ETV Bharat / entertainment

నటి షకీలాపై పెంపుడు కుమార్తె దాడి - పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 21, 2024, 6:42 PM IST

Updated : Jan 21, 2024, 7:09 PM IST

Etv Bharat
Etv Bharat

Shakeela Attacked By Her Daughter : నటి షకీలా పోలీసులను ఆశ్రయించారు. తనపై పెంపుడు కుమార్తె దాడి చేసిందని ఫిర్యాదు చేశారు.

Shakeela Attacked By Her Daughter : నటి షకీలాకు చేదు అనుభవం ఎదురైంది. ఆమెపై తన పెంపుడు కుమార్తె శీతల్‌ దాడి చేసినట్లు తెలిసింది. ఈ మేరకు షకీలా పోలీసులకు కంప్లైంట్​ చేసింది. కుటుంబ వ్యవహారాల విషయంలో మనస్పర్థలు తలెత్తడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది. మనస్పర్థల కారణంగా శీతల్‌ నిన్న(జనవరి 20) ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత చర్చించుకునేందుకు రమ్మని పిలిస్తే తన సొంత తల్లిని వెంటపెట్టుకుని శీతల్​ వచ్చినట్లు తెలిపిన షకీల ఆ సమయంలో నచ్చ జెప్పడానికి ప్రయత్నించినప్పటికీ కోపంతో తనపై శీతల్​ దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

ఘర్షణ సమయంలో అక్కడే ఉన్న మహిళా న్యాయవాదితో శీతల్‌ తల్లి కూడా విచక్షణారహితంగా ప్రవర్తించిందని షకీల తెలిపింది. మరోవైపు అదే పోలీస్‌ స్టేషన్‌లో షకీలాపై శీతల్‌ కూడా కంప్లైంట్​ చేసింది. ఇద్దరి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసు అధికారులు సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేస్తామని అన్నారు.

కాగా, శీతల్‌ --- షకీలా అన్న కుమార్తే కావడం గమనార్హం. శీతల్​కు ఆరు నెలల వయసు ఉన్నప్పుడు నుంచే కూతురిలా పెంచిందట షకీల. ఈ విషయాన్ని శీతల్​ చాలా వేదికలపై కూడా చెప్పింది! షకీల తన మేనత్త కాదని, అమ్మ అని చెప్పేది. అయితే ఇప్పుడు శీతల్ షకీలాపై దాడి చేయడం కోలీవుడ్ ఇండస్ట్రీని షాక్​కు గురి చేసింది.

Shakeela Career : షకీలకు అప్పట్లో మలయాళ సినిమాల్లో ఆమెకు ఉండే క్రేజే వేరు. మాలీవుడ్‌లో బీ గ్రేడ్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్​ను సంపాదించుకుంది. మలయాళ స్టార్ హీరోలకు దీటుగా ఈమె నటించిన చిత్రాలు హిట్​ అయ్యేవి. కానీ ఆ తర్వాత కొంత కాలానికి షకీలా అలాంటి సినిమాలకు గుడ్​ బై చెప్పేసింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా మారి తెలుగులోనూ పలు సినిమాలు చేసింది. ఇకపోతే షకీల బిగ్​బాస్​ తెలుగు సీజన్​ 7లో పాల్గొన్న సంగతి తెలిసిందే. కానీ ఎక్కువ రోజులు ఆమె అందులో ఉండలేకపోయింది. అయితే రీసెంట్​గా 'కుక్ విత్ కోమలి' అనే షో షకీల ఇమేజ్​ను పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు కోలీవుడ్​ ఇండస్ట్రీలో చాలా మంది ఆమెను అమ్మ అని కూడా పిలుస్తున్నారు.

సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - వీరలెవల్​లో ఆ బ్లాక్​బస్టర్​ మూవీకి సీక్వెల్!

బాలయ్య సినిమాలో విలన్​గా బిగ్​బాస్ శివాజీ!

Last Updated :Jan 21, 2024, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.