ETV Bharat / health

జుట్టు రాలడం నుంచి చుండ్రు వరకు - ఉల్లి నూనెతో అన్నీ పరార్​! - Onion Oil Benefits

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 18, 2024, 11:42 AM IST

Oil for Hair Growth
Onion Oil

Onion Oil Health Benefits : ఉల్లిపాయతో ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. జుట్టుకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉల్లితో ఇలా ఆయిల్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారంటే ఎలాంటి జుట్టు ప్రాబ్లమ్ అయినా ఇట్టే తగ్గిపోతుందంటున్నారు నిపుణులు. మరి, ఉల్లి నూనె ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.

Best Home Made Oil for Hair Growth : ఈరోజుల్లో మారిన జీవనశైలి కారణంగా చాలా మంది చిన్న వయసులోనే వివిధ రకాల జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా జుట్టు రాలిపోవడం, పొడిబారిపోవడం, నెరిసిపోవడం, చుండ్రు.. ఇలా పలు రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో కొందరు ఈ సమస్యల నుంచి బయటపడేందుకు మార్కెట్​లో దొరికే వివిధ రకాల హెయిర్ కేర్ ఉత్పత్తులు, ఆయిల్స్​ను యూజ్ చేస్తుంటారు. ఇవన్నీ ట్రై చేసినా ఫలితం అంతంతమాత్రమే అని బాధపడుతుంటారు. అలాంటి వారి కోసమే అద్భుతమైన హోమ్ మేడ్ ఆయిల్.. "ఉల్లి నూనె" తీసుకొచ్చాం. దీనిని కనుక వాడారంటే జుట్టు(Hair) సమస్యలన్నింటికీ ఈజీగా చెక్ పెట్టొచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. ఇంతకీ, ఉల్లి నూనెను ఎలా తయారు చేసుకోవాలి? దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • కొబ్బరినూనె - అరకప్పు
  • మెంతులు - టేబుల్‌ స్పూన్
  • కరివేపాకు - 15 నుంచి 20 రెబ్బలు
  • మీడియం సైజ్ ఉల్లిపాయ- ఒకటి.

తయారీ విధానం :

  • ముందుగా ఉల్లిపాయపై పొట్టు తొలగించి సన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టౌ మీద ఓ మందపాటి పాత్ర పెట్టి అందులో పైన చెప్పిన విధంగా కొబ్బరినూనె, మెంతులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి.
  • అప్పుడు ఆ మిశ్రమాన్ని మీడియం మంట మీద అరగంట పాటు మరగనివ్వాలి. ఇలా చేయడం వల్ల ఉల్లి, కరివేపాకు, మెంతులలో ఉన్న పోషకాలన్నీ నూనెలోకి చేరతాయి.
  • ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసి మిశ్రమాన్ని చల్లబడే వరకు పక్కన పెట్టేయాలి. ఆపై ఒక శుభ్రమైన క్లాత్ సహాయంతో ఆ నూనెను వడకట్టుకోవాలి. అనంతరం దాన్ని ఒక గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకొని.. మీకు కావాల్సినప్పుడు ఉపయోగించుకోవచ్చు.

30 ఏళ్లకే తెల్ల జుట్టు రావడానికి కారణాలివే - వెంటనే ఇలా చేయండి!

ఉల్లినూనెతో కలిగే ప్రయోజనాలు :

  • ఉల్లినూనె తయారీలో వాడిన కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు కావాల్సిన తేమను అందించి సహజమైన మాయిశ్చరైజర్​లా పనిచేస్తాయని చెబుతున్నారు నిపుణులు. అంతేకాకుండా అందులోని ప్రొటీన్లు జుట్టుకు పటుత్వాన్ని అందిస్తాయంటున్నారు.
  • ఈ నూనె తయారీకి వాడిన కొబ్బరి నూనె వాతావరణ కాలుష్య ప్రభావం కురులపై పడకుండా మంచి రక్షణ కలిగిస్తుందని చెబుతున్నారు నిపుణులు. కుదుళ్లకు బలాన్ని అందించి జుట్టు చివర్లు చిట్లిపోకుండా కాపాడుతుందని సూచిస్తున్నారు.
  • ఇక ఉల్లిపాయలో ఉండే పోషకాలు జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉల్లిలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్​ఫ్లమేటరీ గుణాలు.. జుట్టు సమస్యలను దూరం చేయడంలో చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తాయని చెబుతున్నారు నిపుణులు. ఇవన్నీ జుట్టు రాలడాన్ని అరికట్టి.. హెయిర్ ఒత్తుగా, బలంగా, ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
  • 2014లో 'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. ఉల్లి నూనె జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణను పెంచుతుందని, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుందని వెల్లడైంది. ఈ పరిశోధనలో న్యూయార్క్​లోని మౌంట్ సినాయి స్కూల్ ఆఫ్ మెడిసిన్​కు చెందిన ప్రముఖ చర్మవ్యాధి నిపుణులు డాక్టర్. అహ్మద్ ఎ. ఖాన్ పాల్గొన్నారు. ఉల్లి నూనెలో ఉండే పోషకాలు జుట్టు సంరక్షణకు చాలా బాగా తోడ్పడుతాయని ఆయన పేర్కొన్నారు.
  • అదేవిధంగా ఉల్లినూనెలో తయారీలో యూజ్​ చేసిన మెంతుల్లో ఉండే ప్రొటీన్‌, నికోటినిక్‌ యాసిడ్‌.. చుండ్రు సమస్యను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

జుట్టు సమస్యలతో అలసిపోయారా? - ఈ ఒక్క ప్యాక్ ట్రైచేయండి - మీ హెయిర్ రెండింతలు పెరుగుతుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.