ETV Bharat / entertainment

'కాల్పులు జరిపింది మేమే, ఈసారి టార్గెట్ మిస్ అవ్వదు!'- సల్మాన్​కు మరో వార్నింగ్ - Salman Khan Threatened

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 14, 2024, 7:10 PM IST

Updated : Apr 14, 2024, 8:01 PM IST

Salman Khan Threatened
Salman Khan Threatened

Salman Khan Threatened: బాలీవుడ్‌ స్టార్ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఇంటి వద్ద కాల్పుల ఘటనపై ముంబయి పోలీసులు ఎఫ్​ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ కాల్పులు జరిపింది తామే అంటూ గ్యాంగ్​స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరిట ఉన్న ఫేస్​బుక్​ అకౌంట్​ నుంచి ఓ ప్రకటన వచ్చింది.

Salman Khan Threatened: బాలీవుడ్‌ స్టార్ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఇంటి వద్ద కాల్పులు జరిపింది తామే అంటూ గ్యాంగ్​స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరిట ఉన్న ఫేస్​బుక్​ అకౌంట్​ నుంచి ఓ ప్రకటన వచ్చింది. 'ఇప్పుడు జరిగింది ట్రైలర్​ మాత్రమే. మా బలంమేంటో ఇప్పటికే నీకు తెలిసి ఉంటుంది. మా సహనాన్ని పరీక్షించొద్దు. ఇది నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. నెక్ట్స్​ టైమ్ తుపాకీ పేలుడు ఇంటి బయటే ఆగిపోదు. మా టార్గెట్ మీస్ అవ్వదు' అని పోస్ట్​లో రాసి ఉంది. ఈ పోస్ట్​కు సంబంధించి స్క్రీన్ షాట్​​​ సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ఆదివారం (ఏప్రిల్ 14) ఉదయం సల్మాన్‌ఖాన్‌ ఇంటి బయట కాల్పులు కలకలం సృష్టించాయి. ముంబయిలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌ ఆయన ఇంటి వద్ద ఇద్దరు దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ దుండగులు మోటార్ ​సైకిల్​పై పరారైనట్లు అక్కడున్న సీసీటీవీ పుటేజీల్లో రికార్డైంది. దీనిపై ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో తమకు సమాచారం అందినట్లు పోలీసులు వెల్లడించారు. క్రైమ్​ బ్రాంచితో పాటు స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్‌ నిపుణులు సైతం అక్కడికి చేరుకున్నారు. ఇక విచారణ చేపట్టిన ముంబయి పోలీసులు, సల్మాన్ ఖాన్ ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న బైక్​ను స్వాధీనం చేసుకొని ఘటనపై ఎఫ్​ఐఆర్ నమోదు చేశారు. ఈ బైక్​ను దుండగులు వాడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

అయితే కొంతకాలంగా బాలీవుడ్ స్టార్ సల్మాన్​ ఖాన్​కు వరుసగా బెదిరింపులు వస్తున్నాయి. ఈ క్రమంలో గతేడాది రెండుసార్లు సోషల్ మీడియా, ఈమెయిల్స్ ద్వారా సల్మాన్​కు బెదిరింపు హెచ్చరికలు పంపారు. చివరిసారిగా 2023 నవంబర్​లో​ 'మరణానికి వీసా అవసరం లేదు' అంటూ సల్మాన్​ను హెచ్చరించారు. అయితే కృష్ణజింకలను వేటాడిన కేసు విచారణ జరుగుతున్న సమయంలో బిష్ణోయ్‌ల మనోభావాలను సల్మాన్‌ దెబ్బతీశారంటూ 2018లో లారెన్స్‌ బిష్ణోయ్‌ వ్యాఖ్యానించాడు. ఇక ఇదే విషయంపై సల్మాన్​కు మెయిల్‌లో బెదిరింపులు వచ్చినట్లు గతంలో పోలీసులు వెల్లడించారు.

సల్మాన్​ ఖాన్​కు బెదిరింపులు! - చావుకు వీసా అక్కర్లేదంటూ వార్నింగ్!

'వారిని ప్రమాదంలోకి నెట్టకుండా హాయిగా సినిమాను చూద్దాం'- క్రాకర్స్​ ప్రమాదంపై సల్మాన్

Last Updated :Apr 14, 2024, 8:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.