ETV Bharat / entertainment

'టిల్లు క్యూబ్' ఇంట్రెస్టింగ్ బజ్- సిద్ధు మూవీకి డైరెక్టర్ కన్ఫార్మ్! - Tillu Cube Director

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 22, 2024, 12:28 PM IST

Tillu Cube Movie Director
Tillu Cube Movie Director

Tillu Cube Movie Director: టాలీవుడ్ రీసెంట్ బ్లాక్​బస్టర్ ఎంటర్​టైనర్ 'టిల్లు స్క్వేర్' సీక్వెల్​కు సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. టిల్లు క్యూబ్ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు దర్శకుడు కన్ఫార్మైనట్లు తెలుస్తోంది.

Tillu Cube Movie Director: టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ- మల్లిక్ రామ్​ కాంబోలో తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. 'డీజే టిల్లు'కు సీక్వెల్​గా తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' మూవీ మార్చి 29న రిలీజై బాక్సాఫీస్ వద్ద రూ.125+ కోట్ల వసూళ్లు అందుకుంది. ఈ క్రమంలో మూవీటీమ్ టిల్లుకు కొనసాగింపుగా మూడో పార్ట్​ 'టిల్లు క్యూబ్' కూడా ఉంటుందని హింట్ ఇచ్చింది.

అయితే 2022లో వచ్చిన టిల్లు తొలి భాగం DJ టిల్లు సినిమాను విమల్ కృష్ణ తెరకెక్కించారు. ఆయనకు ఇదే తొలి సినిమా. అరంగేట్ర చిత్రంతోనే విమల్ సక్సెస్ అందుకున్నారు. ఇక రీసెంట్​గా థియేటర్లలో సందడి చేసిన టిల్లు స్క్వేర్ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ రెండింటికీ హీకో సిద్ధు కో రైటర్​గా పని చేశారు. ఇక మూడో భాగం టిల్లు క్యూబ్ అనౌన్స్​ చేసిన తర్వాత ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారు? వీరిలో ఒకరిని ఎంచుకుంటారా? లేదా కొత్త వారిని ఎంపిక చేస్తారా? అనే ప్రశ్నలు సినీలవర్స్​ మదిలో మెదిలాయి. అయితే 'మ్యాడ్', 'టిల్లు స్క్వేర్' సినిమాలు ఒకే ప్రొడక్షన్ బ్యానర్ (సితారా ఎంటర్​టైన్​మెంట్స్) ​లో రూపొందడం వల్ల ఇది నిజమేనని ఫ్యాన్స్ అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇటీవల సూపర్ హిట్ సాధించిన యూత్​ఫుల్ ఎంటర్​టైనర్​ 'మ్యాడ్' (MAD) తెరకెక్కించిన కల్యాణ్ శంకర్, టిల్లు క్యూబ్​కు దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం కల్యాణ్ మ్యాడ్- 2 అనౌన్స్ చేశారు. ఆయన ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్​లో బిజీగా ఉన్నారు. ఇది పూర్తైన తర్వాత కల్యాణ్, టిల్లు క్యూబ్ స్టోరీ స్టార్ట్ చేయనున్నాడని సమాచారం. అయితే ఈ సీక్వెల్​కు కూడా సిద్ధు కో రైటర్​గా పనిచేసే ఛాన్స్ ఉంది. కాగా డెరెక్టర్ కల్యాణ్ 2021లో మంచి విజయం సొంతం చేసుకున్న 'జాతి రత్నాలు' సినిమాకు స్క్రిప్ట్ రైటర్​గా పనిచేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఓటీటీలో టిల్లు మేనియా - స్ట్రీమింగ్ ఎక్కడంటే ? - Tillu Square OTT

రూ.100 కోట్ల క్లబ్​లోకి సిద్ధు- బాక్సాఫీస్ వద్ద టిల్లు స్క్వేర్ డబుల్ జోరు - Tillu Square Collections

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.