ETV Bharat / entertainment

'గేమ్​ఛేంజర్'​ కోసం ​చరణ్ డేంజరస్​​ రిస్క్​ - 12 గంటలకు పైగా అక్కడే ఉండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 20, 2024, 11:09 AM IST

Ramcharan Game Changer Shooting : రామ్​చరణ్​ గేమ్​ ఛేంజర్​ కోసం విష వాయువులు ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలో రిస్క్​ చేస్తున్నట్లు తెలిసింది. దాదాపు 12 గంటలకన్నా ఎక్కువగా అదే ప్రాంతంలో షూటింగ్ చేస్తున్నారట. ఆ వివరాలు.

గేమ్​ఛేంజర్​ కోసం ​చరణ్ డేంజరస్​​ రిస్క్​
గేమ్​ఛేంజర్​ కోసం ​చరణ్ డేంజరస్​​ రిస్క్​

Ramcharan Game Changer Shooting : అత్యంత భారీ బడ్జెట్‌తో మెగా పవర్​ స్టార్​ రామ్​చరణ్​ - దిగ్గజ దర్శకుడు శంకర్​ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'గేమ్ చేంజర్'. రీసెంట్​గానే ఈ సినిమా షూటింగ్​ పున:ప్రారంభమైంది. అయితే తాజాగా రామ్​చరణ్​ గురించి ఓ షాకింగ్​ విషయం బయటకు వచ్చింది. ఈ వార్త విన్న మెగా అభిమానులు ఓ వైపు కాస్త ఆందోళన చెందుతూనే మరోవైపు చరణ్​ డెడికేషన్​ లెవల్స్​ను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.

వివరాల్లోకి వెళితే. గేమ్​ ఛేంజర్ షూటింగ్​ హైదరాబాద్‌లోని విష వాయువులు ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలో జరుగుతున్నట్లు తెలిసింది! ఇందులో ఓ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు కీలకమైన సన్నివేశాలను షూట్ చేస్తున్నారట. ఈ షెడ్యూల్​ను హీరో రామ్​చరణ్​పై చిత్రీకరిస్తున్నారట. చరణ్​ ఈ సీక్వెన్స్​లో ఎన్నో రిస్కీ షాట్స్ చేస్తున్నట్లు తెలిసింది. దాదాపు పన్నెండు గంటలకన్నా ఎక్కువగా ఈ కెమికల్ ఫ్యాక్టరీలోనే చరణ్​ షూట్​లో పాల్గొన్నారట. ఎంతో రిస్క్ అయినప్పటికీ ఈ సీక్వెన్స్​ను రియల్ ఎన్విరాన్​మెంట్​లోనే తీయాలని దర్శకుడు శంకర్​ గట్టిగా ఫిక్స్​ అయ్యారట.

ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి మెగా అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. అలానే వర్క్​ పట్ల చరణ్​ డెడికేషన్ గురించి గొప్పగా ప్రశంసిస్తున్నారు. అయితే, ఈ షూటింగ్ స్పాట్‌లో మూవీటీమ్​ ఎన్నో జాగ్రత్తలు తీసుకుందట.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Game Changer Release Date రిలీజ్ డేట్​ : దర్శకుడు శంకర్​ ఒకవైపు ఇండియన్ 2 పనులు చూసుకుంటూనే మరోవైపు గేమ్​ఛేంజర్​నూ ముగించేలా బ్యాలెన్స్ చేస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాదే గేమ్​ ఛేంజర్​ను రిలీజ్ చేసేలా ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు పట్టుదలగా ఉన్నారు. కానీ ఈ మూవీ ఫస్ట్ కాపీ ఎప్పుడు సిద్ధమవుతుందో తెలియట్లేదు. అయితే ఫ్యాన్స్​ గాంధీ జయంతి లేదా దసరాకు వస్తే పర్ఫెక్ట్​గా ఉంటుందని ఆశిస్తున్నారు.

అక్టోబర్ 2 గాంధీ జయంతి. ఆ తర్వాతి రోజు తెలంగాణలో బతుకమ్మ. 4, 5, 6 తేదీల్లో లాంగ్ వీకెండ్. అనంతరం 11, 12 విజయదశమి కాగా 13 ఆదివారం. అంటే హాలీడేస్ వరుసగా ఉన్నాయి. సినిమా బ్లాక్ బస్టర్ హిట్​ టాక్ అందుకుంటే దాదాపు పది రోజులకు పైగా బాక్సాఫీస్ మీద పట్టు సాధించొచ్చు. కాబట్టి అప్పుడు ఎలాగైనా రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

ప్రశాంత్ నీల్​ నెక్ట్స్​ లైనప్​ : ముందు ప్రభాస్​ - తర్వాత తారక్​!
'అది నన్ను బాగా దెబ్బతీసింది - ఆ విషయం వల్ల డిప్రెషన్​లోకి వెళ్లాను'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.