ETV Bharat / entertainment

బాలయ్య 'భగవంత్​ కేసరి' రీమేక్​ - పోటీ పడుతున్న ముగ్గురు స్టార్ హీరోలు​!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 4, 2024, 1:06 PM IST

Updated : Feb 4, 2024, 2:00 PM IST

Balakrishna Bhagvant Kesari Remake : బాలకృష్ణ సూపర్ హిట్ సినిమా 'భగవంత్ కేసరి' రీమేక్​లో నటించాలని ఆ ముగ్గురు స్టార్​ హీరోలు ఆసక్తి చూపుతున్నారని తెలిసింది. ఆ వివరాలు.

బాలయ్య 'భగవంత్​ కేసరి' రీమేక్​ - పోటీ పడతున్న ఆ ఇద్దరు కోలీవుడ్ స్టార్స్​!
బాలయ్య 'భగవంత్​ కేసరి' రీమేక్​ - పోటీ పడతున్న ఆ ఇద్దరు కోలీవుడ్ స్టార్స్​!

Balakrishna Bhagvant Kesari Remake : ఏదైనా సినిమా హిట్ అయితే రీమేక్ చేయడం ఎప్పుడు నుంచో ఉన్న ట్రెండే. మన హీరోలు ఇతర భాషల చిత్రాలను రీమేక్ చేస్తే అక్కడి వాళ్లు మన కథానాయకుల చిత్రాలను రీమేక్​ చేసి హిట్ కొడుతుంటారు. అయితే ఇప్పుడు సౌత్​లో బాలయ్య నటించిన ఓ సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ మూవీ కోసం ముగ్గురు సౌత్ హీరోలు పోటీ పడుతున్నారని తెలిసింది.

వివరాల్లోకి వెళితే. నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన బెస్ట్ హిట్స్​లో ఒకటిగా నిలుస్తుంది భగవంత్ కేసరి. గత ఏడాది దసరా విన్నర్​గా నిలిచిన ఈ చిత్ర రీమేక్ కోసం ప్రస్తుతం ఇతర భాషల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. ముఖ్యంగా తమిళ, కన్నడలో భారీగా డిమాండ్ ఉందని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.

పొలిటికల్​ ఎంట్రీ ముందు నిర్మాత డివివి దానయ్య నిర్మించబోయే తన చివరి చిత్రానికి ఈ కథ అయితే బాగుంటుందని విజయ్ దళపతి అభిప్రాయపడ్డారని సినీ వర్గాల్లో మాటలు వినిపిస్తున్నాయి. భయపడే ఒక అమ్మాయికి స్ఫూర్తినిచ్చి ఆమె జీవితాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే బాలయ్య పాత్ర విజయ్​కు బాగా నచ్చిందని అంటున్నారు. అందుకే తన ఇమేజ్​కు తగ్గట్టు కొన్ని మార్పులతో ఈ సినిమా చేస్తే ఎలా ఉంటుందా అని విజయ్​ ఆలోచిస్తున్నారట. ఇంకా దీనిపై తుది నిర్ణయమైతే తీసుకోలేదు.

ఒకవేళ విజయ్​ కాకపోతే ఈ స్టోరీ సూపర్ స్టార్​ రజనీ కాంత్ దగ్గరకు వెళ్లే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కథపై ఆయన ఆసక్తి చూపించినట్లు టాక్ వినిపిస్తోంది. కానీ ఇప్పుడాయన వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు కాబట్టి కాస్త డౌటే. కన్నడలో సూపర్ స్టార్​ శివరాజ్ కుమార్ కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. అసలే శివ రాజ్​కుమార్​కు -బాలకృష్ణ మధ్య ఘాడమైన స్నేహం ఉంది. ఒకవేళ ఆయన నిజంగా చేయాలనుకుంటే రైట్స్​ను దక్కించుకోవడం ఆయనకు పెద్ద కష్టమేమి కాదు. అయితే ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్నందున ఇంకా డిసైడ్ అవ్వలేదు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అఫీషియల్​ - ఆ రోజు నుంచే ఓటీటీలోకి 'గుంటూరు కారం'

మొత్తం 40 సినిమాలు - ఈ ఏడాదే 15 రిలీజ్​లు - మూవీ లవర్స్​కు పండగే!

Last Updated : Feb 4, 2024, 2:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.