ETV Bharat / entertainment

స్టార్ హీరోయిన్​తో ప్రముఖ నిర్మాత రిలేషన్​షిప్​​ - రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్న భార్య!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 5, 2024, 7:19 AM IST

స్టార్ హీరోయిన్​తో ప్రముఖ నిర్మాత రిలేషన్​షిప్​​ - రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్న భార్య!
స్టార్ హీరోయిన్​తో ప్రముఖ నిర్మాత రిలేషన్​షిప్​​ - రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్న భార్య!

ఓ స్టార్ హీరోయిన్​తో ప్రముఖ నిర్మాత రిలేషన్​షిప్ మెయిన్​టెయిన్​ చేస్తున్నట్లు ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ఆ వివరాలు.

సినిమా పరిశ్రమలో సీక్రెట్​ రొమాంటిక్ రిలేషన్​షిప్ గాసిప్స్​ ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. కొంతమంది బహిరంగంగానే లివింగ్ రిలేషన్ షిప్ మెయిన్​టెయిన్​ చేస్తుంటారు. వీటి గురించి వార్తలు ఎప్పుడూ సోషల్​ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అయితే తాజాగా బాలీవుడ్‌లో ఓ స్టార్​ హీరోయిన్​తో ప్రముఖ నిర్మాత రిలేషన్​షిప్​ మెయిన్​టెయిన్​ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం మొదలైంది! వారిద్దరు ఓ రూమ్​లో ఉండగా సదరు నిర్మాత భార్య రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకుందట.

వివరాల్లోకి వెళితే. దుబాయ్‌కి చెందిన ఓ సినీ క్రిటిక్ తాజాగా షాకింగ్​ ట్విట్ చేశాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. ఆ ట్వీట్ ప్రకారం ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ స్టార్​ హీరో హీరోయిన్​ నటించిన రొమాంటిక్ కామెడీ సినిమా రిలీజ్‌కు రెడీ అయింది. ఫిబ్రవరి 9న థియేటర్లలో గ్రాండ్​గా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌ను ఇక్కడే కాకుండా ఫారెన్​లోనూ గట్టిగానే ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా విదేశాలకు వెళ్లారు ఆ సినిమా హీరోయిన్​ అండ్ నిర్మాత. అక్కడ ఫొటలు కూడా దిగి కూడా పోస్ట్ చేశారు.

అక్కడే వారిద్దరు ఓ రూమ్​లో కలిసి ఉన్నట్టుగా, అదే సమయంలో నిర్మాత భార్య వారిని రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకుందని క్రిటిక్​ ట్వీట్ చేశాడు. ఇప్పటికే ఆ నిర్మాత సదరు హీరోయిన్​కు 7 సినిమాల్లో అవకాశం కూడా ఇచ్చారట. 2020 నుంచి వీరిద్దరి మధ్య సీక్రెట్ అఫైర్ నడుస్తున్నట్లు క్రిటిక్ ట్వీట్​లో రాసుకొచ్చాడు. ఆ హీరోయిన్​ పలు తెలుగు సినిమాల్లోనూ నటించింది. రీసెంట్​గా ఓ తెలుగు స్టార్​ హీరోతో కలిసి పాన్ ఇండియా చిత్రంలో నటించి భారీ డిజాస్టర్​ను కూడా అందుకుంది.

అయితే ఇంతకీ ఆ ట్వీట్​ చేసిన క్రిటిక్​ పేరు ఉమైర్​ సంధు. ఈయన ఎప్పుడూ ఇలాంటి షాకింగ్ ట్వీట్స్​ చేస్తూనే ఉంటాడు. ఈ క్రిటిక్ చేసే ట్వీట్​లో ఒక్క నిజముండదని నెటిజన్ల అభిప్రాయం! అయినప్పటికీ ఆయన ట్వీట్స్​ వైరల్​ అవుతుంటాయి.

ఈ వారమే గుంటూరు కారం, కెప్టెన్ మిల్లర్​ - మొత్తం 25కుపైగా సినిమా/సిరీస్​లు రెడీ

బాలయ్య 'భగవంత్​ కేసరి' రీమేక్​ - పోటీ పడుతున్న ముగ్గురు స్టార్ హీరోలు​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.