ETV Bharat / health

టూర్​​కు వెళ్తున్నారా? ఈ స్నాక్స్​ మస్ట్​ అంటున్న నిపుణులు!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 6, 2024, 3:50 PM IST

Snacks for Tours: రోటిన్ లైఫ్​ నుంచి కాస్తంత బ్రేక్ తీసుకుని రిఫ్రెష్ అయ్యేందుకు టూర్స్​ బెస్ట్​ ఆప్షన్​. అయితే, టూర్స్​కు వెళ్లేవాళ్లు ఆరోగ్యం, ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త ప్రాంతాలకు వెళ్లేముందు మన వెంట కొన్ని స్నాక్స్​ తీసుకుని వెళ్లడం మంచిదంటున్నారు. ఇంతకీ అవి ఏంటో ఇప్పుడు చూద్దాం..

Snacks for Tours
Snacks for Tours

Best Healthy Snacks for Tours: ప్రయాణాలు చేయడం అంటే అందరికీ ఇష్టమే. సెలవులు దొరికేతే చాలు ఫ్యామిలీతో కలిసి టూర్​లకు వెళ్తుంటారు. అందుకు తగ్గట్టుగా ముందే ప్లాన్​ చేసుకుంటారు. అయితే, టూర్‌లకు వెళ్లేవారు ఆరోగ్యం, ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త ప్రాంతాలకు వెళతాం కాబట్టి వెంట స్నాక్స్ తీసుకుని వెళ్లడం బెస్ట్​. అయితే స్నాక్స్​ అనగానే చాలా మంది వాళ్ల ఇంట్లో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకెళ్తుంటారు. అందులో ఎక్కువగా ఆయిల్ ఫుడ్డు ఫస్ట్​ ప్లేస్​లో ఉంటుంది. అయితే జర్నీలో ఆయిల్​ ఫుడ్​ తినడం వల్ల కడుపులో వికారంగా ఉంటుంది. తద్వారా ఆరోగ్యం పాడవుతుంది. అందుకని ఆయిల్ ఫుడ్ బదులు ఆరోగ్యాన్ని అందించేవి తీసుకెళ్లమంటున్నారు పోషకాహార నిపుణులు. ఇలాంటి సందర్భాలకు సూపర్​గా సరిపోయే స్నాక్స్‌ను వారు సూచిస్తున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

అరటి పళ్లు: బనానా.. సీజన్​తో సంబంధం లేకుండా తక్కువ ధరలో సామాన్య ప్రజలకు సైతం అందుబాటులో ఉంటాయి. బ్యాగ్​లో పెట్టుకుని ఎక్కడికంటే అక్కడికి వెంట తీసుకెళ్లగలిగే అరటిపళ్లు టూర్​లకు వెళ్లినప్పుడు బెస్ట్​ స్నాక్స్​. వీటిలో యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినగానే అలసట దూరమై శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.

Ayurvedic Items must have in travelling : మీరు జర్నీ చేయబోతున్నారా..? ఇవి వెంట తీసుకెళ్లడం మరిచిపోవద్దు!

యాపిల్, నారింజ: ఎంతో రుచిగా ఉండే యాపిల్, నారింజలు కూడా టూర్‌లకు తీసుకెళ్లడానికి బెస్ట్​ స్నాక్స్. వీటిల్లో విటమిన్ సీ తోపాటూ ఫైబర్​, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు సహా ఇతర పోషకాలు ఉంటాయి. వెంట తీసుకెళ్లడం కూడా సులువే.

ద్రాక్ష: ద్రాక్షపళ్ల రుచి అమోఘం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్​, విటమిన్​ సి, ల్యూటిన్​ అండ్​ జియాక్సంథిన్​ అనే కెరోటినాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్ల వంటి పోషకాలు సూపర్​గా ఉన్నాయి. పైగా వీటిని క్యారీ చేయడం కూడా సులువే. వీటని తినడం వల్ల తక్షణ శక్తి వస్తుంది. కాబట్టి టూర్​లకు వెళ్లినప్పుడు ఇవి కచ్చితంగా ఉండాల్సిందే..

టూర్ వెళ్తే ఈ టిప్స్ పాటించాల్సిందే - లేదంటే జేబు ఖాళీ అయిపోతుంది!

పుచ్చకాయ అండ్​ పైనాపిల్​: ఈ రెండింటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో పోషకాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. వీటిని తీసుకెళ్లడం కూడా సులువే. కాబట్టి.. అవసరమైన సందర్భాల్లో ఇవి తిని రిఫ్రెష్ అవ్వొచ్చు.

వెజ్జీ స్టిక్స్​: క్యారెట్ లేదా కీర దోస, బెల్​ పెప్పర్​ ముక్కలు కేవలం ఆరోగ్యపరంగానే కాదు.. టూర్‌లకు తీసుకెళ్లడానికి బెస్ట్​ స్నాక్స్​. ఇందులో విటమిన్స్​, మినరల్స్​, ఫైబర్​ ఉంటాయి. ఇవి తినడం వల్ల అలసట కూడా వెంటనే తీరిపోతుంది.

చూశారుగా, ఇకపై టూర్లకు వెళ్లేవారు వీటిల్లో ఏదో ఒకదాన్ని కచ్చితంగా వెంట తీసుకెళ్లాలని నిపుణులు చెబుతున్నారు. మరి మీరు ఫాలో అవుతారు కదా.!

ఒకే టికెట్​తో రైల్లో 56 రోజుల జర్నీ - ఇలా బుక్ చేసుకోండి!

టూర్​కి వెళ్లొచ్చిన తర్వాత లగేజ్​ బ్యాగ్​ పక్కన పడేస్తున్నారా? ఈ టిప్స్​తో ఈజీగా క్లీన్ చేయండి​!

జర్నీలో వాంతులు అవుతున్నాయా? - ఈ టిప్స్​తో ఈజీగా చెక్ పెట్టండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.