ETV Bharat / entertainment

మైనస్ 40 డిగ్రీల చలిలో షూటింగ్​ - విశ్వక్​ను చూసి వాళ్లు అలా చేశారట

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 8, 2024, 4:19 PM IST

Vishwak Sen Gaami Movie : మాస్​ కా దాస్ విశ్వక్​ సేన్ త్వరలో 'గామి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ తాజాగా విలేకరులతో ముచ్చటించింది. ఆ విశేషాలు మీ కోసం

Vishwak Sen Gaami Movie
Vishwak Sen Gaami Movie

Vishwak Sen Gaami Movie : ఇప్పుటి వరకు మాస్​, సాప్ట్​ రోల్స్​లో కనిపించిన మాస్​ కా దాస్​ విశ్వక్​ సేన్ ప్రస్తుతం ప్రయోగాత్మక సినిమాల వైపు అడుగులేస్తున్నారు. మంచి క‌థ‌లను ఎంచుకుంటూ టాలీవుడ్​లో మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఇటీవలే 'గామి' అనే సినిమాలో ఆయన లీడ్ రోల్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో విశ్వ‌క్ ఓ అఘోరాగా కనిపించనున్నారు.

తాజాగా విడుదలైన పోస్టర్​, టీజర్​లో ఆయన ఢిపరెంట్​ లుక్​ను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. దీంతో ఈ సినిమాపై అందరిలో మరింత ఆసక్తి పెరిగింది. మార్చి 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో డైరెక్టర్ విద్యాధర్‌ కాగితతో పాటు హీరో విశ్వక్​ ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

"గామి కోసం మా మూవీ టీమ్​ దాదాపు నాలుగున్నరేళ్లు పని చేసింది. ఇంత టైమ్​ పట్టింది కాబట్టే మంచి గ్రాఫిక్స్‌ను యాడ్​ చేయగలిగాం. మానవ స్పర్శ లేని జీవితాన్ని మనం అస్సలు ఊహించలేం. అలాంటి సమస్య ఎదుర్కొంటున్న అఘోరా శంకర్‌ (విశ్వక్‌ సేన్‌) హిమాలయాల్లో చేసే సాహసోపేత ప్రయాణమే ఈ సినిమా స్టోరీ. మేము వారణాసిలో కుంభమేళా షూటింగ్‌ చేశాం. మైనస్‌ 40 డిగ్రీల్లో కూడా గ్లౌజులు లేకుండానే విశ్వక్‌ నటించారు" అంటూ డైరెక్టర్ చెప్పుకొచ్చారు. మరోవైపు హీరో విశ్వక్ కూడా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్​ విషయాన్ని చెప్పారు.

"నేను ఈ సినిమాలో అఘోరా శంకర్‌ పాత్రలో కనిపిస్తాను. కుంభమేళాలో షూటింగ్​ జరుగుతున్న సమయంలో ఒకరిద్దరు నేను నిజంగానే అఘోరా అనుకుని కొందరు నాకు ధర్మం చేశారు. అంతే కాకుండా వారణాసిలో చలికి వణుకుతూ ఓ మూలన కూర్చున్నప్పుడు కూడా ఓ వృద్ధ మహిళ నా దగ్గరకు వచ్చి భోజనం పెట్టి మరీ టీ ఇచ్చారు. ఇలాంటి ఎన్నో ఘటనలను ఎదుర్కొన్నాను. అంటూ విశ్వక్​ తన షూటింగ్ ఎక్స్​పీరియన్స్​ను పంచుకున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Gaami Movie Cast : ఇక 'గామి'లో విశ్వక్​తో పాటు 'కలర్‌ ఫొటో' ఫేమ్​ చాందిని చౌదరి హీరోయిన్‌గా నటించారు. ఎం జి అభినయ, హారిక పెడాడ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారికా కీలక పాత్రలు పోషించారు. కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ ఈ సినిమాకు నిర్మతగా వ్యవహరించారు.

'అఘోరా' పాత్రల్లో స్టార్ హీరోలు.. తెలుగులో కొత్తేం కాదు!

ప్రమోషన్స్​లో డిసెంబర్ సినిమాలు బిజీ - విశ్వక్​ సైలెన్స్​ వెనక కారణం ఏంటో ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.