ETV Bharat / entertainment

'రౌడీ ఇన్​స్పెక్టర్​' వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీ - ఆయన వద్దన్నారు, ఈయన హిట్ కొట్టారు

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 21, 2024, 9:45 PM IST

Rowdy Inspector Movie Story : ఓ స్టార్ హీరో రిజెక్ట్ చేసిన కథతో మరొకరు హీరో హిట్ కొట్టిన సందర్భాలను మనం చాలానే చూసుంటాం. టాలీవుడ్​లోనూ ఇద్దరు స్టార్ హీరోల మధ్య ఇటువంటి ఆసక్తికరమైన ఘటన జరిగింది. ఆ విశేషాలు మీ కోసం

Rowdy Inspector Movie Story
Rowdy Inspector Movie Story

Rowdy Inspector Movie Story : ఇండస్ట్రీలో ఒక్కో సినిమాకు ఒక్కో హిస్టరీ ఉంటుంది. ఓ స్క్రిప్ట్​ను తెరకెక్కిద్దామని అనుకున్న డైరెక్టర్​ అందులో కొంత మందిని పెట్టి తీస్తే బాగుంటుందని అనుకుని తొలుత వారిని అప్రోచ్ అవుతుంటారు. అయితే ఆ తర్వాత మరోకరిని పెట్టి సినిమా తీస్తుంటారు. అలా పలు సినిమాలకు హీరో, హీరోయిన్​, సపోర్టింగ్ రోల్స్ ఇలా అన్నీ మారుతుంటాయి. ఇలాంటి ఘటనే మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలయ్య మధ్య జరిగింది. కొన్ని కారణాల వల్ల ఒకరు వద్దనకున్న వద్దనుకున్న కథతో మరొకరు హిట్ కొట్టారట. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే?

1992లో విడుదలైన 'రౌడీ ఇన్​స్పెక్టర్' సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెపనక్కర్లేదు. టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ బి. గోపాల్ తెరకెక్కించిన ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ, విజయశాంతి లీడ్​ రోల్స్​లో మెరిశారు. అయితే ఈ సినిమాను మొదట మెగాస్టార్ చిరంజీవితో తీయాలని డైరెక్టర్ భావించారట. హీరోకు కథను కూడా వినిపించారు. ఇక చిరంజీవికి కూడా ఈ స్టోరీ బాగా నచ్చిందట. కానీ కాల్షిట్లు లేకపోవడం వల్ల చిరు డైరెక్టర్​కు నో చెప్పారట. దీంతో ఆ తర్వాత ఈ స్టోరీని బాలయ్యకు వినిపించారు డైరెక్టర్​ గోపాల్. ఇక బాలయ్యకు ఈ సినిమా బాగా నచ్చిందట. దీంతో ఆయన ఓకే చెప్పారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ అందుకుని అనేక రికార్డులను బద్దలకొట్టింది. అలా చిరు ఖాతాలో పడాల్సిన హిట్ బాలయ్య బాబు ఖాతాలో పడిపోయింది. అయితే ఈ మూవీ చూసిన తర్వాత చాలా మంది ఆ రోల్​ బాలయ్యకే బాగా సెట్ అయ్యిందని అన్నారు. ఆ పాత్రలో ఆయన నటించిన తీరు అందర్నీ ఆకట్టకుంది.

ఇక బాలకృష్ణ - బి.గోపాల్ కాంబినేషన్​లో టాలీవుడ్​లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. 'లారీ డ్రైవర్', 'రౌడీ ఇన్ స్పెక్టర్', 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు' వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఉండగా, 'పల్నాటి బ్రహ్మనాయుడు' ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయింది.

'అఖండ 2' బిగ్ లీక్​​ - నందమూరి ఫ్యాన్స్​కు పూనకాలు లోడింగ్​!

'విశ్వంభర' - 68 ఏళ్ల వయసులో జిమ్‌లో మెగాస్టార్ కసరత్తులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.