగర్‌ వ్యాధి ఉన్నట్లు కూడా తెలియదు. రోజులాగే వారి జీవితంలోని అన్ని పనులు చేసుకుంటూ వెళ్తుంటారు. అయితే.. ఇది దీర్ఘకాలంలో చాలా ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే.. శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే షుగర్‌ టెస్ట్‌ చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే.. షుగర్‌ పరీక్షలను ర్యాండమ్‌గా కాకుండా.. సరైనా విధంగా చేసుకోవాలని చెబుతున్నారు. అప్పుడే షుగర్‌ ఉందా? లేదా? అనేది క్లారిటీగా తెలుస్తుందని చెబుతున్నారు. మరి.. ఏ టైమ్‌లో షుగర్‌ టెస్ట్‌ చేసుకుంటే, రిజల్ట్‌ పక్కాగా వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకండి: మీకు ఎప్పుడూ విపరీతమైన దాహం వేస్తున్నట్లుగా ఉండి, ఆయాసంగా ఉంటే వెంటనే మీరు షుగర్‌ టెస్ట్‌ చేయించుకోవాలి. అలాగే తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లడం, తలనొప్పిగా ఉండటం, కంటి చూపు మందగించినట్లుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే కూడా షుగర్ పరీక్షలు చేయించుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

అలర్ట్ : వేగంగా బరువు తగ్గే ప్రయత్నం చేస్తున్నారా? - ఏం జరుగుతుందో తెలుసా? - Weight Loss Problems

షుగర్‌ టెస్ట్‌ ఏ సమయంలో చేసుకోవాలి: ఉదయం నిద్రలేచిన తర్వాత షుగర్‌ పరీక్ష చేసుకోవడం వల్ల షుగర్‌ ఉందా? లేదా? అనే విషయం క్లారిటీగా తెలుస్తుందని ఆరోగ్య నిపుణులంటున్నారు. పొద్దున్నే ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. ఆ తర్వాత టిఫెన్ లేదా ఏదైనా ఆహారం తిన్న రెండు గంటల తర్వాత మరోసారి బ్లడ్ షాంపిల్ ఇవ్వాలి. ఇలా చేసినప్పుడే రక్త పరీక్ష ఫలితాలు చాలా కచ్చితత్వంతో వస్తాయని డాక్టర్‌ శ్రీనివాస్‌ కందుల (ఎండోక్రైనాలజిస్ట్‌) సూచిస్తున్నారు.

వ్యాయామం చేసేవారు ఎవరైనా ఉంటే వారు ఎక్సర్‌సైజ్‌లు చేసేముందు, చేసిన తర్వాత కూడా బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకోవాలని చెబుతున్నారు. దీనివల్ల రక్తంలో షుగర్‌ స్థాయిలను సరిగ్గా అంచనా వేయవచ్చని అంటున్నారు. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్‌ నివేదిక ప్రకారం.. అరోగ్యవంతమైన వ్యక్తులలో తినడానికి ముందు రక్తంలో చక్కెర స్థాయిలు 80-130 mg/dL ఉండాలి. అలాగే ఆహారం తిన్న తర్వాత 2 గంటలకు షుగర్‌ స్థాయిలు 180 mg/dL కంటే తక్కువగా ఉండాలని చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

రాత్రి పూట ఈ పండ్లను అస్సలే తినకండి - ఎందుకో తెలుసా? - Fruits To Avoid At Night

షుగర్‌ ఉన్నవారు ఈ పండ్లు తింటే - ఆరోగ్యానికి మంచిది! - Diabetes Patients Eat Fruits

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.